Karthika Deepam 05 Oct Today Episode : నీకు దుర్గకి మధ్యలో అడ్డుగా ఉన్నానని నన్ను లేపేద్దామనుకుంటున్నావా అని అంటున్న కార్తీక్… కంగారు పడుతున్న దీప…!

 Authored By prabhas | The Telugu News | Updated on :5 October 2022,9:04 am

Karthika Deepam 05 Oct Today Episode : బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్ కార్తీక దీపం. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఈరోజు ఎపిసోడ్ 1475 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.. మౌనిత నేను ఫోన్ చేయలేదు కార్తీక్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నీ ఫోన్ నుంచి నువ్వు చేయకుండా కాల్ ఎలా వెళ్తుంది అని అంటాడు. అప్పుడు దుర్గ సార్ ఏమనుకోరులేమో మోనిత అంటూ మా ఊర్లో సామ్రాజ్యం అనే ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ దగ్గర వర్షం పడితే చాలు మేము ఇద్దరం కలిసి సైకిల్ మీద వెళ్లి అలా పకోడీలు తినేవాళ్ళం అని మౌనితకి రీ కౌంటర్ ఇస్తాడు. ఇక కార్తీక్ ఆనంద్ లేచినట్టు ఉన్నాడు నేను వెళ్తున్నాను మీరు మాట్లాడండి అని కోపంగా అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఇక లాస్య దుర్గ కాలర్ పట్టుకుని నీకు సామ్రాజ్యం ఎవరో తెలుసా మనం సైకిల్ మీద వెళ్లే వాళ్ళమ అని అడుగుతుంది. అప్పుడు దుర్గ నీకు తెలుసా నువ్వు కార్తీక్ చెప్పిందే నేను చెప్పాను అని అంటాడు. నీకు అసలు నేనేం అన్యాయం చేశానని ఇలా చేస్తున్నావ్ అని కోప్పడుతూ ఉంటుంది. ఇక దుర్గ దీప మ్మ విషయంలో విహారి ని ఇలాగే చేశావు కదా.. నేను కూడా అలాగే చేస్తా ఇక నీకు రాత్రికి పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నాను రెడీగా ఉండు బంగారం అని దుర్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

ఇక కార్తీక్ ఏం జరుగుతుంది ఏంది అసలు అని మౌనిత మాటలు దుర్గ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు.  ఇక అంతలో ఎదురుగా దీప, పెద్దావిడ, డాక్టర్ పూల డెకరేషన్ చేస్తూ సంతోషంగా ఉండడం కార్తీక్ చూసి తనకి గతంలో జరిగింది గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత దీని వంటలక్క అని పిలిచి తర్వాత దీప అని పిలుస్తాడు. అప్పుడు డాక్టర్ బాబు అప్పుడు కార్తీక్ ఏంటి పూలయ్యే పెడుతున్నారు ఏమైనా పండగ ఉందా… అప్పుడు దీప పెద్ద పండుగ నా జీవితంలో అని అంటుంది. అప్పుడు కార్తిక్ ఏంటి ఆ పండగ అని అనగానే.. దీప సస్పెన్స్ డాక్టర్ బాబు అని అంటుంది. అప్పుడు మౌనిత వచ్చి తనను ఆక్కడి నుంచి తీసుకొస్తుంది. ఇక ఈరోజు ఏం పండుగ దీప ఎందుకు సెలబ్రేట్ చేస్తుంది అనగానే.. అదొక పిచ్చిది లే అలాగే చేస్తుంది. అని క్యాలెండర్ చూపించి ఈరోజు ఏమి పండగ లేదు అని చెప్తుంది మౌనిత. కట్ చేస్తే దీప డాక్టర్ పెద్దావిడ సరదాగా భోజనం చేస్తూ సంతోషంగా నా డాక్టర్ బాబు నన్ను దీప అని పిలిచి నందుకు చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుకుంటూ ఉంటారు. కట్ చేస్తే మోనిత దీప ఎందుకు అంత సంతోషంగా ఉందని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఏమైంది మౌనిత తినకుండా అలా ఆలోచిస్తున్నావు అని అడగగానే.. ఏం లేదు అని మెటీరియల్ గురించి ఆలోచిస్తున్నానని తప్పించుకుంటుంది.

Karthika Deepam 05 october 2022 full episode

Karthika Deepam 05 october 2022 full episode

అంతేనా దీప గురించి ఆలోచిస్తున్నావేమో అనుకున్నాను అని అనగానే.. నేను దాని గురించి ఎందుకు ఆలోచిస్తాను అయినా నీకు ఉదయం చెప్పాను కదా అని అనగానే నాకు ఉదయం చెప్పావా అని అంటాడు. అప్పుడు మౌనిత నీకు చెప్పిందేమో గుర్తుండదు మర్చిపోతావ్ అని అనగానే… చెప్పకుండా చెప్పావు అంటున్నావు నువ్వు ఒకటి చెప్తే నాకు ఇంకోటి గుర్తుకొస్తుంది. అసలు నాకేదో పిచ్చిపిచ్చిగా ఉంటుంది. మనసు బాగా లేనప్పుడు ఫ్రెండ్స్ దగ్గరికి రిలేటివ్స్ దగ్గరికి వెళ్తారు. కానీ వాళ్ళు ఎవరు నాకు లేరు నాకు పిచ్చి లేస్తుంది అని అంటాడు. అప్పుడు మౌనిత నేనున్నాను కదా కార్తీక్ నీ బాధను పంచుకోవడానికి అని అనగానే నాకు నువ్వు మాత్రమే ఉన్నావా నాకు బంధువులు, ఫ్రెండ్స్ ఎవరు లేరా లేదా నువ్వే లేకుండా చేసావా అసలు నిజంగా నువ్వు నా భార్యమైన నాకు అనుమానం వస్తుంది. ఆ వంటలక్కమే భార్య అంటుంది. అనగానే.. నువ్వు నాతో ఉన్నావు తను నీకోసం వచ్చింది ఇదొక్కటి చాలు కార్తీక్ అని అనగానే… ఇది చాలదు నాకు గతం గుర్తుకొచ్చే వరకు ఏది అబద్దం ఏది నిజం ఏది నమ్మాలో నాకు తెలియదు కాబట్టి నేను ఏది డిసిషన్ తీసుకోలేను నమ్మను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు మౌనిత నేను ఏదైతే జరగకూడదు అనుకున్నాను అదే జరుగుతుంది.

ఈ దుర్గ వల్ల ఈ దుర్గని ఇకనుంచి పంపించేయాలి లేదా మేమైనా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలి లేకపోతే కార్తీక్ మళ్లీనా జారిపోతాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. మౌనిత దీప ఈరోజు పెద్ద పండగ అని అన్నది ఈ దుర్గ రాత్రి నీకు ఒకటి ట్విస్ట్ ఇవ్వబోతున్నాను అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ నాకు నిద్ర లేకుండా చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో దీప వాళ్లు వచ్చి డోర్ కొడుతూ ఉంటారు. అప్పుడు మౌనిత అర్ధరాత్రి పూట తలుపులు కొడుతుంది ఏంటి ఈ టైం లో దీనికేం పని అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నిద్రలేచి వస్తాడు. ఆప్పుడు కార్తీక్ వెళ్లి డోర్ తీగానే దీప కార్తీక్ ని డాక్టర్ బాబు అప్పుడే నిద్రపోయారా అని అడుగుతుంది. అప్పుడు మౌనిత అర్ధరాత్రి పూట నిద్రపోక ఏం చేస్తారే అని అంటూ ఉంటుంది. అప్పుడు దీప మౌనిత నేట్టేసి లోపలికి వచ్చి అంతా చూస్తూ ఏంటి ఏమి ఏర్పాట్లు చేయలేదు అని అంటూ.. ఉంటుంది.

అప్పుడు మౌనిత ఇన్ని రోజులు ఒక్కదానివే అనుకుంటే మళ్ళీ అందరిని కలిసి తీసుకుని వచ్చి దండయాత్ర చేస్తున్నావా.. బయటికి నడవండి అందరూ అని అంటుంది. అప్పుడు దీప అరే పండగ చేసుకుందామని వస్తే నువ్వేంటి బయటికి పొమ్మంటున్నావ్ అని అంటుంది. అప్పుడు కార్తీక్ కూడా నీకు నాకు తెలియని పండగలుంటాయిలే నువ్వు ఊరుకో అని మౌనిత అని అంటాడు. నువ్వు చెప్పు వంటలక్క ఏం పండగ అని అడుగుతాడు. నా జీవితంలో పెద్ద పండుగ నీ పండగే మీ పుట్టినరోజు పండగ అని దీపా అంటుంది. అప్పుడు కార్తీక్, మౌనిత షాక్ కి గురవుతారు. ఇక రేపటి ఎపిసోడ్ లో దీప కార్తీక్ దగ్గరికి వచ్చి చూస్తే ఎవరు ఉండరు అప్పుడు ఎవరూ లేరు ఏంటి డాక్టర్ బాబు ని ఎక్కడికైనా తీసుకెళ్లింద అని అనుకుంటూ ఉంటుంది. ఇక మౌనిత కార్తీక్ కార్లు వెళ్తూ ఉండగా.. కార్తీక్ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నీకు ,దుర్గకి మధ్యలో అడ్డొస్తున్నానని నన్ను లేపేద్దామనుకుంటున్నావా అని అంటూ ఉంటాడు. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి