The Ghost Movie Review : నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

The Ghost Movie Review : నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

 Authored By gatla | The Telugu News | Updated on :5 October 2022,1:00 am

The Ghost Movie Review : ది ఘోస్ట్ పేరుతో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ది ఘోస్ట్ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 5, 2022 న విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ప్రదర్శించారు. ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేయగా, నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్ ప్రముఖ పాత్రల్లో నటించారు. మనిష్ చౌదరి ముఖ్య పాత్రల్లో నటించాడు. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ గా ప్రవీణ్ సత్తారు తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్స్, ప్రమోషనల్ యాక్టివిటీస్ సినిమా రేంజ్ ను ఒక్కసారిగా పెంచాయి. ఇప్పటికే ఇలాంటి జానర్ లో నాగార్జున గగనం, వైల్డ్ డాగ్ అనే సినిమాల్లో నటించారు. తాజాగా అదే జానర్ లో ది ఘోస్ట్ అనే సినిమాను చేశారు.

The Ghost Movie Review and rating in Telugu

The Ghost Movie Review and rating in Telugu

సినిమా పేరు : ది ఘోస్ట్

నటీనటులు : నాగార్జున అక్కినేని, సోనాల్ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖ సురేంద్రన్ తదితరులు

డైరెక్టర్ : ప్రవీణ్ సత్తారు

నిర్మాతలు : శరత్ మరార్, సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ రావు

విడుదల భాష : తెలుగు

విడుదల తేదీ : అక్టోబర్ 5, 2022

The Ghost Movie Review : సినిమా స్టోరీ ఏంటి?

ది ఘోస్ట్ అనే సినిమా స్టోరీ విక్రమ్ అనే మాజీ ఇంటర్ పోల్ ఆఫీసర్ కు సంబంధించిన స్టోరీ. కొన్ని రోజుల పాటు ఆయన అండర్ వరల్డ్ కు వెళ్లిపోతాడు. అయితే.. తన సోదరి, తన సోదరి కూతురును కాపాడుకోవడం కోసం అండర్ వరల్డ్ లో ఉన్న విక్రమ్ కాస్త బయటికి వస్తాడు. తన టీమ్ తో కలిసి పోరాడి తన సోదరిని, ఆమె కూతురును ఎలా కాపాడుతాడు అనేదే మిగితా స్టోరీ.

ఈస్ట్ అరేబియాలోని ఓ ఆపరేషన్ కు వెళ్లిన విక్రమ్, ప్రియ(సోనాల్ చౌహాన్) దాన్ని సక్సెస్ చేస్తారు. వీళ్లిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. అయితే.. మరో ఆపరేషన్ ఫెయిల్ అవడంతో విక్రమ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోతాడు. ప్రియ మాత్రం ఎన్సీబీలో చేరుతుంది. ముంబైకి షిఫ్ట్ అవుతుంది. ఐదేళ్ల తర్వాత తన నాగార్జున సోదరి గుల్ పనాగ్(అను) ఫోన్ చేసి తన కూతురును చంపేయబోతున్నారని, తమ లైఫ్ రిస్క్ లో ఉందని నాగార్జునకు చెప్పి వేడుకుంటుంది. దీంతో విక్రమ్ ఊటీకి వెళ్తాడు. అక్కడ తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి అను, తన కూతురు అదితిని కాపాడుతాడు. అసలు.. విక్రమ్ సోదరిని, తన కూతురును ఎందుకు చంపాలనుకుంటున్నారు. అసలు విక్రమ్ ఎవరు? ఆయన చిన్నతనంలో ఏం జరిగింది? ప్రియ తిరిగి విక్రమ్ దగ్గరికి వచ్చేస్తుందా? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాకు కథ, దర్శకత్వం వహించింది ప్రవీణ్ సత్తారు. ప్రవీణ్ సత్తారు మొదటి మూవీ పీఎస్వీ గరుడ వేగ ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాగార్జున ఇంటర్ పోల్ ఆఫీసర్ గా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం కొన్ని నెలల పాటు కత్తి, గన్ ట్రెయినింగ్ ను తీసుకున్నారు నాగార్జున. ఇలాంటి పాత్రలు చేయడం అంటే నాగార్జునకు పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకంటే ఇలాంటి జానర్ లో నాగార్జున ఇప్పటికే చాలా సినిమాలు చేశాడు. చాలా సినిమాల్లో నటించాడు. గగనం, ఆఫీసర్, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలన్నీ ఆ తరహా సినిమాలే. అయితే.. ఈ సినిమా మాత్రం ఫుల్ టు ఫుల్ యాక్షన్ అండ్ ఛేజింగ్ గా ఉంటుంది. అయితే.. ఈ సినిమాలో కాస్త రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంటుంది. దాన్ని కూడా టచ్ చేశాడు డైరెక్టర్. విక్రమ్ క్యారెక్టరైజేషన్ ను పర్ ఫెక్ట్ గా సెట్ చేశాడు ప్రవీణ్ సత్తారు. తనకు ఇది రెండో సినిమా అయినప్పటికీ రిచ్ లుక్ తో సినిమాను తీశాడు. ఇక.. నాగార్జున అక్కగా నటించిన గుల్ పనాగ్, ఆమె కూతురుగా నటించిన అనిఖా సురేంద్రన్ బాగా నటించారు. అలాగే విలన్ గా మనీశ్ చౌదరి ఆకట్టుకున్నాడు.

ప్లస్ పాయింట్స్

యాక్షన్, ఛేజింగ్ సీన్స్

విక్రమ్ క్యారెక్టరైజేషన్

డైరెక్షన్

మైనస్ పాయింట్స్

ఫ్లాష్ బ్యాక్

మిస్ అయిన ఎమోషన్

కన్ క్లూజన్

చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఒక యాక్షన్, ఛేజింగ్ త్రిల్లర్ ను ఒకే వేదిక మీద కావాలనుకునే వాళ్లు ఈ సినిమాకు ఖచ్చితంగా వెళ్లొచ్చు.

దితెలుగున్యూస్ రేటింగ్ : 3/5

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది