Heroine : ఆ హీరో కోసం పడి చచ్చిపోతోన్న ఆ హీరోయిన్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Heroine : ఆ హీరో కోసం పడి చచ్చిపోతోన్న ఆ హీరోయిన్ !

 Authored By sandeep | The Telugu News | Updated on :5 October 2022,7:30 am

Heroine: టాలీవుడ్‌కి చాలా మంది హీరోయిన్స్ వ‌స్తుంటారు, పోతుంటారు. అయితే స్లో అండ స్టడీగా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల మెప్పు పొందే ప్ర‌యత్నం చేస్తుంది వ‌ర్ష బొల్ల‌మ్మ‌. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాతో కలిసి ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రంతో లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథాంశంతో వినోదభరితమైన కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ చిత్రం దసరా కానుకగా బుధవారం (అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర కథానాయిక వర్ష బొల్లమ్మ త‌న‌కు సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో నా రోల్ పేరు భాగ్యలక్ష్మి. ప్రీ-ప్రైమరీ స్కూల్ టీచర్‌గా క‌నిపిస్తా. భాగ్య‌ల‌క్ష్మి సినిమాలో గణేష్‌ని కొంత డామినేట్ చేస్తుంది. నేను ధృడ‌మైన ఆత్మవిశ్వాసం క‌లిగిన అమ్మాయిగా క‌నిపిస్తే.. గణేష్ అమాయ‌కత్వ వ్య‌క్తిత్వంతో క‌నిపిస్తాడ‌ని చెప్పుకొచ్చింది. చాలా మంది అడుగుతుంటారు. ఎక్కువగా హీరోల సోదరులతో చేస్తారు ఎందుకు అని. నేను కావాలని ఎంపిక చేసుకోలేదు. అది అలా కుదురుతుంది అంతే. ప్రతినాయిక ఛాయలు ఉన్న సైకో పాత్ర దొరికితే బాగా చేయగలనని నాకు నమ్మకం ఉంది.

heroine likes thet hero

heroine likes thet hero

Heroine : ఎవ‌రా హీరో..

సితార లో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది…ఇకపోతే మొదటి నుంచి నేను ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్ అని చెప్పుకొచ్చింది.. అతని సినిమా లో నటించె ఛాన్స్ వస్తే నాకన్నా అదృష్ట వంతులు వుండరు అని ఆమె చెప్పుకొచ్చింది..తెలుగుతో పాటు తమింలోనూ చేస్తున్నాను. అయితే ఎక్కువగా తెలుగు సినిమాల మీదే దృష్టి పెడుతున్నాను. అలాగే అవకాశమొస్తే కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ చేస్తాను. ఇటీవల ఆర్ ఆర్ ఆర్ లో కొమురం భీముడో పాటలో ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని అంటూ వ‌ర్ష చెప్పుకొచ్చింది..

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది