Karthika Deepam 06 August 2022 Episode : మోనిత రూపంలో వచ్చాను అని అంటున్న శోభ.. ఎవ్వరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్న సౌందర్య..

Karthika Deepam 06 August 2022 Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. 6 శనివారం ఎపిసోడ్ 1424 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. సౌందర్య, స్వప్న కి శోభ కి గట్టి వార్నింగ్ ఇస్తుంది. హిమ, నిరుపంల పెళ్లి తప్పకుండా జరుగుతుంది అని చెప్తుంది. స్వప్న నీకెంత కోపం ఉందో పట్టుదల ఉందో నాకు కూడా అలాగే ఉన్నాయి మమ్మీ అని అనగానే.. సౌందర్య నీకు చాతనైంది చేసుకోపో… నిన్ను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే హిమ, ప్రేమ్ వాళ్లు నిరూపం, హిమ ల పెళ్లి ఎలాగైనా ఆపాలి అని మాట్లాడుకుంటారు. హిమ ఈ పెళ్లిని ఏదైనా చేసి, ఎలాగైనా ఆపు బావ అని ప్రేమ్ కి చెప్తుంది. ప్రేమ్ నేనున్నాను నేను ఆపుతాను కచ్చితంగా అని చెప్తాడు. కట్ చేస్తే సౌర్య రవ్వ ఇడ్లీ దగ్గర కూర్చుని మాట్లాడుతుంది. రవ్వఇడ్లీ జ్వాలా నీకోసం శోభా వచ్చి పోయింది. నిన్ను అడిగింది అని అంటాడు. అప్పుడు జ్వాల ఇంకేం అడగలేదా ఎందుకొచ్చింది అని అంటుంది.ఇంకేమీ అడగలేదు కానీ నువ్వు పెద్ద ఇంట్లో ఉంటున్నావ్ అంట కదా…

Advertisement

అక్కడికి నన్ను తీసుకెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు జ్వాల ఇల్లు మాత్రమే విశాలంగా ఉంటుంది. వాళ్ళ మనుషులు విశాలంగా ఉండవు రా. వాళ్లకి కార్లు, బంగ్లాలు, డబ్బు మాత్రమే విలువని ఇస్తారు. మనుషులకి విలువనివ్వరు. అని అంటుంది అప్పుడు రవ్వ ఇడ్లీ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావ్ అని అంటాడు. శౌర్య రోజుకు ఒక తీరిగా మోసపోతున్నాను. నిన్న ఒకలాగా, మొన్న ఒకలాగా, ఈరోజు ఇంకొకలాగా మోసపోతున్నాను. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని అంటుంది. కట్ చేస్తే శోభ, స్వప్న తో పెళ్లి డెకరేషన్ అంతా జరిగిపోతుంది ఆంటీ అని అంటుంది. నిజంగానే జరిగిందా నిజంగానే చేస్తున్నారా అని ఇద్దరూ నవ్వుకుంటారు. తల్లి మనసు చాలా గొప్పది అని మనకి ఖర్చు లేకుండా చేస్తుంది. అని అంటుండగా…నిరుపం అక్కడికి వస్తాడు. శోభ నేను, హిమ ప్రేమించు కున్నాం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నీకు అది అర్థం కావట్లేదా అని అంటాడు. అప్పుడు శోభ భూమి గుండ్రంగా తన చుట్టు తానే తిరుగుతుంది అని అంటారు. అలాగే కొన్ని పరిస్థితులు కూడా ఇలాగే జరుగుతాయి.

Advertisement
Karthika Deepam 06 August 2022 Full Episode
Karthika Deepam 06 August 2022 Full Episode

మీ మేనమామ కార్తీక్ ని మౌనిత అనే ఆవిడ ప్రేమించింది. అలాగే ఇప్పుడు మనిద్దరం. నేను మౌనిత ఆంటీ రూపంలో వచ్చాను. అంతే మొండిగా ఉంటాను. నీకు కార్తీక్ పోలికలు వచ్చాయి. ఇదంతా కాదు కానీ, హిమతో బావ మనిద్దరం పెళ్లి చేసుకుందాం . అని చెప్పించు ఆ క్షణమే నేను అమెరికా వెళ్ళిపోతాను. పద అని తన చేయి పట్టుకుని తీసుకెళ్తుండగా.. తను గట్టిగా అరుస్తాడు. ఆపండి ఇక అని అక్కడినుంచి వెళ్ళిపోతాడు నిరూపం. కట్ చేస్తే సౌర్య, నిరుపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆనందరావు వస్తాడు. ఏంటమ్మా శౌర్య ఏం ఆలోచిస్తున్నావ్ అని అంటాడు. నాది ఆటో లాంటి చిన్న జీవితం నేను ఆలోచించడానికి ఏముంటుంది తాతయ్య అని అంటుంది.నువ్వు అలా ఎందుకు అనుకుంటావ్ సౌర్య నువ్వు ది గ్రేట్ కార్తిక్, దీప ల కూతురువి అని అంటాడు. నాకెవరున్నారు తాతయ్య ఎవరు లేరు నా జీవితమే చిన్నభిన్నం అయిపోయింది. అని అంటుండగా.. అప్పుడు ఆనంద్ రావు ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావ్ నువ్వు ఏం కోరుకున్నా చేసేదాన్నే కానీ నువ్వు కోరుకున్న వాడితో పెళ్లి జరిపించలేకపోతున్నాను అని అంటాడు.

ఒద్దు తాతయ్య బలవంత పెళ్లిళ్లు చేయొద్దు అని అంటుంది. కట్ చేస్తే ప్రేమ్, సత్యం, హిమా గురించి మాట్లాడుతూ ఉంటారు. కట్ చేస్తే ఆనందరావు, సౌందర్య శౌర్య గురించి తను బాధపడుతున్న విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో అక్కడికి నిరుపం వస్తాడు. మీరు ఎన్నేళ్ళకో వచ్చింది నా మనవరాలు అని సౌర్యని ఇచ్చి పెళ్లి చేస్తారు.అని అనుకున్నాం అమ్మమ్మ.. కానీ మీరు చాలా గొప్ప వాళ్ళు అని ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇంతలో అక్కడికి స్వప్న, శోభ పెళ్లి కార్డులు తీసుకొని వస్తారు. అమ్మమ్మ తాతయ్యల ఆశీర్వాదం తీసుకుంటున్నావా నిరుపం .సింగిల్ గా ఎందుకు నాకు కాబోయే కోడలితో కూడా కలిసి తీసుకో అని శోభ నువ్వు కూడా వెళ్ళు అని అంటుంది. అప్పుడు నిర్పం నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ నీకు అర్థమవుతుందా. అని అంటాడు. అప్పుడు నాకు అర్థం అవుతుందా నిర్భవం నీకే అమ్మ మనసు అర్థం కావడం లేదు. ఆది దంపతులు అని నువ్వు అనుకుంటున్నా వీళ్లు.. అంత మంచి వాళ్ళు ఏం కాదు అని అంటుంది స్వప్న. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే..

Advertisement