Karthika Deepam 07 Sep Today Episode : మోనితకి వార్నింగ్ ఇచ్చిన దీప.. దీపకు దగ్గరవుతున్న కార్తీక్…! 

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 7, 2022, 10:00 am

Karthika Deepam 07 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్. ఈ సీరియల్ ఎన్నో మలుపులతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1451 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… కార్తీక్ మౌనితని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. ఇక మౌనిత దీప గురించి అడుగుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ ఆవిడ ఇక కనపడదు నేను చడమడ తిట్టేసాను.. అని నీకోసం ఏమైనా తీసుకొస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అని వెళ్ళిపోతాడు కార్తీక్. దాంతో మౌనిత తెగ సంబర్ పడిపోతూ ఉంటుంది. కట్ చేస్తే హిమ, సౌర్య ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలో సౌందర్య, ఆనంద్ రావు వస్తారు. వాళ్లని హిమ మనం శౌర్య దగ్గరికి వెళ్దాం నాయనమ్మ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుదాం అని అంటుంది. అప్పుడు సౌందర్య వద్దు ఈరోజు నీ పుట్టినరోజు అక్కడికి వెళ్తే నువ్వు ఇంకా బాధపడాల్సి వస్తుంది.

కాబట్టి మనం అనాధ శరణాలయానికి మాత్రం వెళ్దాం అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కట్ చేస్తే దీప గుడికి వచ్చి ఇద్దరు పిల్లల మీద అర్చన చేయిస్తూ..కార్తీక్ బాబు తనకి గతం గుర్తొచ్చి నా పిల్లలతో నాతో సంతోషంగా ఉండేలా చెయ్ దేవుడా అని దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అంతలో శౌర్య వారణాసి అక్కడికి వస్తారు. అదే గుడిలో ఒకపక్క దీప దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంకొకపక్క సౌర్య దండం పెట్టుకుంటూ ఉంటుంది. కానీ ఒకల్ని ఒకళ్ళు చూసుకోరు. అంతలో కార్తీక్, మౌనిత ఇద్దరు అదే గుడికి వస్తారు. అప్పుడు కార్తీక్ అడుగుతాడు. ఎందుకు గుడికి తీసుకొచ్చావు ఏమైనా స్పెషల్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు మౌనిత నువ్వు వంటలు అక్కని కలవను, మాట్లాడను అని ప్రమాణం చేయాలి అని అంటుంది. అప్పుడు కార్తీక్ నీకేమైనా పిచ్చా .ఈ కాలంలో ఆ ప్రమాణాలు ఏంటి ఒకవేళ నేను ప్రమాణం చేసి కూడా తనతో మాట్లాడితే అంటే నాకు గుర్తు ఉండదు కదా అని అంటాడు. అప్పుడు మోనిత దేవుడి మీద ప్రమాణం చేస్తే మర్చిపోరు అని అంటూ..

Karthika Deepam 07 September 2022 Full Episode

Karthika Deepam 07 September 2022 Full Episode

తప్పదు చేయాలి అని తనని లాక్కెళ్తూ ఉంటుంది. గుడిలోకి. అప్పుడు దీప వాళ్ళని చూసి వాళ్ళ వెనకనే వెళుతుంది. కట్ చేస్తే హిమ శౌర్య గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు సౌందర్య నువ్వు ప్రతిక్షణం దాని గురించి ఆలోచిస్తావు.. కానీ అది నిన్ను అర్థం చేసుకోదు.  అది ఏనాడో ఒకనాడు నిన్ను అర్థం చేసుకునే రోజు వస్తుంది. కాబట్టి నువ్వు అప్పటివరకు బాధపడకు అని అంటుంది. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని గుళ్లోకి తీసుకెళ్లి ప్రమాణం చేయమని అడుగుతూ ఉంటుంది. కార్తీక్ చేస్తూ ఉండగా దీప ఆగండి డాక్టర్ బాబు మీరు ఎందుకు ప్రమాణం చేస్తున్నారు.. నేనేం తప్పు చేశాను అని అంటుంది. నువ్వు తప్పు చేయలేదా నాకు విషయం పెట్టి చంపాలనుకున్నావు కదా అని అంటుంది మోనిత. అప్పుడు నేను ఏ తప్పు చేయలేదు అని ఇప్పుడే నా పిల్లల మీద ప్రమాణం చేస్తాను అని ఒక్కసారిగా దీప ప్రమాణం చేస్తుంది.

అప్పుడు కార్తీక్ బాబు అది చూసి చూసావు కదా తను ప్రమాణం చేసింది చూడు.. ఇకనైనా తనని నమ్ము అని అంటాడు. అప్పుడు మౌనిత నేను నమ్మను అంటుంది. అప్పుడు దీప డాక్టర్ బాబు, నేను చేశాను కదా తన చేత చేయించండి అని అంటుంది. అప్పుడు మౌనిత చెయ్యి మౌనిత అని అంటాడు కార్తీక్. అప్పుడు మౌనిత కంగారుపడుతూ.. దిక్కులు చూస్తూ ఉండగా అక్కడ సౌర్య కనపడుతుంది. తనని చూసి దేవుడా వీళ్ళందరూ ఒక దగ్గరే ఉన్నారు. నేను ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ మౌనితని తిట్టి.. తనని వదిలేసి వెళ్లిపోయి ఇంట్లో కూర్చుని ఉండగా.. దీప తనకి మసాజ్ చేస్తూ ఉంటుంది. మోనిత కంగారుపడుతూ ఇంటికి వచ్చి చూస్తే.. కార్తీకి దీప మసాజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ అని అంటుండగా దీప సైలెంట్ అని అంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే…

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp