Intinti Gruhalakshmi 7 Sep Today Episode : అంకితకు విడాకులు ఇవ్వు అని అభిని డిమాండ్ చేసిన గాయత్రి.. తులసిని దెబ్బకొట్టేందుకు లాస్య మరో ప్లాన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Intinti Gruhalakshmi 7 Sep Today Episode : అంకితకు విడాకులు ఇవ్వు అని అభిని డిమాండ్ చేసిన గాయత్రి.. తులసిని దెబ్బకొట్టేందుకు లాస్య మరో ప్లాన్

 Authored By gatla | The Telugu News | Updated on :7 September 2022,9:00 am

Intinti Gruhalakshmi 7 Sep Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 7 సెప్టెంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 731 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గాయత్రి ఇంటికి అభి ఒంటరిగా వస్తాడు. దీంతో గాయత్రి షాక్ అవుతుంది. అంకిత ఎక్కడ అంటాడు. తను రాదు.. ఇక తన మీద ఆశలు వదిలేసుకోండి అంటాడు అభి. దీంతో తను వస్తేనే నువ్వు కూడా ఇక్కడికి రా. తను లేకపోతే నువ్వు ఇక్కడికి రావద్దు అని చెప్పాను కదా అంటుంది గాయత్రి. దీంతో తను రాకపోతే నేను ఇక్కడికి రాకూడదా… నేను ఈ ఇంటికి అల్లుడినే కదా అంటాడు అభి. అల్లుడివే కానీ.. తను ఇక్కడికి వస్తేనే.. తను లేకుంటే నువ్వు ఇక్కడికి రావద్దు అంటుంది గాయత్రి. దీంతో అభి షాక్ అవుతాడు. మీరు చెప్పినట్టు విని.. నేను మా అమ్మనే కాదనుకున్నాను. కానీ.. మీరు మాత్రం అంకిత వస్తేనే నన్ను రమ్మంటున్నారు అంటాడు అభి.

intinti gruhalakshmi 7 september 2022 full episode

intinti gruhalakshmi 7 september 2022 full episode

దీంతో నువ్వు అంకితకు విడాకులు ఇవ్వు. అప్పుడైనా నా కూతురు నా దగ్గరికి వస్తుంది అంటుంది అంకిత. దీంతో అభి షాక్ అవుతాడు. నేను అంకితకు విడాకులు ఇస్తే నా పరిస్థితి ఏం కావాలి అంటాడు అభి. నువ్వు ఏమైపోతే నాకేంటి. నాకు కావాల్సింది నా కూతురు. వెళ్లు.. ముందు ఆ తులసి ఏదైనా తప్పు చేస్తే పట్టకొని నిలదీసి నా కూతురును తీసుకొని ఇక్కడికిరా అంటుంది గాయత్రి. కట్ చేస్తే తులసిపై సామ్రాట్ మండిపడేలా లాస్య చేసినందుకు లాస్య, నందు సంతోషంగా ఉంటారు. ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే… మరోటి చూడు.. అంటూ పేపర్ లో సామ్రాట్, తులసి మధ్య జరిగిన మ్యూజిక్ స్కూల్ ప్రాజెక్ట్ గురించి వచ్చిన వార్తను నందుకు చూపిస్తుంది.

తులసి ఈ వార్త ఇచ్చినట్టుగా నేనే ఈ వార్తను ప్రెస్ వాళ్లకు ఇచ్చాను. ఈ పేపర్ వార్త చూసి సామ్రాట్ షాక్ అవ్వాల్సిందే. అంతే కాదు.. ప్రెస్ రిపోర్టర్లను కూడా నేను తులసి ఇంటికి పంపించాను. ఇంకాసేపట్లో అంతా రచ్చరచ్చ అయిపోతుంది అని చెబుతుంది లాస్య.

Intinti Gruhalakshmi 7 Sep Today Episode : సామ్రాట్ పేపర్ చూసేలా చేసిన లాస్య

తనకు టీ తీసుకొచ్చే వ్యక్తితో ఆ పేపర్ ను సామ్రాట్ కు చేరేలా చేస్తుంది లాస్య. అతడు ఆ పేపర్ ను తీసుకెళ్లి సామ్రాట్ ముందు పెడతాడు. కట్ చేస్తే తులసి బ్యాగ్ వేసుకొని ఎక్కడికో బయలు దేరుతుంది.

నేను సంగీత పాఠాలు చెప్పడానికి నేతాజీ స్కూల్ వాళ్లు క్లాస్ రూమ్ ఇస్తారేమో అడగడానికి వెళ్తున్నాను మామయ్య అంటుంది తులసి. దీంతో ఒకసారి సామ్రాట్ తో మాట్లాడు అంటాడు పరందామయ్య. కానీ..  తులసి వినదు.

ఇంతలో ప్రెస్ రిపోర్టర్లు తులసి ఇంటికి వస్తారు. ఈరోజు వార్తల్లో మీరే నిలిచారు కదా. మీ మ్యూజిక్ స్కూల్ గురించి కొన్ని క్లారిఫికేషన్స్ కావాలి అంటారు. దీంతో మా అమ్మను ఇబ్బంది పెట్టకండి అంటాడు ప్రేమ్.

మరోవైపు పేపర్ లో వచ్చిన వార్తను చూస్తాడు సామ్రాట్. కోపంతో రగిలిపోతాడు. ఇంతలో అక్కడికి నందు, లాస్య వస్తారు. చూశావా వార్త.. అంటాడు. చదివాను సార్.. తులసి ఎందుకు ఇలా చేసిందో నాకు అర్థం కావడం లేదు సార్ అంటుంది లాస్య.

కోపంతో రగిలిపోయిన సామ్రాట్.. తులసి ఇంటికి బయలుదేరుతాడు. ఇంతలో ప్రెస్ వాళ్లు అక్కడి నుంచి వెళ్తుండటం చూస్తాడు. కోపంతో ఇంట్లోకి వెళ్లి తులసి ఇంటికి వెళ్తాడు. అసలు నీ స్థాయి పెంచాలనుకోవడం తప్పు నాది అంటాడు. నిన్న ఉన్నత స్థానంలో ఉంచాలనుకున్నాను కానీ.. నువ్వు ఇలా చేస్తావనుకోలేదు అని అంటాడు సామ్రాట్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది