Karthika Deepam 10 Nov Today Episode : డైరెక్ట్ గా మోనిత ఇంటికి వెళ్లిన దీప.. మోనితకు సీరియస్ వార్నింగ్.. భలే ప్లాన్ వేసిన దీప

Authored By Varun G | The Telugu News | Published on: November 10, 2021, 10:29 am

Karthika Deepam 10 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు నవంబర్ 10, 2021, బుధవారం ఎపిసోడ్ 1193 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, మోనిత ఇద్దరూ పూజలో కూర్చుంటారు. కార్తీక్ అయిష్టంగానే పూజ చేస్తుంటాడు. మోనిత మాత్రం చాలా సంతోషిస్తుంది. బిడ్డ పేగు మెడకు వేసుకొని పుట్టడం వల్ల రాహు పూజ చేయాలి. నేను చెప్పినట్టు చేయండి అని పూజారి చెబుతాడు. ఇంతలో దీప కారులో అటునుంచే వెళ్తుంటుంది. సౌందర్య కారు చూస్తుంది. దిగి.. వీళ్లు ఇక్కడేం చేస్తున్నారు అనుకుంటుంది. వారణాసి.. నువ్వు వెళ్లిపో. మన కారు ఉంది కదా.. నేను ఈ కారులో వస్తాను.. అని చెబుతుంది దీప. దీంతో సరే అక్క అంటాడు. కానీ.. ఎందుకో నిన్ను చూస్తే భయం వేస్తుంది అంటాడు. నువ్వు చాలా మారిపోయావు అక్క అంటాడు.

దీప గుడిలోకి వచ్చి.. వీళ్లు ఎక్కడున్నారని వెతుకుతుంది. కార్తీక్, మోనిత పూజ చేస్తుండటం చూసి షాక్ అవుతుంది. అదేంటి.. మోనిత పక్కన డాక్టర్ బాబు కూర్చొని పూజ చేస్తున్నారని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇద్దరు పక్కపక్క కూర్చొని పూజ చేస్తున్నారా? అత్తయ్య దగ్గరుండి జరిపిస్తున్నారా? అనుకుంటుంది. షాక్ అవుతుంది. ఏడుపు ఆపుకోలేకపోతుంది. డాక్టర్ బాబు ఏం చేస్తున్నారిక్కడ. ఈ పూజలు ఏంటి.. అని తెగ బాధపడిపోతుంది. 11 ఏళ్లు మిమ్మల్ని నమ్మాను కదా.. అని అనుకుంటుంది దీప.

డాక్టర్ బాబు హాస్పిటల్ కు వెళ్లి సంతకం పెట్టారంటే మానవత్వం అని అనుకున్నాను. ఈ విషయం నా దగ్గర దాచిపెట్టారంటే నేను ఏమనుకుంటానో అనుకొని భయపడ్డారని అనుకున్నాను.. అని దీప అనుకుంటుండగానే దీప అక్కడికి రావడం చూస్తాడు కార్తీక్. దీంతో షాక్ అవుతాడు. దీప వచ్చిందా? లేక వచ్చినట్టు నాకు అనిపించిందా? అనుకుంటాడు. రవి.. పూజ అయిపోయింది. నువ్వు వెళ్లి ఈ తైలాన్ని నైరుతి వైపున ప్రాంతంలో పోసిరా అంటాడు పూజారి. దీంతో రవి.. ఆ తైలాన్ని బయటికి తీసుకెళ్తాడు.

మరోవైపు దీప ఏడ్చుకుంటూ బయటికి వస్తుంది. దీప.. ఎందుకు ఈ పేరు నాకు పెట్టారో.. ఎప్పటికైనా ఆరిపోతుందనా అని అనుకుంటుండగా.. రవి అక్కడికి వస్తాడు. పంతులు గారు అక్కడ ఏం పూజ జరుగుతోంది.. అని అడుగుతుంది. బాబు పేగు మెడకు వేసుకొని జన్మించాడట. తండ్రికి ప్రాణగండం అని దోష నివారణ పూజను ఆ దంపతులు చేస్తున్నారమ్మా.. అంటాడు. ఇంతకీ మీరెవరు అంటే.. అదే తెలియడం లేదు పంతులు గారు అంటుంది దీప. వెళ్లిపోతున్నారు.. దైవ దర్శనం చేసుకున్నారా అమ్మా? అంటాడు. దర్శనం బాగా అయింది అని చెప్పి అక్కడి నుంచి దీప వెళ్లిపోతుంది.

Karthika Deepam 10 Nov Today Episode : గుడిలో మోనితపై కార్తీక్ సీరియస్

మరోవైపు పూజ అయిపోతుంది. ఇక దోషం తొలగినట్టే అని పూజారి చెబుతాడు. ఇక మోనిత కాస్త ఓవర్ చేస్తుంది. పూజారి గారు మా బాబును ఆశీర్వదించండి. మా బాబుకు మా మామ గారి పేరు పెట్టాను అంటుంది. ఇంకా ఏదేదో మాట్లాడుతుంటే.. పంతులు గారు పూజ అయిపోయింది కదా.. ఇక వెళ్లొచ్చా అంటాడు కార్తీక్. అయ్యో.. అప్పుడేనా.. ఇంకో 5 నిమిషాలు ఉండి వెళ్లండి అని చెప్పి పూజారి వెళ్లిపోతాడు.

karthika deepam 10 november 2021 full episode

karthika deepam 10 november 2021 full episode

ఇదే కరెక్ట్ చాన్స్ అనుకొని.. ఏమండి.. మన బాబును చూశారా అని అడుగుతుంది. కార్తీక్ కు ఫుల్ కోపం వస్తుంది. ఏయ్.. ఎక్కువ మాట్లాడకు అంటాడు కార్తీక్. అయ్యో ఇప్పుడు నేను ఏమన్నానండి.. నేనేమీ ఇప్పుడు మీ ఇంటికి వస్తాను అనలేదు కదా.. అంటుంది మోనిత. ఇప్పుడు రాను కానీ.. త్వరలో వస్తాను ఇంటికి. మీ ఇంటి కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడతా అని చెబుతుంది మోనిత.

కట్ చేస్తే.. మోనిత ఇంటికి వెళ్తుంది దీప. మోనిత ఏదో మాట్లాడుతుండగా ఎంట్రీ ఇచ్చిన దీప.. తనకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. ఇక నీ ఖేల్ ఖతం అంటుంది. నువ్వు ఇన్ని రోజులు ఎన్నో నాటకాలు ఆడావు. ఇక అవన్నీ కుదరవు.. అంటూ బెదిరిస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "December New Rule : డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్‌.. గ్యాస్, బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ ఛార్జీలపై బిగ్ అలర్ట్!"

  2. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  3. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  4. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  5. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  6. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  7. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp