Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ పెళ్లిని తెర వెనుకుండి జరిపించిందెవరంటే?
Jr NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, నటరత్న నందమూరి తారక రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్షన్‌లో తారక్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 7న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ సంగతులు పక్కనబెట్టి.. తారక్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే ఎన్టీఆర్ తన భార్య, ఇద్దరు పిల్లలతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అయితే, తారక్ పెళ్లిని తెర వెనుక నుంచి ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరో మీకు తెలుసా..తారక్‌కు మ్యారేజ్ చేయాలనుకుని హరికృష్ణ భావించి పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేసిన క్రమంలో ఎన్ఆర్ఐ సంబంధాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తల కుటుంబాల వారు ముందుకొచ్చారట.

Jr Ntr marriage Histroy
హరికృష్ణతో వియ్యం అందుకోవాలని చాలా మందే ప్రయత్నించారట. అయితే, జూనియర్ ఎన్టీఆర్ మ్యారేజ్ గురించి అందరి కంటే ముందే ప్లాన్ చేసిన వ్యక్తి ఎవరంటే.. ఆయన మామ, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. తారక్‌ను కుటుంబంలోని బంధువుల ఇంట్లోనే అల్లుడిని చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే తారక్ బయటకు వెళ్లకుండా తన మేనకోడలు కూతురుతో పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయి.. తెర వెనుకుండి చర్చలు జరిపించారు. అలా చాలా స్పీడ్‌గా
జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి జరిగిపోయింది. తారక్ మ్యారేజ్ అయినపుడు లక్ష్మీ ప్రణతి వయసు కేవలం 18 ఏళ్లు. జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు స్టూడియో ఎన్ చానల్ నడిపించాడు. వీరిది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం. ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతిల వివాహం 2011లో ఘనంగా జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్.
Jr NTR : తారక్ మామ ఆ మీడియా చానల్ నడిపాడు..

Jr Ntr marriage Histroy
ఎన్టీఆర్ సినిమా కెరీర్ విషయానికొస్తే.. టాలీవుడ్ స్టార్ హీరోగా తారక్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్ అయిపోతాడనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ చిత్రం తర్వాత తారక్ ‘జనతాగ్యారేజ్’ ఫేమ్ డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్‌లో పాన్ ఇండియా ప్రాజెక్టు చేయబోతున్నాడు.