Karthika Deepam 10 Sep Today Episode : వంటలక్క ఇచ్చిన కౌంటర్ కి దిమ్మతిరిగిపోయిన మోనిత… దీపకి దగ్గరవుతున్న కార్తీక్…

Authored By aruna | The Telugu News | Published on: September 10, 2022, 10:00 am

Karthika Deepam 09 Sep Today Episode : కార్తీకదీపం సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1454 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీపకు, డాక్టర్, పెద్దావిడ ధైర్యం చెబుతూ ఉంటారు. అప్పుడు దీప అది నన్ను ఏమీ చేయలేదు. నా భర్తని నా నుంచి దూరం చేయలేదు. అని అంటూ ఉంటుంది. అప్పుడు పెద్దావిడ సరేగాని రేపు వినాయకుడు పూజ ఇక్కడే చేసుకో అని అడుగుతుంది. అప్పుడు లేదమ్మా నేను డాక్టర్ బాబు ని పిలిచాను తన అక్కడికి వస్తాడు. అక్కడే జరుపుకుంటాను. అని అంటుంది. సరే అనడంతో దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే మౌనిత దీప గురించి ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటుంది. అంతలో శివ వచ్చి దీపక్క వచ్చింది మేడం అని అంటాడు. అప్పుడు మౌనిత శివ చంప పగలకొట్టి అక్క ఏంట్రా..

అక్క అంటున్నావ్ నా దగ్గర ఉంటు…నా ఉప్పు తింటూ.. అంటూ తనకి వార్నింగ్ ఇస్తుంది. ఇక తర్వాత మౌనిక దీప దగ్గరికి వెళ్లి అక్క అని పిలుస్తూ ఎటకారంగా మాటలు అంటూ నేను మా ఆయన పక్కపక్కన కూర్చుని పూజ చేసుకుంటున్నాం నువ్వు రావాలి అంటూ కౌంటర్స్ వేస్తూ ఉంటుంది.  అప్పుడు దీప నా భర్తని నా నుంచి నువ్వు దూరం చేయలేవు నా భర్తని నేను నా సొంతం చేసుకోవడానికి ఎంతో టైం పట్టదు.. అప్పటివరకు నా డాక్టర్ బాబుని చాలా జాగ్రత్తగా చూసుకో చెల్లి నేను నీకోసం వస్తా అని అంటూ మౌనితకి రీకౌంటు ఇస్తుంది. ఇక కట్ చేస్తే సౌర్య వారణాసి బొమ్మల అమ్ముతూ ఉండగా కొనడానికి ఎవరు రాపోయేసరికి బాధపడుతూ ఉంటారు. అప్పుడు వారణాసి నువ్వు వెళ్లి కూర్చోమ్మ అమ్మగారు అయ్యగారు చూశారంటే నన్ను తిడతారు చిన్న పిల్లలతో బొమ్మలమ్మిస్తున్నావా అని అంటారు అని అంటూ ఉంటాడు. అప్పుడు నేను అమ్మానాన్నల కోసం వచ్చాను అది నీకు తెలుసుగా… అని అంటూ సరే నేను పక్కన కూర్చుంటా నువ్వు అమ్ము అని అంటుంది. అప్పుడు అటువైపుగా కార్తీక్, మౌనిత వెళ్తూ కార్తీక్ సౌర్య ని చూసి కారు ఆపి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్లు ఉంది మోనిత నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మౌనిత కంగారుపడుతూ లేదు కార్తీక్ అమ్మాయిని ఇప్పుడే ఫస్ట్ చూడడం అని ఉంటుంది.

పాపం చిన్నపిల్ల బొమ్మలు అమ్ముతూ ఉంది అని అంటుండగా.. కొందరి తలరాత అంతే అని మౌనిత అంటూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ తలరాతని మనం మార్చలేము కానీ సహాయం చేయొచ్చు కదా అని కార్ దిగి వెళుతూ ఉండగా మౌనిత తనని ఆపి కార్లు కూర్చోబెడుతుంది. నేను శివాని పంపిస్తాను అని శివాని పంపిస్తుంది. అప్పుడు కార్తీక్ శివ బొమ్మలు మొత్తం తీసుకురా.. బేరాలాడకు అని అంటాడు. అప్పుడు శివ వెళ్లి మొత్తం బొమ్మలు తీసుకొని వస్తాడు. అప్పుడు కార్తీక్ శివ చంప పగలగొట్టి నువ్వు వెళ్లి చిన్నపిల్లలకి పని చెప్తావా.. తన పని చేస్తుంటే నాకు ఏదో అయిపోతుంది అని అంటూ ఉంటాడు. అప్పుడు మౌనిత సరేలే ఏదో తెలియక చేశాడు అని అంటుంది. అప్పుడు సౌర్య ఆ మేడంకి నేను థాంక్స్ చెప్పి వస్తా అని వస్తూ ఉండగా ..అక్కడ నుంచి మౌనిత వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక వాళ్లు వెళ్లిపోయినందుకు బాధపదుతు ఉండగా.. ఏం కాదులే అని వారణాసి అంటాడు.

ఇక ఆ డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటుంది శౌర్య. ఇక రేపటి ఎపిసోడ్లో మౌనిక ఇంట్లో పూజ జరుగుతూ ఉండగా.. పంతులుగారు దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చుండి అంటుండగా.. మౌనిత కార్తీక్ కూర్చోబోతూ ఉండగా దీప ఆగండి డాక్టర్ బాబు మీరు నాకు ఒక మాట ఇచ్చారు మర్చిపోయారా అని అంటుంది. అవును మర్చిపోయాను అని కార్తీక్ అంటాడు. అప్పుడు దీప మీరు ఇలా మర్చిపోతారని నేను ఒక చిట్టి మీద రాశాను కదా అని అనగానే కార్తీక్ వెళ్లి చిట్టి తీసుకొచ్చి చదువుతూ ఉండగా.. మౌనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీప సంతోష పడబోతూ ఉంటుంది. ఇక తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే సోమవారం ఎపిసోడ్లో చూడాలి..

aruna

No bio available for this author.

  1. "PM Kisan 25th Installment : రూ.2,000 కోసం ఎదురుచూస్తున్న రైతులకు అలర్ట్.. ఈ 5 పనులు వెంటనే పూర్తి చేయండి!"

  2. "Gold Adulteration Alert : కొత్త మోసం.. 22 క్యారెట్ల పేరుతో 20 క్యారెట్ల బంగారమా..? 916 హాల్‌మార్క్ ఉన్నా జాగ్రత్త పడాల్సిందేనా?"

  3. "Vaibhav Sooryavanshi : 16 బంతుల్లో ఫిఫ్టీ.. 28 బంతుల్లో సెంచరీ.. ప్రపంచ రికార్డు బద్దలు!"

  4. "Samvidhan Raksha March : ప్రతి డివిజన్ నుంచి 100 మంది రావాలి.. డీసీసీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్ పిలుపు!"

  5. "Janasena Party : కూటమిలో ఉంటూనే జనసేన సొంత బలం పెంచుకుంటోందా?.. ప‌వ‌న్‌ది ఏం ప్లాన్ గురూ..!"

  6. "WhatsApp Web : వాట్సాప్ వెబ్ వాడుతున్నారా?.. ఈ చిన్న తప్పుతో మీ అకౌంట్ ప్రమాదంలో పడొచ్చు!"

  7. "Trisha Politics : మరో జయలలితగా త్రిష?.. విజయ్‌తో రాజకీయాల్లోకి వస్తారా? అభిమానుల కొత్త ప్లాన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp