Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ కి అర్జెంట్ గా ఒక జడ్జ్ కావలెను.. అర్హతలు ఇవే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sridevi Drama Company : శ్రీదేవి డ్రామా కంపెనీ కి అర్జెంట్ గా ఒక జడ్జ్ కావలెను.. అర్హతలు ఇవే

Sridevi Drama Company : ఈటీవీలో జబర్దస్త్ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే. ఆదివారం వస్తుంది అంటే ఇతర చానల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలను పెద్ద హీరోల సినిమాలను టెలికాస్ట్ చేస్తూ రేటింగ్ కోసం తెగ కష్టాలు పడుతూ ఉంటాయి. కానీ ఈటీవీ మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీని ఏకంగా మూడు గంటలు టెలికాస్ట్ చేయడం ద్వారా కావలసినంత రేటింగ్ […]

 Authored By aruna | The Telugu News | Updated on :10 September 2022,8:00 am

Sridevi Drama Company : ఈటీవీలో జబర్దస్త్ తర్వాత ఆ స్థాయిలో సక్సెస్ అయిన కార్యక్రమం ఏదైనా ఉందా అంటే అది శ్రీదేవి డ్రామా కంపెనీ మాత్రమే. ఆదివారం వస్తుంది అంటే ఇతర చానల్స్ అన్నీ కూడా సూపర్ హిట్ సినిమాలను పెద్ద హీరోల సినిమాలను టెలికాస్ట్ చేస్తూ రేటింగ్ కోసం తెగ కష్టాలు పడుతూ ఉంటాయి. కానీ ఈటీవీ మాత్రం శ్రీదేవి డ్రామా కంపెనీని ఏకంగా మూడు గంటలు టెలికాస్ట్ చేయడం ద్వారా కావలసినంత రేటింగ్ దక్కించుకుంటుంది.

ప్రతివారం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి మంచి రేటింగ్ నమోదు అవుతున్న నేపథ్యంలో అంతకు మించి అన్నట్లుగా కార్యక్రమాన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దుతూ కొత్త కొత్త టాలెంట్స్ తీసుకొస్తూ మంచి పేరును దక్కించుకుంటున్నారు. ఇటీవల కండక్టర్ ఝాన్సీ ని తీసుకు వచ్చి పల్సర్ బండి డాన్స్ తో షేక్‌ చేయించి బుల్లి తెరకు పరిచయం చేయడం ద్వారా అనూహ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీకి మరింతగా పేరు దక్కింది. అన్ని బాగానే ఉన్నాయి కానీ జడ్జి విషయంలో మాత్రం కాస్త ఇబ్బంది కలుగుతుంది.

wanted Judge for etv sridevi drama comapany show

wanted Judge for etv sridevi drama comapany show

శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక పర్మినెంట్ జడ్జి లేకుండా పోయారు.. మొన్నటి వరకు ఇంద్రజ శ్రీదేవి డ్రామా కంపెనీ యొక్క జడ్జి సీటులో కూర్చునేది. కానీ ఆమెకు జబర్దస్త్ లోని రోజా సీటు దక్కడం వల్ల శ్రీదేవి డ్రామా కంపెనీ నుండి వెళ్లిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీకి వారానికి ఒకరు అన్నట్లుగా ఎవరు పడితే వాళ్లు జడ్జ్ లుగా వస్తున్నారు. ఒక్కొక్కవారం ఒక్కొక్కళ్ళు వస్తే ప్రేక్షకులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంద్రజ వంటి ఒక పర్మినెంట్ జడ్జి ఉంటే జబర్దస్త్ మాదిరిగానే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా మంచి రేటింగ్ సొంతం చేసుకుని అంతకు మించిన వినోదాన్ని అందించే అవకాశం ఉంది అంటూ విశ్లేషకులు అభిప్రాయం చేస్తున్నారు. మరి మల్లెమాల వారు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారేమో చూడాలి.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది