Karthika Deepam 14 June Today Episode : గుడిలో హిమకు తాళి కట్టిన నిరుపమ్.. వాళ్లను చూసి జ్వాల షాక్.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

Karthika Deepam 14 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 14 జూన్ 2022, మంగళవారం ఎపిసోడ్ 1378 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నిరుపమ్ కు ఐలవ్యూ చెప్పేందుకు చాలా ఉత్సుకతతో వెళ్తుంది జ్వాల. ఒక్కో అడుగు వేస్తూ నిరుపమ్ ను చేరుకో అని చెబుతుంది హిమ. ఆరు అడుగులు వేస్తుంది జ్వాల. ఇంతలో తనకు ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ ను కట్ చేస్తుంది. నువ్వేదో ఊహించుకున్నావు జ్వాల. అనవసరంగా నా మీద ఆశలు పెట్టుకున్నావు. ఆ తప్పెవరిదో తెలియదు కానీ.. నువ్వు నన్ను ప్రేమించడం తప్పు. నా గుండెల నిండా హిమే నిండి ఉంది. తనతోనే పెళ్లి అని నేను నీకు స్పష్టంగా చెప్పేస్తాను అని మనసులో అనుకుంటాడు నిరుపమ్. ఇంతలో జ్వాలకు మళ్లీ ఫోన్ వస్తుంది. ఎన్నిసార్లు కట్ చేసినా ఫోన్ వస్తుండటంతో ఏం చేయాలో తెలియక మళ్లీ ఫోన్ కట్ చేస్తుంది. ఇంతలో అక్కడికి హిమ వస్తుంది. ఏడో అడుగు వేయి జ్వాల అంటుంది. ఇంతలో మళ్లీ ఫోన్ వస్తుంది. అన్ నోన్ నెంబర్ నుంచి ఫోన్ రావడంతో ఫోన్ ఎత్తుతుంది.

karthika deepam 14 june 2022 today episode

హలో అంటుంది. దీంతో అటువైపు నుంచి నవ్వు వినిపిస్తుంది. అది శోభ. ఎవరు అంటే నేనే అంటుంది శోభ. జ్వాల.. ఎలా ఉన్నావు అని అడుగుతుంది శోభ. దీంతో జ్వాల షాక్ అవుతుంది. ఎవరు అని కన్ ఫ్యూజ్ అవుతున్నావా.. నేను హిమను అంటుంది శోభ. తనకు అబద్ధం చెబుతుంది శోభ. నీ ప్రియమైన శత్రువును. నా గురించి నీ చేతి మీద రాసుకున్నావు. నీ ఆటో మీద కూడా రాసుకున్నావు కదా అంటుంది హిమ. రా మరి.. వదిలేదేలే అని రాశావు కదా అంటుంది శోభ. దీంతో జ్వాలకు ఏం చేయాలో అర్థం కాదు. ఎక్కడమ్మా చూస్తున్నావు. రా.. నన్ను కలుసుకోవా అని అడుగుతుంది. నన్ను పట్టుకోవా అని అడుగుతుంది. నువ్వు వచ్చేయ్ అమ్మా. నేను ఫోన్ లో అడ్రస్ చెబుతుంటాను. నువ్వు రావాలి. నాకు కోపం వస్తే మనసు మార్చుకుంటాను. అలాగే వచ్చేయమ్మా.. అంటుంది శోభ. దీంతో వెంటనే అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది జ్వాల. దీంతో హిమకు ఏం చేయాలో అర్థం కాదు.

వెరీ గుడ్ జ్వాల గుడ్ గర్ల్. నేనంటే నీకు ఎంతో కోపం కదా అంటుంది. దీంతో అక్కడి నుంచి ఆటో వేసుకొని వెళ్తూ ఉంటుంది జ్వాల. తను ఏడో అడుగు వేశాక.. తనకు నేను ప్రేమించలేను.. నా మనసులో హిమ మాత్రమే ఉంటుంది అని చెప్పాలని రెడీగా ఉన్నాను కానీ.. తను వెళ్లిపోయింది అని హిమతో అంటాడు నిరుపమ్.

బావ ఏంటిది. నేను చెప్పాను కదా అంటుంది హిమ. దీంతో నువ్వు వెయ్యి సార్లు చెప్పినా.. నువ్వే నా లోకం అని జ్వాలకు చెబుతాను అంటాడు నిరుపమ్. మరోవైపు శోభకు అసలు నిజం తెలుస్తుంది. గీత దగ్గరికి వెళ్లి జ్వాల ఎవరో తెలుసుకుంటుంది శోభ.

Karthika Deepam 14 June Today Episode : గీత ద్వారా జ్వాల గురించి తెలుసుకున్న శోభ

ఇవన్నీ నేను వాళ్లకు అందజేస్తాను అని గీతతో చెబుతుంది. దీంతో ఆ పని చేయి అని శోభకు గీత చెబుతుంది. ఇవన్నీ నా మొబైల్ కు సెండ్ చేయి అంటుంది శోభ. కరెక్ట్ టైమ్ లో దొరికారే… ఇక ఆట ఆడిస్తాను చూడండి అని అనుకుంటుంది శోభ.

మరోవైపు హిమ.. జ్వాలను కలుస్తుంది. ఏంటి జ్వాల నువ్వు ఏమనుకుంటన్నావు. మాట్లాడవేంటి. బావతో నీ మనసులో మాట చెబుతావని నేను అనుకుంటే.. మంచి మర్యాద లేకుండా నువ్వు వెళ్లిపోయావేంటి. ఇదేనా పద్ధతి అంటుంది హిమ.

నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా నువ్వు మాట్లాడవేంటి.. అని అంటుంది హిమ. కానీ.. జ్వాల ఏం మాట్లాడదు. నేను మాట్లాడుతుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి అని అంటుంది హిమ. వెళ్లడాలు లేవు.. జ్వాల. నాకు చాలా కోపం వస్తోంది. నేను ఇలా గట్టిగా అరవడం ఇంతకుముందు నువ్వెప్పుడూ చూసి ఉండవు అంటుంది హిమ.

హిమ కాల్ చేసింది నాకు అంటుంది జ్వాల. దీంతో తింగరి షాక్ అవుతుంది. ఏంటి అంటే.. అవును హిమ ఫోన్ చేసింది. నా శత్రువు హిమ ఫోన్ చేసింది అంటుంది జ్వాల. ఇది.. ఇదే నాకు ఫోన్ చేసింది అంటుంది జ్వాల. ఎవరైతే నాకు శత్రువు అనుకుంటున్నానో అదే నాకు ఫోన్ చేసింది అంటుంది జ్వాల.

ఎవరికోసం అయితే నేను ఎదురు చూస్తున్నానో.. ఎవరినైతే వదిలేదేలేదు అని నా ఆటో వెనుక రాసుకున్నానో.. అదే ఆ హిమే నాకు ఫోన్ చేసింది.. అంటుంది జ్వాల. హిమా.. అంటుంది. హిమ అంటే ఎవరో తెలుసా నీకు.. నా సిస్టర్ అంటుంది జ్వాల.

దాన్ని అలా పిలవడానికే నాకు అసహ్యంగా ఉంది. అది నా సిస్టర్ ఏంటి. మా అమ్మానాన్నలను పొట్టన పెట్టుకుంది. వాళ్ల చావుకు కారణం అయింది.. ఇదే ఆ పని చేసింది అని అంటుంది జ్వాల. ఇందుకే.. నాకు అక్కాచెల్లెళ్ల బంధం నచ్చదు అంటుంది జ్వాల.

నా కళ్ల ముందే మా అమ్మానాన్నల చావుకు కారణం అయింది. అందుకే తన మొహం చూడటం కూడా ఇష్టం లేకే ఇంట్లో నుంచి పారిపోయి వచ్చాను అంటుంది జ్వాల. రోజులు గడుస్తున్నా దాని మీద కోపం తగ్గేలా లేదు. నా వయసు పెరిగే కొద్దీ.. దాని మీద కోపం పెరుగుతుంది అంటుంది జ్వాల.

దాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానో.. నాకున్న కోపాన్ని తీర్చుకుంటానా అని ఎదురు చూస్తున్నాను. దాని మీద ఉన్న కోపాన్ని… డాక్టర్ సాబ్ మీద ఉన్న ప్రేమను పోల్చుకుంటే.. దాని మీద ఉన్న కోపమే నాకు ఎక్కువ అనిపించింది అంటుంది జ్వాల.

ఇన్ని సంవత్సరాలుగా దాని కోసం ఎదురు చూస్తున్నాను. అది ఫోన్ చేసేసరికి.. నన్ను నేనే మరిచిపోయాను. నాకు ఏం చేయాలో తోచలేదు. అందుకే అక్కడ ఉండలేక వచ్చేశాను అంటుంది జ్వాల. నువ్వు వెళ్లు తింగరి.. నీతో తర్వాత మాట్లాడుతాను అంటుంది జ్వాల.

మరోవైపు శోభ ఎలా జ్వాలపై పగ తీర్చుకోవాలా అని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. మరోవైపు జ్వాలకు ఎవరు ఫోన్ చేశారు అని అనుకుంటుంది హిమ. తనను ఎవరైనా ఆటపట్టిస్తున్నారా అని అనుకుంటుంది హిమ. పాపం శౌర్య ఎంత ఫీల్ అయిందో ఏమో అని అనుకుంటుంది హిమ.

మరోవైపు హిమను గుడికి తీసుకెళ్లి నిరుపమ్ తనకు తాళి కడుతుండగా జ్వాల చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

3 hours ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

4 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

6 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

6 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

7 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

8 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

9 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

10 hours ago