Karthika Deepam 14 Nov Today Episode : చివరిసారి ఇంట్లో వంట వండి.. పిల్లలను కూడా వదిలేసి బస్తీకి పయనం అయిన దీప.. కార్తీక్ ఒప్పుకుంటాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 14 Nov Today Episode : చివరిసారి ఇంట్లో వంట వండి.. పిల్లలను కూడా వదిలేసి బస్తీకి పయనం అయిన దీప.. కార్తీక్ ఒప్పుకుంటాడా?

 Authored By gatla | The Telugu News | Updated on :14 November 2021,10:28 am

Karthika Deepam 14 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. కార్తీక దీపం సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మాత్రమే ప్రసారం అవుతుంది. అంటే తిరిగి సోమవారం, 15 నవంబర్ 2021న ప్రసారం అవుతుంది. ఆరోజు ప్రసారం అయ్యే1197 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనిత ఇంటికి వెళ్లి దీప బెదిరించిన విషయం తెలిసిందే. దీపకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది అని మోనిత షాక్ అవుతుంది. కృష్ణా రామా అంటూ ఏడుస్తూ కూర్చుంటుంది అని అనుకున్నా కానీ.. ఇంతలా ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అనుకుంటుంది మోనిత.

karthika deepam 14 november 2021 episode highlights

karthika deepam 14 november 2021 episode highlights

మరోవైపు దీప కోసం ఊరంతా వెతుకుతాడు కార్తీక్. బస్తీకి కూడా వెళ్తాడు. కానీ.. దీప ఎక్కడా కనిపించదు. ఎక్కడికి వెళ్లావు దీప. ఎక్కడ ఉన్నావు అంటూ తెగ టెన్షన్ పడుతాడు కార్తీక్. ఇంతలో కార్తీక్ కు మోనిత ఫోన్ చేస్తుంది. వేరే నెంబర్ నుంచి ఫోన్ చేస్తుంది. డాక్టర్ బాబు అంటూ దీపలా మాట్లాడుతుంది. దీప అనుకుంటాడు. తర్వాత కార్తీక్.. నేను మోనితను అంటుంది. దీంతో కార్తీక్ కు చిరాకు వచ్చి.. ఇంకోసారి ఫోన్ చేస్తే బాగుండదు అని చెప్పి కార్తీక్ ఫోన్ కట్ చేస్తాడు.

కట్ చేస్తే దీప కూరగాయలు, ఇతర సామాన్లు తీసుకొని ఇంటికి ఆటోలో వస్తుంది. అప్పుడే కార్తీక్ కూడా ఇంటికి వస్తాడు. పిల్లలు చూసి.. అమ్మ నువ్వు నాన్న కారులో రావచ్చు కదా అమ్మ అంటారు. దీపను చూసిన కార్తీక్.. తన మనసులో ఏమనుకుంటోంది అని అనుకుంటాడు. మా దారులు వేరమ్మా అంటూ శౌర్యతో అంటుంది. ఇద్దరం ఒకే కారులో ప్రయాణించలేం అమ్మా అంటుంది.

Karthika Deepam 14 Nov Today Episode : మార్కెట్ కు వెళ్లి కూరగయాలు తీసుకొచ్చిన దీప

అవన్నీ ఏంటమ్మా అని హిమ అడుగుతుంది. మార్కెట్ కు వెళ్లి చాలా రోజులు అయింది కదా అమ్మా. అందుకే ఈరోజు చేశాను అంటుంది. ఇంత షాపింగ్ ఎప్పుడూ చేయలేదు కదమ్మ అంటుంది శౌర్య. అవును శౌర్య.. బస్తీలో ఉన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండేవాళ్లం. అదే కరెక్ట్ అనిపిస్తోంది. ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలియదు కదా అందుకే ఈరోజు వెళ్లాల్సి వచ్చింది అని చెబుతుంది దీప.

కట్ చేస్తే వదినా.. నేను రాగానే పిల్లలు టెన్షన్ పడ్డారు తెలుసా.. నేను రాలేదని అంటాడు ఆదిత్య. దీంతో నేను ఎటు వెళ్తానురా. ఒకవేళ నాకు ఏదైనా జరిగినా.. మీకు వీళ్లంతా ఉన్నారుగా అంటుంది దీప. దీంతో అందరూ షాక్ అవుతారు. డాక్టర్ బాబు.. గుత్తి వంకాయ, దోసకాయ పచ్చడి మీకోసమే చేశాను. వదలకుండా తినేయాలి. మళ్లీ ఎప్పుడు తింటారో ఏమో అంటుంది.

డాక్టర్ బాబు.. నేను వండిన వంటలకు ఎన్ని మార్కులు వేస్తారు అని అడుగుతుంది దీప. 10కి 10 మార్కులు అంటాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది