Karthika Deepam : కార్తీక దీపం క్రేజ్ డౌన్.. టీఆర్పీ రేటింగ్‌లు పతనం.. కారణం ఇదేనా..?
Karthika Deepam ఒకప్పుడు కార్తీకదీపం సీరియల్ అంటే అందరిలోనూ క్రేజ్ ఉండేది. టీఆర్పీ కింగ్ అని పిలిచేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎప్పుడూ ఒకేలా ఉండవు పరిస్థితులు అని చెప్పడానికి కార్తీకదీపం ఉదాహరణ. ఒకప్పుడు మంచి కథనం, గుండెలను పిండేసే ఎమోషన్లతో సాగింది. అందుకే కార్తీకదీపం సీరియల్కు జనాలు పట్టాభిషేకం చేశారు. అదే జనాలు ఇప్పుడు కార్తీకదీపం సాగదీతను భరించలేకపోతోన్నారు.
ఎటో ఎటో తీసుకెళ్లిపోతూ నానా పిచ్చిచేష్టలు చేస్తున్నారు. డాక్టర్ బాబు వంటలక్క ఎప్పుడు కలుస్తారా? అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆశగా ఎదురురచూశారు. అక్కడి వరకు కథ బాగానే ఉంది.కానీ అక్కడి నుంచి కథను ఎటెటో తిప్పాడు. మోనిత చచ్చిపోయిందని కోర్టు చుట్టూ కొన్ని రోజులు తిప్పాడు..

Karthika Deepam TRP Ratings Down Fall
Karthika Deepamపడిపోయిన కార్తీకదీపం రేటింగ్స్..
ఆ తరువాత మోనిత జైల్లో ఉండటం, బయటకు రావడం, ఇప్పుడు బిడ్డను కనడం, దోష నివారణ పూజ అంటూ ఎటెటో తీసుకెళ్లిపోతోన్నాడు.మొత్తానికి కథనంలో పస తగ్గిపోయింది. అందుకే రేటింగ్‌లో కూడా ఎఫెక్ట్ పడింది. ఒకప్పుడు 18 నుంచి 21 మధ్యలో టీఆర్పీ వచ్చేది. కానీ ఇప్పుడు పద్నాలుగు పదిహేను మధ్యనే కొట్టుమిట్టాడుతోంది. ఇక ఇప్పుడు కార్తీక దీపం ప్రభ తగ్గింది.
గుప్పెడంత మనసు, జానకి కలగనలేదు, గృహలక్ష్మీ వంటి సీరియళ్లు దూసుకొస్తున్నాయి. మరి కొన్ని రోజులు కార్తీక దీపం ఇలానే సాగదీస్తూ పోతుంటే.. టీఆర్పీలో వెనకబడే అవకాశం ఉంది. అయితే కార్తీకదీపం సీరియల్‌కు వంటలక్క, డాక్టర్ బాబు, మోనితలే బలం.