Karthika Deepam 14 Sep Today Episode : మోనితను కోర్టుకు తీసుకొచ్చిన దీప.. మోనిత అరెస్ట్.. కార్తీక్ నిర్దోషిగా విడుదల.. కార్తీక్ ఇంట్లో పండుగ వాతావరణం.. కానీ ట్విస్ట్ ఏంటంటే?
Karthika Deepam 14 Sep Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ 14 సెప్టెంబర్ 2021, మంగళవారం తాజాగా విడుదలైంది. ఈరోజు ఎపిసోడ్ 1144 హైలైట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక్ ను కోర్టులో విచారిస్తుంటారు. మోనితను కార్తీకే చంపాడని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తాడు. కార్తీక్ తరుపు లాయర్ మాత్రం.. మోనిత బతికే ఉందని చెప్పడంతో.. ఓసారి ఏసీపీని విచారించేందుకు అనుమతించాలని కోర్టు వారిని కోరుతాడు.
మోనిత బతికే ఉందని కార్తీక్ చెబుతున్నారు. ఈ విషయం మీకు ముందే తెలుసా.. అని ఏసీపీని అడుగుతాడు లాయర్. దీంతో తెలుసు అని సమాధానం ఇస్తుంది ఏసీపీ. తెలిశాక మరి ఎంక్వయిరీ చేశారా.. అని అడుగుతాడు లాయర్. చేశాను.. అంటుంది. డాక్టర్ కార్తీక్ కట్టుకథ చెప్పడం మొదలు పెట్టాడని స్పష్టంగా అర్థం అయింది. సోదమ్మ వేషంలో వచ్చి మోనితే అని తన భార్య భ్రమ పడింది. ఆ విషయమే అతడికి చెప్పింది. ఆ విషయం నమ్మి మూగ అమ్మాయిగా వచ్చింది మోనితే అని అనుకున్నాడు.. అని అంటుంది. డాక్టర్ కార్తీక్ అంత ఖచ్చితంగా మోనిత బతికే ఉందని ఎలా చెబుతున్నారు.. అని లాయర్ అడుగుతాడు. అది అంతా కట్టుకథే అంటుంది ఏసీపీ. దీంతో వాదోపవాదాలు ముగుస్తాయి.
Karthika Deepam 14 Sep Today Episode : మోనితను కార్తీకే హత్య చేశాడని కోర్టులో రుజువు
జడ్జి తీర్పు చెప్పడం ప్రారంభిస్తాడు. ముద్దాయి కార్తీక్.. డాక్టర్ మోనితను హత్య చేశాడన్న అభియోగంపై వాదనలు ముగిశాయి. వాదోపవాదాలు విన్నత తర్వాత.. ముద్దాయి వృత్తిని, చదువు సంస్కారాన్ని, కుటుంబ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకొని వారి వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. చనిపోయిన డాక్టర్ మోనిత గర్భవతి. ఆమె వ్యక్తిగతంగా ఎన్ని కుట్రలు చేసినప్పటికీ ఏ వ్యక్తికీ మరో వ్యక్తిని చంపే అధికారం లేదు. గర్భవతిగా ఉన్న స్త్రీని నిర్దాక్షిణ్యంగా చంపినట్టు నిరూపించబడింది కాబట్టి… అని జడ్జి తీర్పు చెబుతుండగానే ఒక్క నిమిషం మైలార్డ్ అంటూ దీప అక్కడికి వస్తుంది.
దీంతో అందరూ షాక్ అవుతారు. కోర్డులోకి వచ్చిన దీప.. జడ్జికి నమస్కారం పెడుతుంది. నా పేరు దీప. బోనులో నిలబడి ఉన్న డాక్టర్ కార్తీక్ భార్యను. తీర్పు వినిపించే ముందు ఒక ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతున్నాను.. అని దీప వేడుకోగానే ఎస్.. అంటాడు జడ్జి. ఆ సాక్షి మరెవరో కాదు మైలార్డ్. ఎవరైతే చనిపోయిందని భావిస్తున్నారో.. ఎవరిని అయితే నా భర్త చంపేశాడు.. అని అభియోగం మోపారో.. ఆ మోనిత.. అని కోర్టుకు చెబుతుంది దీప.
Karthika Deepam 14 Sep Today Episode : మోనితను కోర్టుకు తీసుకొచ్చిన దీప
మోనిత.. రా అమ్మ.. అని పిలుస్తుంది దీప. దీంతో కోర్టులోకి దీప మెల్లగా నడుచుకుంటూ వస్తుంది. దీంతో ఏసీపీతో పాటు అందరూ తనను చూసి షాక్ అవుతారు. సౌందర్య, ఆదిత్య, ఆనందరావు అయితే మోనితను చూసి లేచి నిలబడతారు. ఏసీపీ కూడా మోనితను చూసి లేచి నిలబడుతుంది. మోనిత వెనుకే వారణాసి కూడా వస్తాడు.
తనను అరెస్ట్ చేయడానికి రాగానే.. వెయిట్ నేను పారిపోను.. అంటుంది మోనిత. వెళ్లి బోనులో నిలబడుతుంది. వెంటనే సౌందర్య.. దీప దగ్గరికి వచ్చి దీపను హత్తుకొని నువ్వు నిజంగా నా ఇంటి ఇలవేల్పువే.. నిజంగానే సతిసావిత్రివి.. నా బంగారానివి.. నా కొడుకును కాపాడావు.. అంటూ దీపను పొగుడుతుంది సౌందర్య.
బోనులో నిలుచున్న మోనిత.. నమస్కారం మైలార్డ్. నా పేరే మోనిత అంటుంది. డాక్టర్ మోనిత అంటుంది. నా ఎదురుగా ఉన్న కార్తీక్ చంపింది నన్నేనని ఇప్పటి దాకా మీరు భావించి ఉంటారు. అతడు నిరపరాధి.. అంటుంది. నేను ప్రాణాలతోనే ఉన్నాను.. అంటుంది మోనిత.
మరి ఇదంతా ఏంటి.. మీరు బతికే ఉంటే.. మిమ్మల్ని చంపిన నేరం మీద కార్తీక్ ను అరెస్ట్ చేస్తే నువ్వేం చేశావు. అతడిని ఇన్ని ఇబ్బందులకు ఎందుకు గురి చేశావు.. అని అడుగుతాడు జడ్జి. క్షమించాలి.. మీ అందరి సమయం వృథా చేసినందుకు. నేనిప్పటి వరకు అండర్ గ్రౌండ్ లో ఉన్నాను. దానికి కారణం కార్తీక్ మీద నాకు ధ్వేషం కాదు.. ప్రేమ. ఆ ప్రేమ వల్లే అతడి బిడ్డకు తల్లిని కావాలని అనుకున్నాను. ఆ ప్రేమ వల్లే అతడికి రెండో భార్యగా ఉండాలనుకున్నాను. కానీ.. నా ప్రేమే నాకు శాపం అయింది. నన్ను మంచి, చెడు.. తప్పు, ఒప్పు అనేవి ఆలోచించే స్థాయిని మించిపోయేలా చేశాయి. అందుకే.. నేను చనిపోయినట్టు నాటకం ఆడి.. నా కార్తీక్ ను అరెస్ట్ చేయించాల్సి వచ్చింది. ఆ తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటే లొంగిపోతాననే ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. నేను లొంగిపోతానన్నా.. నాకు లొంగిపోలేదు కార్తీక్. అతడు ఇప్పటికీ నా ప్రేమను గుర్తించడం లేదు. కానీ.. నా కార్తీక్ కు శిక్ష పడితే మాత్రం నా ప్రేమకు అర్థం లేదనిపించింది. అందుకే.. నేను బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది. మీ అందరి సమయాన్ని వృథా చేసినందుకు అందరూ నన్ను మన్నించాలని కోరుకుంటున్నాను.. అని చెబుతుంది మోనిత.
Karthika Deepam 14 Sep Today Episode : ఏసీపీ రోషిణిని మందలించిన కోర్టు
ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయదలుచుకున్నప్పుడు.. అంతకు ముందు ఏమాత్రం నేర చరిత్ర లేని వ్యక్తిని అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ముందుగా పూర్తి విచారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో ఉన్నతమైన స్థానంలో ఉన్న గౌరవనీయమైన వృత్తిలో ఉన్న డాక్టర్ కార్తీక్ ను అరెస్ట్ చేసేముందు పోలీస్ వారు పూర్తి విచారణ చేయలేదని స్పష్టం అవుతోంది. అందుకు బాధ్యులైన పోలీసు శాఖ వారిని మందలిస్తూ ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని కోర్టు ఆదేశిస్తోంది.. అని జడ్జి చెబుతాడు. దీంతో సారీ సార్ అని అంటుంది ఏసీపీ రోషిణి.
ఇక కేసు విషయానికి వస్తే.. హత్యకు గురయిందన్న డాక్టర్ మోనిత బతికే ఉన్నందున.. ప్రత్యక్షంగా కోర్టుకే రావడం వల్ల.. నిందితుడైన డాక్టర్ కార్తీక్ ను నిరపరాధిగా భావించి ఈ కోర్టు విడుదల చేయడం జరిగింది.. అని జడ్జి తీర్పు వెలువరిస్తాడు.
చంపకపోయినా.. చంపేశాడనే నేరం మోపిన మోనిత.. డాక్టర్ కార్తీక్ పరువు ప్రతిష్టలను దెబ్బతీయడం, ఆయన్ను మానసిక ఒత్తిడికి గురి చేయడం.. ఇవన్నీ నేరంగానే పరిగణిస్తూ.. ఆమెను అదుపులోకి తీసుకొని.. తదుపరి విచారణకు హాజరు పరుచవలసిందిగా పోలీసు వారిని ఆదేశించడం జరిగింది.
Karthika Deepam 14 Sep Today Episode : దీపను మెచ్చుకున్న కోర్టు
ఒక నిరపరాధికి శిక్ష పడకుండా ఆఖరి నిమిషంలో కోర్టు వారికి సహకరించిన శ్రీమతి దీప కార్తీక్ ను కోర్టు అభినందిస్తోంది.. అని జడ్జి తీర్పు వెలువరించి.. వెళ్లిపోతాడు. వెంటనే మోనితను పోలీసులు అదుపులోకి తీసుకుంటారు.
కార్తీక్ వెంటనే దీప దగ్గరికి వెళ్లి తనను హత్తుకుంటాడు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఒకచోట నిలబడగా.. అక్కడికి వచ్చిన మోనిత ఎక్స్ క్యూజ్ మీ అంటుంది. అప్పుడే సినిమా సుఖాంతం అయిపోయిందని సంబుర పడుతున్నారా? నా కార్తీక్.. ఇంకా నా మీద నేరం నిర్ధారణ కాలేదు. శిక్ష పెద్దగా పడుతుందని నేను అనుకోవడం లేదు. ఈ లోపు నా కడుపులో పెరిగే నీ బిడ్డ ఈ భూమ్మీద పడతాడు. నీ రక్తం పంచుకొని పుడతాడు. అప్పుడు వస్తా.. మళ్లీ వస్తా.. బీ రెడీ.. వస్తా.. లవ్యూ మైడియర్ అని చెప్పి మోనిత అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Karthika Deepam 14 Sep Today Episode : మోనితను విచారించిన ఏసీపీ రోషిణి
కట్ చేస్తే.. ఏసీపీ రోషిణి.. మోనితను విచారిస్తుంటుంది. మేక వన్నె పులి అనడానికి నువ్వు సరిగ్గా సరిపోతావు మోనిత.. అంటుంది రోషిణి. నీ గురించి విన్నప్పుడు నీపై జాలి పడ్డాను. కానీ ఇప్పుడు సిగ్గు పడుతున్నాను. ఇంత చేసినా నా ఎదురుగా ఉన్నా తప్పు చేశాను అనే ఫీలింగ్ నీలో కనిపించడం లేదు. ఏం సాధిద్దామని ఇదంతా చేశావు.. అని ప్రశ్నిస్తుంది ఏసీపీ.
దీంతో.. సాధించాను మేడమ్. నేను అనుకున్నది సగం సాధించాను.. అంటుంది మోనిత. ఇక కార్తీక్ ను పెళ్లి చేసుకుంటే నేను అనుకున్నది పూర్తిగా సాధించదాన్ని అవుతాను. కార్తీక్ అంటే నాకు పిచ్చి. తను ఇంకొకరికి భర్త కాకముందు నుంచి నేను తనను ప్రేమించాను. నా వాడిని చేసుకోవాలనుకున్నాను. కానీ దీపను చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల తండ్రి అయ్యాడు. అయినా తనపైన నా ప్రేమ చావలేదు మేడమ్. తనే నా భర్త కావాలనుకున్నాను తెగించాను.. అంతే అంటుంది మోనిత.
ఇంత ఓపెన్ గా నువ్వు చేసిన తప్పును ఒప్పుకున్నావంటే.. నువ్వేంటో పూర్తిగా అర్థం అయింది.. అని అంటుంది రోషిణి. కానీ.. నువ్వు చేసిన నేరాలకు, ఘోరాలకు జీవిత కాలం శిక్ష పడుతుంది నీకు అంటుంది రోషిణి. పడనీయండి మేడమ్.. నేను భయపడటం లేదు. నా ప్రేమ నిజం అయితే.. నేను త్వరగా విడుదలవుతాను. కార్తీక్ ను పెళ్లి చేసుకొని తీరుతాను. నాకు మీరు ఎంత పెద్ద శిక్ష వేసినా సరే.. నేను భరిస్తాను కానీ.. మిమ్మల్ని చూసి నా మనసులో మాటను చెప్పాలని అనిపించింది. నా మనసులో మాటను కార్తీక్ కు చెప్పడం వల్లే ఇదంతా జరిగింది. ఇప్పటికి కూడా మీకు చెప్పకపోతే.. అది నా అసమర్ధత అవుతుంది.. అంతే అని అంటుంది మోనిత.
నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు మోనిత. కానీ.. నువ్వు మాట్లాడిన ప్రతి మాటలో కార్తీక్ పట్ల బాధే కనిపిస్తోంది. అతడి కష్టం కనిపిస్తోంది. ఒక ఫ్యామిలీ కనిపిస్తోంది.. అని రోషిణి అనగానే నాకు మాత్రం కార్తీకే కనిపిస్తున్నాను. నన్ను కొట్టినా తిట్టినా నేను మాత్రం ఇదే చెబుతాను. ఎందుకంటే కార్తీక్ అంటే నాకు అంత పిచ్చి ప్రేమ. తను నాకు కావాలి మేడమ్ అని అంటుంది. ఇంతలో రత్నసీత అక్కడికి వస్తుంది. మనం రేపు మాట్లాడుకుందాం.. తీసుకెళ్లు.. అని అంటుంది రోషిణి.
Karthika Deepam 14 Sep Today Episode : మోనితను ఎందుకు వదిలేయలేదు.. అంటూ కార్తీక్ ను ప్రశ్నించిన పిల్లలు
కట్ చేస్తే.. కార్తీక్ ఇంటికి వస్తాడు. పిల్లలతో హాయిగా ఆడుకుంటాడు. నాన్నా నాకు ఒక డౌట్ అని అడుగుతుంది శౌర్య. ఏంట్రా ఆ డౌటు.. అనగానే మోనిత ఆంటి, నువ్వు కలిసి ఓ ఆపరేషన్ చేశారని అమ్మ చెప్పింది. ఆ పేషెంట్ చచ్చిపోయింది అని కూడా చెప్పింది. అప్పుడు పోలీసులు నిన్ను పట్టుకెళ్లారు. మోనిత ఆంటి పారిపోయింది. మరి ఇప్పుడు నువ్వు ఎలా వచ్చావు నాన్నా అని అడుగుతారు. మోనిత ఆంటి కూడా బయటికి రావాలి కదా. మోనిత ఆంటి పారిపోయింది కదా.. అంటే డాడీ పారిపోలేదు కదా.. అంటూ ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తారు పిల్లలు. చెప్పండి నాన్నా.. మిమ్మల్ని వదిలేసిన పోలీసులు మోనిత ఆంటిని ఎందుకు వదిలేయలేదు.. నువ్వు వదిలేయమని చెప్పొచ్చు కదా.. అని అడుగుతారు పిల్లలు.
అత్తమ్మా.. ఆ పోలీసులు, లాకప్.. అవన్నీ ఓ పీడకలలా మీ నాన్నా మరిచిపోవాలని అనుకుంటున్నారు.. అని దీప అడగగానే.. ఆన్సర్ చెప్పడం ఇష్టం లేనప్పుడు అమ్మ ఇలాగే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది అని అంటుంది శౌర్య. ఇక లేట్ అయింది మీరు వెళ్లి పడుకోండి.. అని చెబుతాడు కార్తీక్. ఇంతలో నాన్నా అంటూ పిలుస్తుంది శౌర్య. ఆరోజు మా ఇద్దరిని తీసుకొని మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్లిపోదాం అన్నావు కదా.. ఎప్పుడు వెళ్లిపోదాం అని ప్రశ్నిస్తుంది శౌర్య.
కట్ చేస్తే.. మోనిత మీద జాలి చూపిస్తుంది దీప. దీంతో.. దీప మీద విరుచుకుపడతాడు కార్తీక్. మోనిత మీద జాలి చూపిస్తావా? అంటూ దీపను తిడుతాడు. మరోవైపు రత్నసీతను ఏదో సాయం కోరుతుంది మోనిత. ఇది చాలా రిస్క్. దీని వల్ల నా ఉద్యోగం పోతుంది.. అని రత్నసీత చెబుతుంది. ఏం కాదు.. నేను చెప్పినట్టు చేయి చాలు.. అని అంటుంది మోనిత. సరే.. అంటుంది రత్నసీత. ఆ తర్వాత మోనిత ఏదో ప్లాన్ చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.