Karthika Deeapm 15 March Today Episode : ఆనంద్ ను అరుణ, లక్ష్మణ్ కు ఇచ్చి ఊరు వదిలి వెళ్లిపోయిన మోనిత.. మోనిత ఇంటికెళ్లి షాక్ అయిన హిమ

Authored By Varun G | The Telugu News | Published on: March 15, 2022, 10:30 am

Karthika Deeapm 15 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 15 మార్చి 2022, మంగళవారం ఎపిసోడ్ 1300 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్, దీప, హిమకు పిండప్రదానం చేస్తుంది సౌందర్య. మరోవైపు మోనిత కూడా కార్తీక్ కు పిండప్రదానం చేయిస్తుంది. కార్తీక్ గురించే తలుచుకుంటూ ఉంటుంది. నువ్వు అన్నమాట ప్రకారమే నా బిడ్డ నాకు దక్కాడు కానీ.. నువ్వు దక్కకుండా పోయావు ఏంటి కార్తీక్. నేను ఏం చేసినా అది నీకోసం. నీ కోసం చావుకు కూడా ఎదురెళ్లాను. కానీ నా బిడ్డను, నన్ను అన్యాయం చేసి ఇలా నువ్వు చావుతో వెళ్లిపోతావనుకోలేదు అని అనుకుంటుంది మోనిత.

karthika deepam 15 march 2022 full episode

karthika deepam 15 march 2022 full episode

అందరూ పిండాలకు నమస్కారం చేసుకోండి అంటాడు పూజారి. ఆ తర్వాత పిండాలను తీసుకెళ్లి నదిలో కలపండి అంటాడు. దీంతో ఆనంద రావు, సౌందర్య ఇద్దరూ వెళ్లి పిండాలను నదిలో కలిపి వస్తారు. మరోవైపు మోనిత కూడా నదిలోకి వెళ్లి పిండాలను నదిలో కలిపి వస్తుంది. ఆ తర్వాత సౌందర్య వెక్కి వెక్కి ఏడుస్తుంది. అయ్యో.. అంటూ కుప్పకూలిపోతుంది. అయ్యో కార్తీక్ అంటూ ఏడుస్తుంది. మన కార్తీక్ అండి.. అంటూ తల బాదుకుంటుంది. మరోవైపు లక్ష్మణ్ కు కొన్ని కాగితాలు ఇస్తుంది మోనిత. చిన్నతప్పు చేస్తేనే నా కార్తీక్ ఆస్తి రాసిచ్చాడు. నేను చాలా పెద్ద పెద్ద తప్పులే చేశాను లక్ష్మణ్ అంటుంది మోనిత.

నా భర్త నడిచిన అదే దారిలో నేనూ నడవాలని అనుకుంటున్నాను. అందుకే నా ఆస్తి మీకు రాసిస్తున్నాను అని డాక్యుమెంట్లు ఇస్తుంది. ఇందులో కూడా నా స్వార్థం ఉంది. నా ఆస్తి తీసుకొని నా బిడ్డను మీ దగ్గరే ఉంచుకోండి. వీడిని డాక్టర్ ను చేయండి. మా ఇంటిని మాత్రం మా మెమోరీ కోసం ఇక్కడే ఉంచండి. మీరు మాత్రం దూరంగా వెళ్లి వీడిని పెంచండి అంటుంది మోనిత.

దీంతో మీరు ఎక్కడికని వెళ్తారమ్మా అంటాడు లక్ష్మణ్. ఈ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండాలి. నేను ఉన్నప్పుడు ఎలా ఉందో.. ఆ తర్వాత కూడా అలాగే ఉండాలి. ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. నేను లేని సమయంలో కార్తీక్ ఆత్మ అయినా వచ్చి నా ప్రేమను గుర్తు చేసుకొని బాధపడితే నాకు అదే చాలు అంటుంది మోనిత.

సరే.. బిడ్డను తీసుకో అరుణ అంటుంది మోనిత. అమ్మ.. మీరు ప్రాణంగా ప్రేమించిన డాక్టర్ బాబే లేరు. ఆయన మెమెరీగా ఆనంద్ ను మీరే ఉంచుకోండి అంటుంది అరుణ. కానీ.. వద్దు.. ఆనంద్ నాతోనే ఉంటే.. వాడిని చూసినప్పుడల్లా కార్తీకే గుర్తొస్తాడు. దయచేసి వీడిని బస్తీలో ఉంచకండి. నా మీద కోపంతోనో.. దీప మీద ప్రేమతోనో బస్తీ జనం వీడిని ఏదైనా చేసే అవకాశం ఉంది.

Karthika Deeapm 15 March Today Episode : హైదరాబాద్ కు వచ్చిన హిమ

కావాల్సినంత డబ్బుఇచ్చాను. అందుకే వీడిని ఎక్కడికైనా తీసుకెళ్లి బాబును జాగ్రత్తగా పెంచండి అని చెప్పి తన బిడ్డను అరుణకు ఇచ్చేస్తుంది మోనిత. జాగ్రత్త.. నా విలువైన నా బిడ్డను నీ మీద నమ్మకంతో వదిలేసి వెళ్తున్నాను అంటుంది మోనిత.

బిడ్డను అరుణకు ఇచ్చేసి అక్కడి నుంచి ఉత్త చేతులతో వెళ్లిపోతుంది మోనిత. మరోవైపు హిమ హైదరాబాద్ కు వచ్చేస్తుంది. సౌందర్య ఇంటికి వెళ్లేందుకు పరిగెడుతూ వస్తుంటుంది. ఇంతలో అక్కడికొచ్చిన శౌర్య.. నడి ఇంట్లో దీని ఫోటో ఎందుకు పెట్టారు అని అంటుంది. దాన్ని తీసి విసిరేస్తుంది.

అప్పుడే హిమ అక్కడికి వస్తుంది. ఆ ఫోటోను చూసి షాక్ అవుతుంది. దాని గుర్తులేవీ ఇక్కడ కనిపించకూడదు అంటుంది శౌర్య. అమ్మానాన్నలను మింగేసిన రాక్షసి అది. నేను హిమను వదిలిపెట్టను నానమ్మ. మళ్లీ దానిపేరు ఈ ఇంట్లో ఎవరైనా ఎత్తితే నేను మీకు దక్కను అంటుంది శౌర్య.

దీంతో మోనిత ఇంటికి వెళ్తుంది హిమ. అక్కడ కార్తీక్, మోనిత కలిసి ఉన్న ఫోటోను చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత మోనిత, ఆనంద్ ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోను కూడా చూసి షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp