Poonam Kaur : పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితేనే సిగ్గేస్తుంది.. పూనమ్ కౌర్ కామెంట్లు వైరల్
Poonam Kaur : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వినగానే ఆయన ఫ్యాన్స్‌కు ఎక్కడ లేని ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం భీమ్లా నాయక్ మూవీ హిట్ ను ఎంజాయ్ చేస్తున్న పవన్.. మరో వైపు రాజకీయాలపైనా దృష్టి సారిస్తున్నారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటనకు కాకుండా ఆయన వ్యక్తిత్వానికే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి. ఇదిలా ఉండగా కొన్ని రోజులుగా నటి పూనమ్, పవన్ కళ్యాణ్ మధ్య ఏదో రిలేషన్ ఉందంటూ కొన్ని రూరమ్స్ వస్తున్నాయి.
ఇక ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పూనమ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.పూనమ్ కౌర్.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తాజాగా ఆమె యాక్ట్ చేసిన నాతిచరామి మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గురించి ఆమెను అడగడంతో ఆమె కాస్త ఎమోషనల్ అయింది. ఆయన గురించి ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ అవుతుందని చెప్పుకొచ్చింది ఈ భామ.
poonam kaur in about talk pawan kalyan
Poonam Kaur : పవన్ కళ్యాణ్ తో చేసేందుకు కొందరు అడ్డుపడ్డారు
తాను పవన్ కళ్యాణ్ తో యాక్ట్ చేయలేదని, చాలా మంది చేయనివ్వలేదని వాపోయింది. పవన్ కళ్యాణ్ గురించి నేను ఏది మాట్లాడినా అది నెగెటివ్ అవుతుందని చెప్పకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. పవన్ గురించి మాట్లాడుతూనే కాస్త సిగ్గుపడింది. పూనమ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముందు నుంచీ సైతం ఈ అమ్మడి విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి. అవి కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.