Karthika Deepam 16 May Today Episode : జ్వాలకు నిరుపమ్ ఐలవ్యూ ఎందుకు చెప్పాడు? హిమను వద్దనుకున్నాడా? జ్వాలే శౌర్య అనే నిజం నిరుపమ్ కు తెలిసిపోయిందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 16 May Today Episode : జ్వాలకు నిరుపమ్ ఐలవ్యూ ఎందుకు చెప్పాడు? హిమను వద్దనుకున్నాడా? జ్వాలే శౌర్య అనే నిజం నిరుపమ్ కు తెలిసిపోయిందా?

 Authored By gatla | The Telugu News | Updated on :16 May 2022,10:30 am

Karthika Deepam 16 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 16 మే 2022, సోమవారం ఎపిసోడ్ 1353 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. హిమ ఎందుకు ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందో అని ఆలోచిస్తుంటాడు ప్రేమ్. హిమకు ఏమైంది. ఎందుకు వద్దని చెప్పింది. నన్ను ప్రేమించినందుకే అలా చెప్పిందా. ఖచ్చితంగా అదే అయి ఉంటుంది. అంతకన్నా ఇంకేం కారణం ఉంటుంది. నేను లక్కీ ఫెలోను. ఇప్పుడే చెప్పక పోయినా.. కాస్త టైమ్ తీసుకొని ప్రేమ్ బావనే పెళ్లి చేసుకుంటాను అని చెబుతుందేమో అని అనుకుంటాడు ప్రేమ్. అనవసరంగా ఫోటోలన్నీ డిలీట్ చేశాను అని బాధపడతాడు ప్రేమ్. ఇంతలో సత్యం వస్తాడు. ఫుల్లుగా తాగి వస్తాడు. ఏంట్రా ప్రేమ్.. హిమ ఇంత పని చేసింది అని అంటాడు. అప్పుడే మందు మొదలుపెట్టేశావా అని అడుగుతాడు.

karthika deepam 16 may 2022 full episode

karthika deepam 16 may 2022 full episode

దీంతో లేదురా.. బాధలో ఒక పెగ్గు వేశాను అంటాడు. హిమ ఎందుకు అలా చేసింది అని అడుగుతాడు సత్యం. ఏమో.. ఎవరి మనసులో ఏముందో మనకేం తెలుసు అని అంటాడు ప్రేమ్. ఇంతలో జ్వాల.. బాక్స్ తీసుకొని వస్తుంది. రాగానే ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ అయింది.. హిమ ఒప్పుకోలేదు అని ఈ విషయాలు జ్వాలకు చెప్పకు అని ప్రేమ్.. సత్యంతో చెబుతాడు. దీంతో సరే.. నేను చెప్పనులే అంటాడు. అందుకే.. చెబుతున్నాను అనవసరంగా ఏం మాట్లాడకు అంటాడు. పొద్దున వస్తే ఇల్లు తాళం వేసి ఉంది ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది జ్వాల. దీంతో మా ఫ్రెండ్ వాళ్ల ఎంగేజ్ మెంట్ కు వెళ్లాం అంటాడు సత్యం.

దీంతో ఉదయం గుడిలో జరిగిన ఎంగేజ్ మెంట్ గురించి మాట్లాడుతుంది జ్వాల. జనాలు విచిత్రంగా ఉంటారు కదా.. అక్కడిదాకా వచ్చి ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి.. ఏమో తను ఎవరిని ప్రేమించిందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

కట్ చేస్తే.. హిమ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన సౌందర్య.. ఏమైందే నీకు.. ఎంగేజ్ మెంట్ ఎందుకు క్యాన్సిల్ చేసుకున్నావు అని అడుగుతుంది. అరె.. స్వప్నను ఒప్పించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? నిరుపమ్ ఎంత బాధపడి ఉంటాడో తెలుసా? అని హిమను ప్రశ్నిస్తుంది సౌందర్య.

హిమ చెంప పగులగొట్టినా కూడా ఎందుకు తను ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసుకుందో చెప్పదు హిమ. అసలు.. మీ ఇద్దరికి ఎంగేజ్ మెంట్ కాదే.. ఏకంగా పెళ్లే చేయాలనుకున్నాను. శౌర్య దొరికే దాకా.. పెళ్లి చేసుకోనన్నావు కదా.. అందుకే ఎంగేజ్ మెంట్ దగ్గరే ఆగిపోయాను అంటుంది సౌందర్య.

Karthika Deepam 16 May Today Episode : హిమపై సౌందర్య సీరియస్

నీ మనసులో ఏముందో చెప్పు అని అడుగుతుంది సౌందర్య. శౌర్య కూడా నిరుపమ్ బావను ప్రేమిస్తోందని నీకు ఎలా చెప్పను. తన సంతోషం కోసమే నేను ఈ పని చేశానని నీకు చెప్పలేను నానమ్మ అంటుంది హిమ. మరోవైపు జ్వాల ఆటోలో వెళ్తూ ఉంటుంది.

రాత్రి అవుతుంది. నిరుపమ్ కారులో పడుకొని ఉంటాడు. ఫుల్లుగా తాగి ఉంటాడు. ఎంత లేపినా లేవడు. మందు తాగారా అని అడుగుతుంది. డాక్టర్ సాబ్ లేవండి అంటుంది. మెల్లగా తనను లేపుతుంది. డాక్టర్ సాబ్ నువ్వు ఇలా తాగడం ఏంటి అని అడుగుతుంది.

ఏం తాగకూడదా అని అంటాడు. ఏదైనా పార్టీ చేసుకున్నారా అని అడుగుతుంది. దీంతో అవును.. లవ్ పార్టీ చేసుకున్నాం అంటాడు నిరుపమ్. నేను నీకు ఇష్టమే కదా అంటాడు నిరుపమ్. డాక్టర్ సాబ్ అంటుంది. దీంతో ఐలవ్యూ అంటాడు నిరుపమ్.

దీంతో చాలా సంతోషిస్తుంది. నేను నిన్ను ఎంతగా ప్రేమించానో తెలుసా అని తను హిమను గుర్తు చేసుకొని మాట్లాడుతాడు కానీ.. అదంతా తన గురించే అనుకుంటుంది జ్వాల. తనను చూసి హిమ అనే అనుకుంటాడు నిరుపమ్. తనను ఆటోలో ఎక్కిస్తుంది.

నిరుపమ్ ను ఆటోలో ఇంటికి తీసుకొస్తుంది జ్వాల. స్వప్న.. తనను చూసి ఏ ఆగు. నువ్వేంటే ఇక్కడ. నువ్వేంటి ఆటోలో రావడం ఏంటి అంటుంది. దీంతో మమ్మీ నా గురించి నీకు తెలుసు కదా అంటాడు. ఏయ్.. నువ్వు జరుగు అంటుంది స్వప్న.

ఒక దరిద్రం పోయిందనుకుంటే.. ఇంకో దరిద్రం పట్టుకుంది అని అనుకుంటుంది స్వప్న. ఎప్పుడూ లేనిది ఈ తాగడం ఏంట్రా అంటుంది. ఇంకా నిలబడ్డావేం వెళ్లు అంటుంది స్వప్న. దీంతో వెళ్లక.. మీ ఇంట్లోకి వస్తామా వెళ్తాంలే అని చెబుతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది