Karthika Deepam 17 Aug Today Episode : దీపను ఏడిపించడం కోసమే.. చనిపోయినట్టు నటిస్తున్న మోనిత.. రత్నసీత ద్వారా కార్తీక్ బాగోగులు తెలుసుకుంటున్న మోనిత

Karthika Deepam 17 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్ తాజా ఎపిసోడ్ రిలీజ్ అయింది. 17 ఆగస్టు 2021, మంగళవారం 1120 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కానిస్టేబుల్ రత్నసీత.. డాక్టర్ బాబుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు చూసుకుంటుంది. ఆయనకు పడుకోవడానికి దుప్పటి, దిండు ఇవ్వడంతో పాటు.. భోజనం, పాలు కూడా తీసుకొచ్చి ఇస్తుంది. రత్న సీత అసలు నువ్వు ఎవరు? నాకోసం ఇవన్నీ   ఎందుకు చేస్తున్నావు? అంటూ డాక్టర్ బాబు రత్నసీతను అడుగుతాడు. దీంతో కానిస్టేబుల్ ను సర్.. అంటుంది…

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

ఎందుకు నన్ను చూసి ఇంతగా జాలి పడుతున్నావు.. అంటే కాదు సార్.. మీరంటే నాకు గౌరవం.. మీ హస్తవాసి బాగుంటుందని అందరూ అంటారు కానీ.. మీకే ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావడం లేదు అంటుంది రత్నసీత. నేను నేరాలు చేయలేదు పాపాలు చేశాను. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు అని తనలో తానే అనుకుంటాడు డాక్టర్ బాబు. ఆ తర్వాత డాక్టర్ బాబుకు మంచినీళ్ల బాటిల్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతుంది రత్నసీత.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

కట్ చేస్తే.. భాగ్యం.. తన భర్తకు అన్నం వడ్డిస్తుంటుంది. మైమరిచిపోయి.. ఏదో ఆలోచిస్తూ తన భర్తకు వడ్డిస్తూ ఉంటుంది. కంచంలో అన్నం ఎక్కువ వేస్తుంది. దీంతో భాగ్యం అని తన భర్త గట్టిగా పిలిచి.. ఏం ఆలోచిస్తున్నావ్.. అని ప్రశ్నిస్తాడు. దీంతో ఏం లేదయ్యా.. మన దీపకు, డాక్టర్ బాబుకు పెళ్లి అయి    11 సంవత్సరాలు గడిచాయి. ఒక్కసారి కూడా వాళ్లు తమ పెళ్లి రోజును జరుపుకోలేదు. వచ్చే నెల వాళ్ల పెళ్లి రోజు. అన్నీ మనం అనుకున్నట్టు జరిగి ఉంటే.. ఈసారైనా వాళ్ల పెళ్లి రోజును ఘనంగా జరుపుకునేవాళ్లం. విధి ఎంత విచిత్రమైనది…..  అనగానే తన భర్త వెక్కి వెక్కి ఏడ్చుతాడు. ఏడ్వకు అయ్యా.. అంటూ ఓదార్చుతుంది భాగ్యం.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

ఇదంతా ముష్టి మోనిత చేసిన పనే. అల్లుడికి ప్రశాంతత లేకుండా టార్చర్ పెట్టింది. అందుకే దాన్ని చంపేశాడు. కానీ.. చట్టం దృష్టిలో దోషిగా మారాడు. ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. ఎంత శిక్ష పడుతుందో ఏమో.. ఏం జరుగుతుందో ఆ దేవుడికే తెలియాలి.. అని అంటుంది భాగ్యం.

కట్ చేస్తే.. రాత్రి భోజనం తీసుకొని సౌందర్య.. పోలీస్ స్టేషన్ కు వెళ్తుంది. కార్తీక్ కు భోజనం వడ్డిస్తుంది. దీప ఎలా ఉంది.. అని అడుగుతాడు కార్తీక్. అప్పుడు సావిత్రిలా ఉంది. యముడి నుంచి తన భర్తను కాపాడుకున్న సతిసావిత్రిలా ఉంది. నా భర్తను కాపాడుకుంటాను ఎలాగైనా అంటుంది. మోనితను నువ్వు చంపే ఉంటావు అని అంటుంటే.. శివంగిలా లేస్తోంది. నా నమ్మకం మోనిత గర్భం విషయంలో జరిగింది.. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.. అంటుంది. నీకు నమ్మకం లేదా? అంటే.. లేదు అంటాడు. నువ్వు ఈ నేరం చెయ్యలేదా? అంటే    చెయ్యలేదు అంటారు. అయితే.. దీప నమ్మకమే గెలుస్తుంది. నువ్వు ఖచ్చితంగా బయటికి వస్తావు.. అంటుంది సౌందర్య…

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

బాగా రాత్రి అయిపోయింది మమ్మీ. పిల్లలు నాకోసం వెయిట్ చేస్తుంటారు నువ్వు వెళ్లు అంటాడు కార్తీక్. అదృష్టం అంటే బతుకు పాఠశాల బోర్డు మీద ఇవాళ నేర్చుకున్న పాఠంలా ఉండదు. రేపు ఇంకో పాఠం నేర్పిస్తుంది. పాతది చెరిపేసి కొత్తది రాస్తూనే ఉండాలి. నిరంతరం గుణపాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి.. ఈ మాట నేను అన్నానని దీపతో చెప్పు… అని సౌందర్యకు చెబుతాడు. ఆమె నమ్మకం మీద చెప్పింది. నేను అదృష్టం గురించి చెప్పాను.. అంటాడు కార్తీక్. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది సౌందర్య.

కట్ చేస్తే.. దీప ఎవరి కోసమో వెయిట్ చేస్తుంటుంది. ఇంతలోనే అంజి అక్కడికి వస్తాడు. దీపమ్మ రాత్రి పూట ఇక్కడ ఉన్నారు ఎందుకు. ఇంటికి రమ్మంటే వచ్చేవాడిని కదా అంటాడు అంజి. డాక్టర్ బాబు బయటికి వచ్చేదాకా.. నాకు నిద్రహారాలు ఉండవు. రాత్రి పగలు ఉండదు. డాక్టర్ బాబు గురించి తలుచుకుంటేనే భయం వేస్తోంది. అంజి.. ఆరోజు నిన్ను మోనిత ద్రాక్షారామంకు ఒప్పజెప్పి వెళ్లింది కదా. తర్వాత మోనితను చూశావా ఎప్పుడైనా అంటే.. లేదు కానీ.. ఆ రోజు తెల్లవారుజామున మోనితను చంపడానికి వెళ్లాను. కానీ.. అక్కడ పోలీసుల హడావుడి ఉండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయా. ఇంతలోనే డాక్టర్ బాబు తొందర పడ్డారు. దీపమ్మా.. ఏడవకండి. ఒక రాక్షసి నుంచి డాక్టర్ బాబును కాపాడుకోవడానికి కష్టపడుతున్నారు. నేను ఆ నేరాన్ని నా మీద వేసుకుంటాను. పాతకక్ష్యలతో నేనే మోనితను చంపానని నా మీద ఆ నేరం వేసుకుంటాను. మీరందరూ సంతోషంగా ఉండేలా నేను చేస్తాను.. అంటే నువ్వు మా కోసం నీ బతుకును నాశనం చేసుకుంటావా? అని అంటుంది దీప.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

నా భార్యకు నువ్వంటే బాగా నమ్మకం అంజి. నువ్వు బాగుండాలి. కావాలంటే నేను సాయం చేస్తాను.. అని ఆరోజు అన్నారు.. అలాంటి మహానుభావుడి కోసం ఈమాత్రం చేయలేనా? మోనిత లాంటి దాన్ని నేనే చంపాను అని చెప్పుకోవడం వల్ల నాకేమీ నష్టం లేదు.. అంటే ఆవేశపడకు అంజి. నువ్వు నాకు తోడుగా ఉండు.. అని అడుగుతుంది దీప. కానీ.. డాక్టర్ బాబును బయటికి ఎలా తీసుకురావాలి.. అని అడుగుతాడు అంజి.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

సాక్ష్యాల సంగతి మరిచిపో. మోనిత శవాన్ని కనిపెట్టగలిగితే చాలు. మనకు మిగితా విషయాలన్నీ తెలుస్తాయి. నేను మళ్లీ కలుస్తాను.. అని వెళ్లబోతుండగా.. మోనితకు నేను శత్రువును. మోనితకు నేను కాకుండా ఇంకెవరైనా శత్రువులు ఉన్నారా? మోనితను వాళ్లు చంపి డాక్టర్ బాబు మీద ఆ నేరం వేసి ఉండొచ్చు కదా.. అని అడుగుతాడు అంజి. శత్రువు ఉన్నాడు.. దుర్గ. మోనితకు ఉన్న మరో శత్రువు దుర్గ.. అని అంటుంది దీప. కానీ.. దుర్గ.. ఆ నేరాన్ని డాక్టర్ బాబు మీద వేయడు.. అంటుంది దీప. కానీ.. దుర్గను పట్టుకుంటే మనకు మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది.. అంటుంది దీప.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

అసలు ఎవరీ దుర్గ.. అంటే మా అత్తయ్య గారింట్లో డ్రైవర్. నన్ను చంపడానికి మోనిత అక్కడికి తీసుకొచ్చింది. కానీ.. తర్వాత ఆయన మోనితకే శత్రువు అయ్యాడు. తన బారి నుంచి నన్ను చాలాసార్లు కాపాడాడు.. ఏది ఏమైనా దుర్గను మనం పట్టుకోవాలి.. అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరబోతుంది దీప. ఇంతలో డ్రైవర్ వారణాసి.. అంజి దగ్గరికి వస్తాడు. మా డాక్టర్ బాబు కోసం నువ్వు జైలుకు వెళ్తావు అన్నావు కదా అన్నా. అక్కడే నేను నీకు ఫ్యాన్ అయిపోయాను. హ్యాట్సాఫ్ అన్న.. అని చెబుతాడు వారణాసి.

Karthika Deepam 17 Aug Today Episode :  మోనితను కలవడానికి వెళ్లిన కానిస్టేబుల్ రత్నసీత

కట్ చేస్తే కానిస్టేబుల్ రత్నసీత.. ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్తుంది. డోర్ తీసి చూస్తుంది. చూడగానే.. అక్కడ మోనిత కూర్చొని ఉంటుంది. నా కార్తీక్, నా కార్తీక్ అని గోడ మీద రాస్తుంది. కార్తీక్ ఫోటో పెట్టుకొని అతడినే చూస్తూ కూర్చుంటుంది. నా కార్తీక్ భోం చేశాడా? ఎలా ఉన్నాడు? కార్తీక్ ఫోటో తీశావా? అని రత్నసీతను చూసి అడుగుతుంది.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

ఇదిగోండి మేడమ్.. మా ఆయనకు ప్రాబ్లమ్ అని చెప్పి ట్యాబ్లెట్లు రాసుకొని వచ్చాను అని అనగానే తన హ్యాండ్ రైటింగ్ చూసి మురిసిపోతుంది. ఆ దీప రావడం వల్లనే నువ్వు మారిపోయావు. ఆ దీపకు నేనంటే ఏంటో తెలియాలి. అందుకే నిన్ను ఇంత బాధపెడుతున్నాను. నా ముందే నీకు దీప పాన్ తినిపిస్తుందా? ఆ దీప నిన్ను ఏమంటుందో అని తిన్నవు కానీ.. నీ మొహంలో సంతోషమే లేదు. అది.. నిన్ను నా నుండి దూరం చేయాలని చూసింది. కానీ.. నేను మాత్రం నిన్ను వదలను కార్తీక్.. నిన్ను వదలను. ఐలవ్యూ కార్తీక్. ఐలవ్యూ సోమచ్.. అని అంటుంది.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

ఇంతలో మేడమ్.. అని అంటుంది రత్నసీత. మేడమ్ టైమ్ అవుతోంది. నేను వెళ్లాలి అంటుంది. సార సారీ సారీ.. ఒక్క నిమిషం ఉండు.. అంటుంది. ఇదిగో.. ఇది ఉంచు.. అంటూ డబ్బు ఇచ్చి.. నువ్వు నామనిషివని ఎట్టిపరిస్థితుల్లో ఎవ్వరికీ తెలియకూడదు అంటుంది.  ఆ తర్వాత ఒసేయ్ దీప.. నాకు ఈ గతి పట్టించిన నిన్ను వదలనే.. వదలను.. అంటూ శపథ చేస్తుంది మోనిత.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

కట్ చేస్తే.. డాక్టర్ బాబును చూడటానికి దీపతో పాటు పిల్లలు కూడా వస్తారు. డాడీ.. అంటూ కార్తీక్ ను పట్టుకొని ఏడుస్తారు. డాక్టర్ బాబుకు భోజనం తీసుకొస్తారు. నిన్నెందుకు ఇక్కడ ఉంచారు డాడీ.. అని అడుగుతుండగానే.. ఏసీపీ మేడమ్ వచ్చి.. రత్నసీత.. వీళ్లను ఎందుకు లోపలికి పంపించావు. నీ డ్యూటీ నువ్వు చేయి.. ఇక్కడ సెంటిమెంట్స్ కు తావు లేదు.. అని అంటుంది ఏసీపీ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Karthika Deepam 17 August 2021 Tuesday 1120 episode highlights

ఇది కూడా చ‌ద‌వండి ==> Karthika Deepam 16 Aug Today Episode : మోనిత చనిపోలేదు.. బతికే ఉంది.. చనిపోయినట్టు ఎందుకు మోనిత యాక్ట్ చేస్తోంది? ఎందుకు ఎవ్వరికీ కనిపించకుండా బతుకుతోంది?

ఇది కూడా చ‌ద‌వండి ==> Janaki Kalaganaledu 16 Aug Today Episode : జానకి డిగ్రీ పట్టా తీసుకుంటుండగా చూసిన జ్ఞానాంబ.. జానకి చదువు గురించి అసలు నిజం తెలుసుకొని జ్ఞానాంబ ఏం చేస్తుంది?

ఇది కూడా చ‌ద‌వండి ==> ఆయన మా ఆయన.. ఏం రాస్తారో.. ఎలా రాస్తారో ఇప్పుడు రాయండి : నయనతార

ఇది కూడా చ‌ద‌వండి ==> రాజశేఖర్‌ని విలన్ చేసిన స్టార్ డైరెక్టర్..అందుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారో తెలుసా..?

 

Recent Posts

Urea : ఆంధ్ర యూరియా తెలంగాణకు వస్తుందట..వైసీపీ నేత కీలక వ్యాఖ్యలు

Urea Shortage : మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా కొరతపై సంచలన వ్యాఖ్యలు…

1 hour ago

Allu Aravind : అల్లు అరవింద్ కు షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్..వెంటనే కూల్చేయాలని ఆదేశాలు

Allu Business Park faces GHMC Notice : ప్రముఖ సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్‌కు…

2 hours ago

Malla Reddy Key Comments on CBN : చంద్రబాబు పై మల్లన్న ప్రశంసలు..సైకిల్ ఎక్కేందుకేనా..?

Malla Reddy Key Comments on CBN : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హాట్ టాపిక్‌గా మారారు.…

3 hours ago

Kavitha : కేసీఆర్ బాటలో వెళ్తునంటున్న కవిత

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) హైదరాబాద్‌లో జరిగిన కాళోజీ జయంతి, చాకలి ఐలమ్మ వర్థంతి కార్యక్రమంలో ముఖ్య…

4 hours ago

Nepal Crisis Deepens : ప్రధాని ఇంటికి నిప్పు పెట్టిన ఆందోళన కారులు..నేపాల్ లో టెన్షన్ టెన్షన్

Nepal Crisis Deepens : నేపాల్‌లో జెన్‌-జెడ్‌ యువత ఆందోళనలు దేశ రాజకీయాలను కుదిపేశాయి. సోషల్ మీడియా నిషేధం, అవినీతి…

5 hours ago

Apple Event | ఆపిల్‌ ఈవెంట్‌ 2025: ఐఫోన్‌ 17 సిరీస్‌ లాంచ్‌కు సిద్ధం.. నాలుగు కొత్త మోడల్స్‌, ఆధునిక ఫీచర్లతో ప్రదర్శన

Apple Event | ఐఫోన్‌ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న క్షణం ఆసన్నమైంది. ప్రపంచ టెక్‌ దిగ్గజం ఆపిల్‌ తన…

6 hours ago

Group 1 | గ్రూప్-1 మెయిన్స్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు .. మెరిట్ లిస్ట్ రద్దు, రీవాల్యుయేషన్ లేదా తిరిగి పరీక్షలు

Group 1 | గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై పలు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు…

7 hours ago

Rains | బంగాళాఖాతంలో మ‌రో అల్పపీడనం ప్రభావం.. రానున్న రోజుల‌లో భారీ వ‌ర్షాలు

Rains | తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలక హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్న…

8 hours ago