Karthika Deepam 16 Aug Today Episode : మోనిత చనిపోలేదు.. బతికే ఉంది.. చనిపోయినట్టు ఎందుకు మోనిత యాక్ట్ చేస్తోంది? ఎందుకు ఎవ్వరికీ కనిపించకుండా బతుకుతోంది?
Karthika Deepam 16 Aug Today Episode : కార్తీక దీపం సీరియల్ 16 ఆగస్టు 2021, సోమవారం ఎపిసోడ్ తాజాగా రిలీజ్ అయింది. 1119 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నీకు కష్టాలే కానుకగా ఇచ్చాను. నీ దు:ఖంతో నీ దోసిళ్లు నిండిపోయాయి దీప. ఇంకా నాకోసం ఏడవకు.. ఇలా ఏకధాటిగా నువ్వు ఏడవడం వల్లనే నీ కన్నీటి శాపం తగిలి నేను ఇలా కటకటాల వెనుక నిలబడ్డాను.. అంటూ తన కన్నీళ్లు తూడ్చుతాడు కార్తీక్. నా తరుపున ఒక్క సాక్ష్యం కూడా లేదు. ఏ లాయర్ వాదిస్తాడు. వదిలేయ్ దీప. నాకు ఏ శిక్ష పడుతుందో కూడా నాకే తెలియదు. నేను బయటికి రావాలని తెగ ప్రయత్నించి నేను రాలేను.. అని నీకు తెలిస్తే నువ్వు తట్టుకోలేవు. పిల్లలను జాగ్రత్తగా చూసుకో. వాళ్లు హంతకుడి బిడ్డలు అని ముద్ర పడకూడదు. నేను బయటికి రావాలంటే బలమైన సాక్ష్యం కావాలి దీప.. అని డాక్టర్ బాబు.. దీపతో మాట్లాడుతుండగానే… ఏసీపీ మేడమ్ స్టేషన్ కు వచ్చి దీపను తన క్యాబిన్ కు రమ్మంటుంది.
కట్ చేస్తే… సౌందర్య, తన భర్త.. ఇద్దరూ చాలా బాధపడుతూ కూర్చుంటారు. కార్తీక్ మనసు విరిగిపోయింది సౌందర్య. ఒక విధంగా వాడి మనసు ఇలా మారిపోవడాకి నేను కారణం ఏమో అని గిల్టీగా ఉంది. మధ్యలో మీరేం చేశారండీ.. అని సౌందర్య అంటుంది. దీంతో మోనిత ప్రెగ్నెంట్ అని తెలియగానే.. నేను చాలా దారుణంగా ప్రవర్తించాను. వాడితో మాట్లాడలేదు. ట్రీట్ మెంట్ కూడా సరిగ్గా చేయించుకోలేదు.. అని చెప్పగానే.. ఏం కాదు లేండి.. మీరు సరిగ్గానే చేశారు. కొడుకు తప్పు చేస్తే మందలించే అధికారం.. తల్లిదండ్రులకు చివరి క్షణం వరకు ఉంటుంది.. అని చెబుతుంది సౌందర్య.
దీపకు వాడంటే నమ్మకం. ఆ నమ్మకంతోనే వాడిని క్షమించింది. తను క్షమించడమే కాదు.. నన్ను కూడా క్షమించమంది. దేవుడి దయ వల్ల దీప అన్ని విషయాలను పాజిటివ్ గా తీసుకుంది. భాగ్యం కూడా మారిపోయింది. భాగ్యం మన కార్తీక్ గురించి అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా… అని సౌందర్యతో తన భర్త అంటాడు.
కట్ చేస్తే దీపతో ఏసీపీ మాట్లడుతుంది. ప్రియమణిని నేను ఎంక్వైరీ చేశాను.. అని ఏసీపీ అనగానే.. ప్రియమణి.. మోనితకు ఏమౌతుంది మేడమ్.. అంటే పనిమనిషి అంటుంది. కానీ.. నేను మాత్రం డాక్టర్ బాబు భార్యను.. అని చెబుతుండగానే నీ వాదనలు అన్నీ నువ్వు కోర్టులో వినిపించు.. ఇక్కడ కాదు.. అంటుంది ఏసీపీ. మీరంతా ఎందుకు ఇంత భ్రమలో ఉన్నారు.. అంటే ప్రియమణి గురించి తెలుసు. మోనిత సంగతి తెలుసు.. అంటుంది దీప.
నేను ప్రియమణి చెప్పింది రేడియో నాటకం విన్నట్టు విని రాలేదు.. ప్రియమణికి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. మీ పిన్ని కూడా అక్కడే ఉంది. తన భర్త తప్పు చేయలేదని ప్రతి భార్య అనుకోవచ్చు.. కానీ.. తప్పు చేసింది లేనిది రుజువు చేయడానికే మేము ఉన్నాం. నువ్వు మనుషల్లో మంచితనం చూడటానికి ప్రయత్నిస్తావు. మనుషులను నమ్ముతావు.. ప్రేమిస్తావు. కానీ.. అవతలి వాళ్లు నీలోని ఆ బలహీనతను అడ్డం పెట్టుకొని ఆడుకుంటారు. సరే.. అది గుర్తించడం.. గుర్తించకపోవడం అది నీ వ్యక్తిగత విషయం. ఇక్కడ అవేమీ ఉండవు. సాక్ష్యాలే అవసరం.
సరే.. నువ్వు ఒక పని చేయాలి. దీని వల్ల నీకు, మాకు లాభం. మీ ఆయన్ను మోనిత బాడీ ఎక్కడ దాచాడో చెప్పమను చాలు. ఏమైంది.. అనగానే.. మీరు చెప్పాల్సింది చెప్పారు.. నేను వినాల్సింది విన్నాను.. అని దీప అంటుంది. నేను పూర్తిగా చెప్పలేదు.. అంటే ఆయన చంపలేదు అంటే ఇక బాడీ గురించి ఏం చెబుతాడు.. అంటే నేను పూర్తిగా చెప్పేది విను.. అంటే సరే చెప్పండి అంటుంది దీప.
మీ ఆయన్ని మోనిత బాడీ ఎక్కడ దాచాడో చెప్పమను. నేను ఆయనకు పడే శిక్షను తగ్గించే ప్రయత్నం చేస్తాను. నువ్వు, మీ ఆయన, మీ పిల్లలు.. అందరూ హ్యాపీగా ఉండొచ్చు. నేను కార్తీక్ తో మాట్లాడాను. కానీ.. చాలా విచిత్రంగా మాట్లాడుతున్నాడు. నేను మీకు ఇంతకంటే ఎక్కువ ఏం చేయలేను.. అని ఏసీపీ చెబుతుండగానే.. దీప అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
Karthika Deepam 16 Aug Today Episode : నా వల్లనే కార్తీక్ ఇలా అయ్యాడంటూ బాధపడ్డ కార్తీక్ తండ్రి
తర్వాత.. కార్తీక్ వాళ్ల నాన్నకు ఆదిత్య.. చెకప్ చేయిస్తాడు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి అన్ని చెకప్స్ చేయించి తీసుకొస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చి.. తెగ ఏడుస్తుంటాడు కార్తీక్ నాన్న. ఆసుపత్రిలో డాక్టర్ వర్ధన్.. కార్తీక్ గురించి చాలా ఛీప్ గా మాట్లాడాడు. దీంతో అందరూ బాధపడతారు. నేనే.. నేనే.. డాక్టర్ బాబు అన్నదే నిజం. నేను చాలా తప్పు చేశాను అత్తయ్య.. అంటుంది దీప. నా మీద నింద వేసినప్పుడు ఎదురు తిరిగి.. డీఎన్ఏ టెస్ట్ చేయించుకోకుండా వెళ్లాను. అది నా తప్పే. పదేళ్ల క్రితమే ఆ పని చేసి ఉంటే నాకీ బాధ ఉండేది కాదు. నేను ఉంటే ఆయన తాగేవారేనా. నేను వెళ్లిపోయినందుకే కదా. ఆయన అలా అయ్యారంటే.. దానికి కారణం నేనే. సాటి డాక్టర్ల ముందు ఆయన చులకన అయింది నా వల్లనే కదా. ఆయన తప్పేమీ లేదు.. అనగానే.. వాడి తప్పేమీ లేనప్పుడు నువ్వెందుకు ఇల్లు వదిలి పోయావ్.. అని అడుగుతుంది సౌందర్య.
వాడి ప్రేమను అనుమానం మింగేసింది. వాడి అహంకారం వివేకాన్ని చంపేసింది. ఇందులో నీ తప్పు ఏముందే.. వెర్రిబాగుల దానా? నువ్వెందుకే నిన్ను నువ్వు ఒక అపరాధిలా మార్చుకుంటావు.. అంటుంది సౌందర్య. లేదు అత్తయ్య. ఆయన నన్ను నిజంగా ధ్వేషించి ఉంటే.. ఆయన మోనితను పెళ్లి చేసుకొని ఉండేవారు కదా. సమాజానికి మోనిత నిజ స్వరూపం తెలియదు కదా.. అంటూ సౌందర్య, దీప.. ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు.
నా భర్త హత్య చేశాడని అందరూ అంటున్నారు. చివరకు నువ్వు అంటున్నావు. పోలీసులు అంటున్నారు.. మీకు, పోలీసులకు, ఈ సమాజానికి నేను జవాబుదారిగా నిలబడతాను. నా భర్తను రక్షించుకుంటాను. నా భర్తను నేనే కాపాడుకుంటాను.. అని దీప అంటుంది. నువ్వు మాత్రం ఏం చేయగలవు అమ్మా.. న్యాయమూర్తివా? న్యాయ దేవతవా? అని అంటాడు కార్తీక్ తండ్రి. దీంతో నేను సతి సావిత్రిని. నా భర్తను నేను ఎలాగైనా కాపాడుకుంటాను. ముందు మీరు మామయ్య గారి ఆరోగ్యాన్ని కాస్త పట్టించుకోండి.. అని సౌందర్యకు చెబుతుంది దీప.
కట్ చేస్తే.. పోలీస్ స్టేషన్ లో సెల్ లో పడుకొని ఆలోచిస్తుంటాడు కార్తీక్. ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి.. డాక్టర్ సార్..అని అడుగుతుంది. దీంతో మా ఆయనకి ఈ మధ్య గుండె దడ వస్తుంది సార్. మీరు గుండెను చూసే డాక్టరే కదా. ఆయనకు ఏవైనా ట్యాబ్లెట్లు రాయండి సార్.. అని అడుగుతుంది కానిస్టేబుల్. దీంతో ట్యాబ్లెట్లు రాసి ఇస్తాడు. తర్వాత బాక్స్ ఇస్తుంది. చపాతీ సార్.. తీసుకోండి. తినండి. పాలు కూడా తెచ్చాను. ప్లాస్క్ లో ఉన్నాయి. తాగండి.. అని చెబుతుంది. దీంతో అసలు నేను నీకు ఏమౌతానని ఇవన్నీ చేస్తున్నావు. నువ్వు ఎవరు అసలు.. అని అడుగుతాడు కార్తీక్. దీంతో కానిస్టేబుల్ ను సార్.. అంటుంది ఆ మహిళ. ఎందుకు నన్ను చూసి ఇంతగా జాలిపడుతున్నావు.. అంటే కాదు సార్.. మీరంటే నాకు గౌరవం. మీరు చాలా మంచివారని విన్నాను. మీ హస్తవాసి మంచిదంటారు కానీ.. ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు సార్. మీరు ఈ నేరం చేసి ఉండరని నాకు అనిపిస్తోంది సార్.. అనగానే నేను నేరాలు చేయలేదు… పాపాలు చేశాను.. అందుకే నాకు శిక్ష వేశాడు దేవుడు.. అని తనలో తానే అనుకుంటాడు కార్తీక్.
కట్ చేస్తే… అంజిని దీప కలుస్తుంది. మోనితకు నేను శత్రువును. కానీ.. నేను కాకుండా.. ఇంకెవరైనా మోనితకు శత్రవులు ఉండొచ్చు కదా. వాళ్లు మోనితను చంపి.. డాక్టర్ బాబు మీద ఈ నేరం మోపి ఉండొచ్చు కదా.. అని అంటాడు అంజి. శత్రువు ఉన్నారు.. అని అంటుంది దీప. కట్ చేస్తే.. డాక్టర్ బాబుకు చపాతీలు ఇచ్చిన రత్నసీత అనే కానిస్టేబుల్… సిటీకి దూరంగా ఉన్న ఓ ఇంటికి వెళ్తుంది. అక్కడ గదిలో ఉన్న మోనిత దగ్గరికి వెళ్తుంది. అంటే మోనిత చనిపోలేదా? ఇదంతా ఏంటి మరి? అసలు.. మోనిత చనిపోకపోతే.. డాక్టర్ బాబును ఎందుకు అరెస్ట్ చేశారు. ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం మంగళవారం ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే.
ఇది కూడా చదవండి ==> మోనిత శవాన్ని కార్తీక్ ఎక్కడ దాచాడో.. దీపకు చెబుతాడా? దీప ఆ విషయాన్ని ఏసీపీకి చెబుతుందా?
ఇది కూడా చదవండి ==> ప్రియమణి మీద డౌట్ వచ్చి.. స్టేషన్ కు తీసుకెళ్లిన ఏసీపీ రోషిణి.. మోనిత మర్డర్ కు, ప్రియమణికి ఏమైనా సంబంధం ఉందా?
ఇది కూడా చదవండి ==> జానకి పెద్ద చదువులు చదివిన విషయం జ్ఞానాంబకు తెలిసిపోయిందా? అందుకే.. జానకిని వెతుక్కుంటూ కాలేజీకి వచ్చిందా?
ఇది కూడా చదవండి ==> శ్రీముఖి శేఖర్ మాస్టర్‌కి ఎందుకు ముద్దు పెట్టిందో ఓపెన్‌గా చెప్పేసింది