Karthika Deepam 17 Jan Tomorrow Episode : తల్లిదండ్రులను ఆ పరిస్థితిలో చూసి కార్తీక్ షాక్.. మోనితకు దగ్గరైన బస్తీవాసులు.. సౌందర్య, ఆనందరావు కోసం కార్తీక్ షాకింగ్ నిర్ణయం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 17 Jan Tomorrow Episode : తల్లిదండ్రులను ఆ పరిస్థితిలో చూసి కార్తీక్ షాక్.. మోనితకు దగ్గరైన బస్తీవాసులు.. సౌందర్య, ఆనందరావు కోసం కార్తీక్ షాకింగ్ నిర్ణయం

 Authored By gatla | The Telugu News | Updated on :16 January 2022,1:30 pm

Karthika Deepam 17 Jan Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 17 జనవరి 2022, 1250 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ పిల్లలను టిఫిన్ పెడతాడు. వాళ్లు సరిగ్గా తినకపోయే సరికి.. సరిగ్గా తినాలంటూవాళ్లకు చెబుతాడు. ఎందుకు అంటే.. మీరు సరిగ్గా తినకపోతే మీరు బాధపడితే నేను అమ్మ బాధపడతాం అంటాడు కార్తీక్. మరి.. నువ్వు ఇంట్లో లేవు కదా. నువ్వు నానమ్మ వాళ్లకు దూరంగా ఉన్నావు కదా. నువ్వు లేవని కూడా నానమ్మ వాళ్లు బాధపడుతూ ఉంటారు కదా అంటారు పిల్లలు. దీంతో కార్తీక్ కు ఏం మాట్లాడాలో అర్థం కాదు.

karthika deepam 17 january 2022 episode highlights

karthika deepam 17 january 2022 episode highlights

మరోవైపు లక్ష్మణ్, అరుణ ఇద్దరూ మోనిత దగ్గరికి వెళ్లి తన కాళ్లకు నమస్కారం పెడతారు. ఏం చేస్తున్నారు మీరు లేవండి అంటుంది మోనిత. మీరు నా ప్రాణాలు కాపాడారు. మళ్లీ జన్మను ఇచ్చారు అంటుంది అరుణ. మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం అయినా కూడా మీరు నా భార్యను కాపాడారు. మీకు ఎంత చేసినా తక్కువే అంటాడు లక్ష్మణ్. దీపమ్మ మీద అభిమానంతో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాం అంటాడు లక్ష్మణ్. ఎన్ని జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేము అంటాడు లక్ష్మణ్. అన్ని మాటలు వద్దు. ఈ బస్తీలో హాస్పిటల్ పెట్టిందే మీకోసం అని అంటుంది మోనిత. ఈ బస్తీలో మిమ్మల్ని ఏదైనా అంటే మాకు చెప్పండి అంటాడు లక్ష్మణ్. మొత్తానికి తన ప్లాన్ సక్సెస్ అయినందుకు ఖుషీ అవుతుంది మోనిత.

దీపక్క.. నీ ఫ్యాన్స్ నా ఫ్యాన్స్ అయిపోతున్నారు అంటూ చాలా సంతోషంగా ఉంటుంది మోనిత. మరోవైపు రుద్రాణి.. దీప గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో తన మనిషి కాఫీ తీసుకొస్తాడు. ఎక్కడ చేశావురా ఈ కాఫీ అని అడుగుతుంది రుద్రాణి.

దీంతో మనింట్లోనే అక్క అంటాడు కార్తీక్. ఆ కిచెన్ లో వండొద్దు అని చెప్పాను కదా. మళ్లీ ఎందుకు అందులో వండుతున్నారు. దాన్ని మూసేయమని చెప్పాను కదా. ఇంకోసారి అందులో వండితే అస్సలు బాగుండదు.. అంటూ చెబుతుంది రుద్రాణి.

పిల్లలను దత్తత తీసుకునే వరకు.. ఆ వంటగదిని ఓపెన్ చేసేదే లేదు అని అంటుంది రుద్రాణి. హిమను చూస్తే నా తల్లిని చూసినట్టే ఉంటుంది. ఆ రంగరాజు వీపు మీద పుట్టుమచ్చ ఉంది. అలా పుట్టుమచ్చ ఉంటే.. రాజయోగం పడుతుందట. అందుకే.. వాళ్లిద్దరూ నాకు బాగా నచ్చారు.. అంటుంది రుద్రాణి.

Karthika Deepam 17 Jan Tomorrow Episode : తన తల్లిదండ్రులను మోసం చేస్తున్నానని బాధపడ్డ కార్తీక్

మరోవైపు కార్తీక్.. తన తల్లిదండ్రుల గురించే ఆలోచిస్తుంటాడు. తన తల్లిదండ్రులను కూడా చివరకు నేను మోసం చేశా అని దీప ముందు బావురుమంటాడు. జరిగిపోయిన దాని గురించి ఎందుకండి బాధపడతారు అని అడుగుతుంది దీప. జరిగిపోయిన దాన్ని వదిలేయలేం కదా దీప.. అంటాడు కార్తీక్.

ఆ తర్వాత ఉదయమే కార్తీక్ హోటల్ లో పనిచేస్తుంటాడు. అప్పారావు మోనితతో దిగిన ఫోటోను చూస్తూ ఖుషీ అవుతుంటాడు. బావా ఈ ఫోటో చూడు. ఎలా ఉంది. మీ జోడి బాగుంటుంది అంటూ ఏదేదో మాట్లాడుతుంటాడు. ఈ అమ్మాయి బాగుంది కదా అంటాడు. దీంతో కార్తీక్ కు ఆ ఫోటోను చూసి మోనితతో తిరిగిన రోజులన్నీ గుర్తొస్తాయి.

మరోవైపు పార్శిల్ ఇచ్చి రా అని కార్తీక్ కు సైకిల్ ఇచ్చి పంపిస్తాడు హోటల్ యజమాని. దీంతో ప్రకృతి వైద్యశాలకు వస్తాడు కార్తీక్. ఆ పార్శిల్ ఎవరికో అనుకుంటాడు కానీ.. అది అందులో ఉన్న తన తల్లిదండ్రులకే అని తెలియదు. వెళ్లి వాళ్ల రూమ్ లో పార్శిల్ పెడతాడు.

అప్పుడే ఆనంద రావు, సౌందర్యను చూస్తాడు. షాక్ అవుతాడు. భోజనం చేసి పడుకోండి అంటుంది సౌందర్య. తలుపు చాటన ఉండి వాళ్ల మాటలన్నీ వింటాడు కార్తీక్. భోజనం చేస్తుంటే నాకు పెద్దోడే గుర్తొస్తున్నాడు అంటాడు ఆనంద రావు. కార్తీక్ ను మళ్లీ చూస్తానో లేదో అంటాడు ఆనంద రావు.

ఏదైనా జరగరానిది జరిగి నాకేదైనా అయితే కనీసం చివరి కర్మలకైనా వస్తాడో రాడో అని బాధపడతాడు ఆనందరావు. దీంతో కార్తీక్ అక్కడే ఉండి విని షాక్ అవుతాడు. కన్నీటి పర్యంతం అవుతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement
WhatsApp Group Join Now

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది