
karthika deepam 19 november 2021 full episode
Karthika Deepam 19 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్, 2021 ఎపిసోడ్ 1201 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నానమ్మా పండుగ అన్న మాటే కానీ.. నాకైతే అస్సలు దీపావళి అనిపించడం లేదు అంటుంది రౌడీ. అవును.. నాకు కూడా అలాగే ఉంది అంటుంది సౌందర్య. ఈరోజు అమ్మ బర్త్ డే కదా అంటుంది రౌడీ. దీంతో అప్పుడే దీప అక్కడికి వస్తుంది. ఈరోజు నీ బర్త్ డే నా.. మరిచిపోయా అంటుంది సౌందర్య. సరే.. అందరం గోల్కొండకు వెళ్దామా.. పిల్లలు అడుగుతున్నారు అంటుంది సౌందర్య.
karthika deepam 19 november 2021 full episode
గోల్కొండ సమాధుల దగ్గరికి వెళ్దామా.. అంటుంది దీప. అక్కడికి వెళ్లడం ఏంటి అంటుంది సౌందర్య. ఎప్పటికైనా అందరం అక్కడికి వెళ్లాల్సిన వాళ్లమే కదా అంటుంది దీప. మొత్తానికి పిల్లలకు ఇంట్లోనే అన్ని చేసి పెడతాను అని చెబుతుంది దీప. దీప మాటలు విని సౌందర్య షాక్ అవుతుంది. అసలు.. తను ఏం మాట్లాడుతుందో తనకు అర్థం కాదు. దీంతో అక్కడి నుంచి వచ్చేసి తన రూమ్ కు వెళ్లి వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది. ఇంతలో తన రూమ్ కు ఆనంద రావు వస్తాడు. సౌందర్య ఏడవకు.. దీప చనిపోయేంత పిరికిది కాదు.. అంటాడు.
చనిపోవాలంటే చాలా ధైర్యం ఉండాలండి. పిరికివాళ్లు చనిపోరు. దీప ఏం చేసుకుంటుందో అని భయం వేస్తోంది అంటుంది సౌందర్య. రేపు దీప పుట్టిన రోజు.. అని చెబుతుంది. సరిదిద్దుకోలేని తప్పు జరిగింది సౌందర్య. ఆ తప్పును నువ్వు, నేను సరిచేయలేం. అయితే ఆ భగవంతుడు… లేకపోతే దీప.. ఈ ఇద్దరే దీన్ని పరిష్కరించగలరు.. అని అంటాడు ఆనంద రావు.
కట్ చేస్తే.. కార్తీక్ ఇంటికి తిరిగి వస్తాడు. ఇంతలో దీప అందంగా ముస్తాబు అవుతుంది. వెళ్లిన పని అయిందా అని అడుగుతుంది. దీప ఏంటి ఇంత కూల్ గా మాట్లాడుతుంది అని అనుకుంటాడు కార్తీక్. నీకో విషయం చెప్పాలి దీప అంటాడు కార్తీక్. తన చేతులు పట్టుకొని నేను ఏ తప్పు చేయలేదు అంటాడు.
ఆ మోనితే అది సహజ గర్భం అంటుంది. మోనిత మాటలు నమ్మొద్దు. నేను నిజమే చెబుతున్నాను. నా వల్ల ఎలాంటి తప్పు జరగలేదు. దీప.. ప్లీజ్ అలా చూడొద్దు. దీప.. నేనే కారణం అంటుంది. నువ్వు మాత్రం నమ్మొద్దు దీప. నువ్వు ఒక్కదానివి నమ్మితే చాలు అంటాడు కార్తీక్.. అయితే.. ఇదంతా కార్తీక్ దీపకు చెప్పడు. చెప్పినట్టు ఊహించుకుంటాడు.
ఇంతలో అందరూ వస్తారు. దీపావళి సంబురాలు జరుపుకుంటారు. కానీ.. ఎవరి ముఖంలో సంతోషం ఉండదు. ఈ దీపావళికి ఏదో తగ్గినట్టు అనిపిస్తోంది కదా. అదేంటో నాకు తెలుసు. నేను ఇఫ్పుడే వస్తాను. ఎవరూ రావొద్దు అంటుంది దీప. దీప ఇంట్లోకి వెళ్లడంతో అందరూ టెన్షన్ పడతారు.
ఇంతలో దీప స్వీట్స్ తీసుకొని వస్తుంది. తినండి.. డాక్టర్ బాబుకు తినిపిస్తుంది. మళ్లీ ఈ దీపకు దీపావళి ఎప్పుడు వస్తుందో ఏంటో అని అంటుంది. అందరికీ స్వీట్లు తినిపిస్తుంది. మొత్తానికి టపాసులు పేల్చి అందరూ దీపావళి సంబురాలు చేసుకుంటారు.
ఇంతలో మోనిత.. సౌందర్యకు ఫోన్ చేస్తుంది. ఆంటి నేను మోనితను అంటుంది. తర్వాత వాళ్ల ఇంటికి వెళ్లి మీరంతా మా ఇంటికి రావాలి. మా అబ్బాయి బారసాల చేస్తున్నా అంటుంది. నోర్మూయ్.. ఎక్కువ మాట్లాడకుండా బయటికి వెళ్లు అంటాడు కార్తీక్. మోనిత నువ్వు బారసాల ఏర్పాట్లు చేసుకో. వీళ్లందరినీ తీసుకొచ్చే బాధ్యత నాది అంటుంది. చెప్పాకదా.. నీ కథకు క్లయిమాక్స్ ఇస్తా.. అని అది రేపే అని చెప్పి మోనితకు వార్నింగ్ ఇస్తుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.