Karthika Deepam 2 June Today Episode : హిమ కోసం సెల్ఫీ వీడియో తీసిన ప్రేమ్.. ఆ వీడియో చూసి హిమ షాక్.. ఈ విషయం సౌందర్యకు తెలుస్తుందా?

Karthika Deepam 2 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 జూన్, 2022 గురువారం ఎపిసోడ్ 1368 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నువ్వు ఏకంగా ఇంకో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఏదో జరిగింది. ఎందుకో భయపడుతున్నావు. చెప్పు హిమ చెప్పు. నన్ను ప్రేమించింది నిజామా కాదా అని ప్రశ్నిస్తాడు నిరుపమ్. మనం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదదు. నువ్వు ప్రేమించింది నిజమా కాదా.. నాకు సమాధానం కావాలి అంటాడు నిరుపమ్. దీంతో నా పెళ్లి ఎందుకు చెడగొట్టావు అని అడుగుతుంది హిమ. నా సంబంధం ఎందుకు చెడగొట్టావు అంటుంది. నేను చూసే అమ్మాయిని పెళ్లి చేసుకో అంటుంది. అంటే ఏంటి.. ఆ శోభను పెళ్లి చేసుకోమంటావా అంటాడు నిరుపమ్.

karthika deepam 2 june 2022 full episode

దీంతో ఛీ.. ఛీ.. తననెందుకు చేసుకో అంటాడు అంటుంది హిమ. అదే సమయంలో అక్కడికి వచ్చిన శోభ.. హిమ మాటలను వింటుంది. నిరుపమ్ అక్కడి నుంచి వెళ్లిపోయాక.. తన దగ్గరికి వెళ్లి చాలెంజ్ చేస్తుంది శోభ. నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు. నిరుపమ్ ను ఎలాగైనా పెళ్లి చేసుకొని తీరుతా అంటుంది శోభ. దీంతో హిమకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. వీళ్లిద్దరినీ ఒక కంట కనిపెట్టాలి అని అనుకుంటుంది. ఇంతలో జ్వాల.. నిరుపమ్ ను కలుస్తుంది. పదా జ్వాల బయటికి వెళ్దాం అంటాడు. ఇంతలో శోభ వచ్చి నిరుపమ్ ఎక్కడికి వెళ్తున్నావు.. పదా మనం కారులో వెళ్దాం అంటుంది. దీంతో శోభ.. నీకు మతిమరుపు వచ్చినట్టుంది. నువ్వు చెప్పింది నువ్వే మరిచిపోయావా అని చెప్పి జ్వాలను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు నిరుపమ్.

ఇంతలో మేడమ్ నా కన్నుకు దెబ్బతగిలింది అని ఓ అమ్మాయి ఆసుపత్రికి వస్తుంది. దీంతో నీ కన్ను నువ్వే పొడుచుకున్నావు కదా.. ఈ మధ్య చాలామంది వాళ్ల కళ్లు వాళ్లే పొడుచుకుంటున్నారు.. అంటూ శోభను ఉద్దేశిస్తూ మాట్లాడుతుంది హిమ.

మరోవైపు ప్రేమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. హిమతో ఎలా మాట్లాడాలో తెలియదు. నేను ప్రేమించిన నా మరదలుకు నా ప్రేమ విషయం చెప్పలేకపోతున్నాను. ఎప్పుడూ ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది. ఇప్పుడైనా హిమకు నా ప్రేమ చెప్పేయాలి అని అనుకుంటాడు ప్రేమ్.

Karthika Deepam 2 June Today Episode : హిమకు ప్రేమలేఖ రాసిన ప్రేమ్

హిమకు నా ప్రేమ విషయం చెబుదామన్న ప్రతి సారీ ఆ తిక్కది జ్వాల అడ్డు వస్తోంది. ఇంతలోనే అమ్మమ్మ తన నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. నచ్చో నచ్చకో హిమ ఎంగేజ్ మెంట్ వద్దన్నది. అవును.. ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు ఆలోచిస్తున్నాను.

ఎంగేజ్ మెంట్ వరకు రాకపోతేనే బాగుండేది. వచ్చినా హిమ వద్దని వెళ్లిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి. ఇలా నాలుగు గోడల మధ్య కూర్చొని హిమ గురించి ఆలోచిస్తూ హిమకు నా మనసులో మాటను చెప్పలేక సతమతమవుతున్నాను అని అనుకుంటాడు ప్రేమ్.

ఇలా అయితే.. నా ప్రేమ తనకు ఎలా తెలుస్తుంది. చెప్పాలి.. హిమకు నా ప్రేమ.. నా మనసులోని మాట చెప్పేయాలి అని అనుకుంటాడు ప్రేమ్. ఎస్.. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ప్రేమకు ఉన్న గొప్పదనం అదే కావచ్చు. ఎదురు పడకముందు ఎన్నో అనుకుంటాం.. ఎదురుపడగానే మన గుండె చప్పుడు మనకే వినపడుతుంది. అందుకే పాత పద్ధతిలో ప్రేమలేఖ రాస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాడు ప్రేమ్.

మరోవైపు నిరుపమ్ ను కనిపెట్టేందుకు శాంతాబాయిని పెడుతుంది. నిరుపమ్ ను అక్కడ చూసి శోభకు ఫోన్ చేసి చెబుతుంది శాంతాబాయి. మరోవైపు నిరుపమ్ అనాథ ఆశ్రమానికి వెళ్లి అక్కడ హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు డాక్టర్ సాబ్ ఎక్కడికి వెళ్లాడు అని అనుకుంటుంది జ్వాల.

తనకు ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నారు అని అడుగుతుంది. దీంతో అనాథ ఆశ్రమంలో అంటాడు. నీకు ఏదైనా పని ఉంటే వద్దులే కానీ.. ఫ్రీగా ఉంటే రా అంటాడు నిరుపమ్. నువ్వు రమ్మంటే నేను రాకుండా ఎలా ఉంటాను డాక్టర్ సాబ్. నీకన్నా ముఖ్యమైన పని నాకు ఏదీ లేదు అని అనుకుంటుంది జ్వాల.

మరోవైపు హిమకు ప్రేమలేఖ రాసేందుకు తెగ ఇబ్బంది పడతాడు ప్రేమ్. దీంతో సెల్ఫీ వీడియో తీసి దాన్ని హిమకు పంపించాలని అనుకుంటాడు. సెల్ఫీ స్టిక్ తో వీడియో తీసి.. తనకు రాత్రి పంపించాలని అనుకుంటాడు. మరోవైపు అనాథ ఆశ్రమానికి వస్తుంది జ్వాల.

మరోవైపు నిరుపమ్, జ్వాల మాట్లాడుకోవడం చూస్తుంది శాంతాబాయి. జ్వాలమ్మ.. టీ పంపించమంటారా అంటుంది శాంతాబాయి. దీంతో పంపించు కానీ.. రెండు వద్దు వన్ బై టు అంటుంది. ఇంతలో నిరుపమ్ కు స్వప్న ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అని అడుగుతుంది.

దీంతో అనాథ ఆశ్రమం దగ్గర ఉన్నాను అంటాడు. నీ వెనుక ఎవరు ఉన్నారు చెప్పు. ఆ ఆటోది ఉంది కదా అంటుంది స్వప్న. నిరుపమ్ ఇది నీ జీవితం. నువ్వే నష్టపోతావు. అయినా ఆ ఆటో దానితో నీకు తిరుగుడు ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటుంది స్వప్న.

దీంతో నాకు నచ్చింది నేను చేస్తా. నాకు ఇష్టమైనది నేను చేస్తా. ఆటో వాళ్లు నచ్చితే ఆటో వాళ్లతోనే ఫ్రెండ్ షిప్ చేస్తాను అంటాడు నిరుపమ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

38 minutes ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

2 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

3 hours ago

Papaya | రాత్రిపూట బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసా?

Papaya | బొప్పాయి.. ప్రతి ఇంట్లో దొరికే సాధారణమైన పండు. కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు అసాధారణం. ముఖ్యంగా రాత్రిపూట…

4 hours ago

Cumin nutrition | జీలకర్ర ఎక్కువగా తింటున్నారా.. ఆరోగ్య ప్రయోజనాల వెంట కొన్ని ప్రమాదాలు కూడా

Cumin nutrition | జీలకర్ర – ప్రతి ఇంట్లో వాడే సాధారణ మసాలా దినుసు. ఇది వంటలకు సువాసన ఇవ్వడమే…

5 hours ago

Tulasi Kashayam | తులసి కషాయం ఆరోగ్యానికి అమృతం లాంటిది .. వర్షాకాలంలో రోగనిరోధకత పెంచే పానీయం

Tulasi Kashayam | భారతదేశంలో తులసి మొక్కను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో తెలుసుకోవాలంటే ఆయుర్వేదాన్ని ఓసారి…

6 hours ago

Zodiac Signs | పండగ సమయంలో మూడు రాశులపై కేతువు అనుగ్రహం ..ఆర్థిక లాభాలు, అదృష్టం కురిసే చాన్స్

Zodiac Signs | జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతి వ్యక్తి జీవితంపై గ్రహాల ప్రభావం కీలకంగా ఉంటుంది. అనుకూల గ్రహాలు శుభఫలితాలు…

7 hours ago

Vivo | వివో నుంచి కొత్త బ్లాక్‌బస్టర్ ..Vivo T4R 5G స్మార్ట్‌ఫోన్ ₹17,499కే!

Vivo | స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ నడుస్తున్న ఈ రోజుల్లో ప్రముఖ మొబైల్ బ్రాండ్ వివో (Vivo) తన…

16 hours ago