Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక్ కు మోనిత కొడుకు వల్ల ప్రాణగండం వచ్చిందని తెలుసుకొని దీప షాకింగ్ నిర్ణయం? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక్ కు మోనిత కొడుకు వల్ల ప్రాణగండం వచ్చిందని తెలుసుకొని దీప షాకింగ్ నిర్ణయం?

 Authored By gatla | The Telugu News | Updated on :2 November 2021,9:25 am

Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 2 నవంబర్ 2021, మంగళవారం ఎపిసోడ్ 1186 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మోనితకు పుట్టిన బాబు పేగులు మెడకు వేసుకొని పుట్టాడని డాక్టర్ చెప్పిందని.. అది కార్తీక్ కు గండం అని ప్రియమణి చెప్పడంతో.. సౌందర్య వెంటనే ఓ పంతులు దగ్గరికి వెళ్తుంది. కానీ.. భయం భయంగా.. టెన్షన్ తో అక్కడికి వెళ్తుంది. కార్తీక్ కు గండం అంటే అది దీపకు కూడా బాధే.. అని అనుకొని పంతులు దగ్గరికి వెళ్తుంది.పేగు మెడకు చుట్టుకొని పుడితే ఖచ్చితంగా తండ్రికి ప్రాణగండం ఉంటుంది. శాంతి పూజ శాస్త్రం ప్రకారం చేయించాలి అని అంటాడు పంతులు. మీ మనసు ఏది చెబితే అది ఆచరించండి. దాన్నే పాటించాలి అంటాడు. దీంతో ఏం చేయాలో సౌందర్యకు అర్థం కాదు. ఉదయాన్నే ఈ సామాన్లు తీసుకొని గుడికి రండి అని చెబుతాడు పంతులు.

దోష నివారణ, శాంతి పూజ జరిపిస్తాను అంటారు. కానీ.. శాంతి పూజ కోసం ఖచ్చితంగా బిడ్డ తల్లిదండ్రులు రావాల్సిందే. తల్లి, తండ్రి, శిశువు ఉండాల్సిందే అంటాడు పంతులు. దీంతో సౌందర్య షాక్ అవుతుంది.మరోవైపు దీప ఒక్కతే రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. ఎవరు తప్పు చేశారు? మోనిత చేసిందా? లేక డాక్టర్ బాబు చేశాడా? అని అనుకుంటుంది దీప. మరోవైపు సౌందర్య కారులో వెళ్తూ.. ఆలోచిస్తుంటుంది. మోనితను ఏమని పిలవాలి అని అనుకుంటుంది. అసలు.. దీప ఎక్కడికి వెళ్లింది అని అనుకున్న లోపే సౌందర్యకు దీప కనిపిస్తుంది. వెంటనే కారు ఆపి.. దీప ఎక్కడికి వెళ్లావు. ఇంట్లో అందరం ఎంత కంగారు పడుతున్నామో తెలుసా? అని అంటుంది. ఎందుకు కంగారు అత్తయ్య అంటుంది. నువ్వు ఎవరికీ చెప్పకుండా ఫోన్ కూడా తీసుకోకుండా వెళ్లావు.. ఏమైంది అంటుంది.

Karthika Deepam 2 Nov Today Episode : కార్తీక్ కు ఫోన్ చేసిన మోనిత.. కట్ చేసిన కార్తీక్

మోనిత కార్తీక్ కు ఫోన్ చేస్తుంది. కాల్ కట్ చేస్తాడు కార్తీక్. ఫోన్ చేస్తే కట్ చేస్తున్నాడు అంటూ మోనిత.. భారతికి చెబుతుంది. మీ ఇంటిని రెంట్ కు ఇస్తున్నావట. మరి నువ్వు ఎక్కడ ఉంటావు అని అడుగుతుంది భారతి. అవును.. నీ ఇంటికి ఏం రానులే అంటుంది మోనిత.మరోవైపు కార్తీక్.. సౌందర్యకు ఫోన్ చేస్తాడు. ఫోన్ తీస్తే పంతులు రాసిచ్చిన చిట్టిని దీప చూస్తుందని టెన్షన్ పడుతుంది సౌందర్య. మళ్లీ మోగుతుంది ఫోన్. దీంతో వద్దులే ఫోన్ తీయకు.. అంటుంది సౌందర్య. కానీ.. దీప ఫోన్ తీస్తుంది.

అందులోనే పంతులు రాసిచ్చిన చిట్టి ఉంటుంది కానీ.. ఆ చిట్టిని దీప చూడదు. కేవలం ఫోన్ ను మాత్రమే ఇస్తుంది. కానీ.. పక్కనే దీప ఉండటంతో ఏం మాట్లాడలేకపోతుంది సౌందర్య. నన్ను కారు దిగమంటావా? అత్తయ్య అని దీప అనడంతో దీప వాయిస్ విని.. దీప ఉందా నీతో అంటాడు కార్తీక్.వెంటనే కారు దిగి.. అంత అర్జెంట్ ఏంటి.. ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అంటుంది సౌందర్య. ఇంతలో కారులో ఉన్న పంతులు రాసిచ్చిన చిట్టిని చూస్తుంది దీప. కార్తీక్ పేరుతో ఇది ఏంటి. అసలు నాకు తెలియకుండా అత్తయ్య, డాక్టర్ బాబు కలిసి ఏం చేస్తున్నారు అని టెన్షన్ పడుతుంది దీప. దాన్ని వెంటనే లోపల పెడుతుంది దీప. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.

gatla

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి