Rajinikanth : రజనీకాంత్‌కు వైద్యులు చేసిన హార్ట్ సర్జరీ వివరాలివే..!
Rajinikanth : తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు చేతుల మీదుగా సినిమా రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాగా , ఆ అవార్డు అందుకున్న కొద్ది రోజులకే రజనీ అనారోగ్యం పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన్ను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు.అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన 70 ఏళ్ల రజనీకాంత్‌ను వైద్యుల పరిశీలించి..అనంతరం గుండెకు శస్త్ర చికిత్స చేశారు. రజనీకాంత్‌కు చేసిన సర్జరీ గురించి కావేరి ఆస్పత్రి వైద్యుల బృందం డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చింది. బుల్లెటిన్‌లో సర్జరీ వివరాలు వెల్లడించింది.
ఈ సర్జరీ పేరు కరోటిడ్ ఆర్టరీ రీవస్కులరైజేషన్ కాగా, ఇందులో భాగంగా మెదడుకు రక్త సరఫరా పునరుద్ధరించడానికిగాను వైద్యులు ఈ సర్జరీ చేశారు. గుండె ధమనుల్లో ఏర్పడే అడ్డంకులు తొలగించి, బ్లడ్ సప్లైను మెరుగుపరచడమే ఈ సర్జరీ లక్ష్యమని వైద్యులు తెలిపారు. ఈ సర్జరీ చేయడానికి టైం దాదాపు 45 నిమిషాల నుంచి గంట పడుతుంది. కాగా, ఇందుకుగాను పేషెంట్‌కు మత్తు మందు ఇచ్చి, ఆ తర్వాత కొద్దిసేపు పరిశీలనలో ఉంచుతారు. ఆ తర్వాతనే సర్జరీ చేస్తారు. సర్జరీ అనంతరం పేషెంట్‌ను మూడు రోజుల పాటు పరిశీలనలో ఉంచిన తర్వాత డిస్‌చార్జ్ చేస్తారు. రజనీకాంత్ ఇప్పటికే తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా రాజకీయాల్లోకి రాలేనని స్పష్టం చేసిన సంగతి అందరికీ విదితమే. ఇకపోతే రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. రజనీ ప్రస్తుతం యాక్షన్ డైరెక్టర్ శివ డైరెక్షన్‌లో ‘అన్నాత్తె’ ఫిల్మ్‌లో నటిస్తున్నారు.
Rajinikanth : హార్ట్ సర్జరీ సక్సెస్ ఫుల్..
ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 4న విడుదల కానుంది. కుటుం కథా చిత్రంగా వస్తున్న ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు చెల్లెలిగా ‘మహానటి’ కీర్తి సురేశ్ నటించింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతార, ఖుష్బూ సుందర్, మీనా నటించారు. ఈ చిత్రం తెలుగులో ‘పెద్దన్న’గా విడుదల కానుంది.