Karthika Deepam 22 Jan Today Episode : దీప హోటల్ లో పనిచేస్తోందని సౌందర్య, ఆనందరావుకు తెలుస్తుందా? ఆనంద్ ను విడిపించడం కోసం వడ్డీ డబ్బుల కోసం దీప ఏం చేస్తుంది?

Karthika Deepam 22 Jan Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 జనవరి 2022, శనివారం ఎపిసోడ్ 1256 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సౌందర్య, ఆనందరావు ఇద్దరూ కార్తీక్ పనిచేసే హోటల్ కు వెళ్తారు. అప్పారావు వెళ్లి ఏం కావాలి మేడమ్ అని అడుగుతాడు. దీంతో వాళ్లు కాఫీ కావాలంటారు. దీంతో కార్తీక్ కిచెన్ లో ఉండి కాఫీ తయారు చేస్తూ ఉంటాడు. ఇంతలో మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా మేడమ్ అంటాడు అప్పారావు. దీంతో అవును అంటారు. మీలాగే ఒక మేడమ్ వచ్చింది. తను కూడా మీలాగే చాలా ఫాస్ట్ గా ఉంది. తను డాక్టర్ అంట. తనలాగే తన భర్త కూడా డాక్టరేనట.. అని చెబుతాడు. దీంతో మోనిత ఇక్కడికి వచ్చిందా అని టెన్షన్ పడతారు సౌందర్య, ఆనంద రావు. ఇంతలో కాఫీ తీసుకురా అని చెబుతాడు అప్పారావు. కార్తీక్.. తన అమ్మానాన్నను చూసి షాక్ అవుతాడు.

karthika deepam 22 january 2022 full episode

వాళ్లకు కనిపించకుండా లోపలికి వెళ్తాడు. ఏంటి బావా నువ్వు కాఫీ చెప్పి ఎంతసేపు అయింది అని చెప్పి కార్తీక్ దగ్గర ఉన్న కాఫీ తీసుకొచ్చి సౌందర్య, ఆనందరావుకు ఇస్తాడు అప్పారావు. కాఫీ చాలా బాగుందిరా అబ్బాయి అంటుంది సౌందర్య. ఇదిగో మేడమ్.. నేను చెప్పిన డాక్టరమ్మ ఈవిడే.. సెల్ఫీ కూడా తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి అంటాడు అప్పారావు. దీంతో ఆ ఫోటోను చూసి మోనితే ఇక్కడికి వచ్చిందని కన్ఫమ్ అవుతారు. ఈవిడ మీకు తెలుసా అని అడుగుతాడు అప్పారావు. దీంతో తెలియదు అని చెప్పి అక్కడి నుంచి సౌందర్య, ఆనందరావు వెళ్లిపోతారు. మరోవైపు మహాలక్ష్మి.. ఆనంద్ ను తీసుకొస్తుంది. థ్యాంక్స్ మహాలక్ష్మి అంటుంది. నిన్ను ఏమైనా ఇబ్బంది పెట్టాడా అంటే అదేం లేదు దీప అంటుంది.

కానీ.. రుద్రాణి మా ఇంటికి ఎక్కడ వస్తుందో అని తెగ భయపడిపోయాను. తను కానీ బాబును చూసి ఉంటే ఏం చేస్తుందో అని భయపడ్డా. నాకే ఇలా ఉంటే.. ఇంకా నువ్వు ఎంత భయంతో ఉంటున్నావో ఏమో అని చెప్పి మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

ఈ రుద్రాణి గొడవ ఎప్పుడు తీరుతుందో ఏమో అని అనుకుంటుంది దీప. నువ్వు కాసేపు పడుకో. నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి దీప బయటికి వెళ్తుంది. మరోవైపు కార్తీక్.. కూరగాయలు తరుగుతూ అసలు మమ్మీ డాడీ ఎందుకు వచ్చారు అని కంగారు పడతాడు. వాళ్లకు ఏమైంది.. అని టెన్షన్ పడతాడు. మోనిత కూడా ఎందుకు వచ్చింది అని టెన్షన్ పడతాడు.

అసలు వీళ్లంతా ఎందుకు వచ్చారు.. ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకుంటాడు కార్తీక్. ఇంతలో అప్పారావు వచ్చి ఏంటి బావా.. ఏదో కోట్లు పోయినట్టు అలా ఉన్నావు అంటాడు. నాకు ఈరోజు సెలవు కావాలి అంటాడు. కడుపు నొప్పి వచ్చిందని ఓనర్ కు చెబుతానులే అంటాడు.

Karthika Deepam 22 Jan Today Episode : మనం తాగిన కాఫీ అచ్చం దీప పెట్టిన కాఫీలాగానే ఉంది అని అనుకున్న సౌందర్య, ఆనందరావు

మరోవైపు కారులో ఆనందరావు, సౌందర్య వెళ్తూ ఆ కాఫీ అచ్చం మన ఇంట్లో తాగిన కాఫీలాగానే ఉంది అని అనుకుంటారు. అవును.. మనింట్లో దీప చేసిన కాఫీలాగానే ఉంది. ఒకవేళ దీప అక్కడ పనిచేస్తుందా.. అని డౌట్ వచ్చి వెంటనే మరోసారి ఆ హోటల్ కు వెళ్తారు.

ఇంతలో రుద్రాణి అంటూ తన గేట్ తీసుకొని వస్తుంది దీప. పిల్లి గడ్డం.. బాబును ఎత్తుకొని వస్తాడు. బాబును తీసుకోబోతుంది దీప. కానీ.. ఆగు బంగారం.. ఎందుకంత తొందర మాట్లాడుకుందాం ఆగు అంటుంది రుద్రాణి. తప్పు చేశావు రుద్రాణి.. డబ్బులిస్తాం అని చెప్పినా కూడా పిల్లాడిని తీసుకొచ్చావు.. అంటుంది దీప.

నీకు డబ్బులు ఇస్తామన్నా కూడా పిల్లలను తీసుకురావడం తప్పు. నువ్వు చేసింది తప్పు రుద్రాణి అంటుంది. దీంతో ఇన్నాళ్లు అసలు కోసం అడిగాను. ఇప్పుడు వడ్డీ కూడా ఇవ్వాలి కదా. వడ్డీ ఎంతైందిరా పిల్లిగడ్డం అంటే.. రూ.6400 అక్క అంటాడు.

దీంతో వడ్డీ కట్టి రంగరాజును తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. దీంతో దీపకు ఏం చేయాలో అర్థం కాదు. బాబును తన ముందే తీసుకొని లోపలికి వెళ్తుంది రుద్రాణి. వడ్డీ డబ్బులు నాకు తెచ్చిచ్చి రంగరాజును తీసుకెళ్లు అంటుంది రుద్రాణి. ఏ గొడవ లేకుండా నా బాబును తెప్పించుకున్నాను. ఇలాంటి రచ్చ కావాలంటే మీ ఇంటికి వస్తాను.. అక్కడే మకాం వేస్తాను.. వడ్డీ డబ్బులు ఇస్తారా ఇవ్వండి. లేదంటే రంగరాజుతో పాటు నీ ఇద్దరు పిల్లలను కూడా తీసుకొస్తాను జాగ్రత్త అని వార్నింగ్ ఇస్తుంది రుద్రాణి.

వాడికి పాలు పట్టండి. నేను వడ్డీ డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది దీప. ఇంతలో కారులో హోటల్ కు మళ్లీ వస్తారు సౌందర్య, ఆనందరావు. ఏంటి మేడమ్ ఏదైనా మరిచిపోయారా అని అడుగుతాడు అప్పారావు. ఏం లేదులే మీ ఓనర్ గారితో మాట్లాడుతాం అంటారు.

ఆయన దగ్గరికి వెళ్లి ఇందాకా ఇక్కడ కాఫీ తాగాం. ఆ కాఫీ కలిపింది ఎవరో కాస్త చెబుతారా అని అడుగుతారు. తన పేరు, వివరాలు చెప్పండి ప్లీజ్ అంటే.. దీప కలిపిందన్న విషయం చెప్పడు ఓనర్. ఎందుకంటే.. రుద్రాణికి ఇక్కడ తను పనిచేస్తున్నట్టు తెలియకూడదని ముందే ఓనర్ కు చెప్పడంతో అతడు అసలు విషయం చెప్పడు.

అమ్మా నా దగ్గరేనా మీ వేషాలు.. భద్రం ఇక్కడ.. బొంబాయి భద్రం. దీపమ్మ గురించి ఎంక్వయిరీకి వచ్చారా.. ముంబైలో ఉండి వచ్చినోడిని నన్ను బోల్తా కొట్టిస్తారా అని అనుకుంటాడు భద్రం. మరోవైపు కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గరికి వెళ్లి కూరగాయలు తీసుకెళ్లినప్పుడు ప్రకృతి వైద్యశాలలో ఉన్న కొత్తగా వచ్చిన దంపతులు ఎందుకు వచ్చారో తెలుసుకో అని అడుగుతాడు కార్తీక్.

కానీ.. అలా చేయడం తప్పు. వాళ్లు ఆ సమాచారం ఇవ్వరు. నేను మీకు చెప్పలేను అంటాడు. దీంతో కార్తీక్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి…

35 minutes ago

Ys Jagan : నెక్స్ట్ ఏపీ సీఎం జగన్ అని అంటున్న విశ్లేషకులు .. కారణం అదేనట

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయ పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు, ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార…

2 hours ago

Tammreddy Bharadwaja : కన్నప్ప కథకు అంత బడ్జెట్ అవసరం లేదు : తమ్మారెడ్డి భరద్వాజ

Tammreddy Bharadwaja : మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా గురించి ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడారు. సినిమా…

3 hours ago

Anam Ramanarayana Reddy : నారా లోకేశ్ సభలో మంత్రి ఆనం వివాదాస్పద వ్యాఖ్యలు..! వీడియో

Anam Ramanarayana Reddy : నెల్లూరులో నారా లోకేశ్ Nara Lokesh నిర్వహించిన సభలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి…

4 hours ago

Fish Venkat : ఫిష్ వెంకట్‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం..చికిత్స ఖర్చులు భరిస్తామన్న మంత్రి..!

Fish Venkat  : తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న ఫిష్ వెంకట్ ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళనకరంగా…

5 hours ago

Rajendra Prasad : మ‌ళ్లీ నోరు జారిన రాజేంద్ర‌ప్ర‌సాద్‌.. నెట్టింట తెగ ట్రోలింగ్

Rajendra Prasad : టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ మరోసారి తన ప్రసంగం వల్ల విమర్శలలో చిక్కుకున్నారు. ఇటీవల అమెరికాలో…

5 hours ago

Relationship : మీ భార్య మిమ్మల్ని వదిలించుకోవాలి అని ఆలోచిస్తుందనే విషయం… ఈ 5 సంకేతాలతో తెలిసిపోతుంది…?

Relationship : ఈ రోజుల్లో పెళ్లి అనే బంధానికి అసలు అర్థం లేకుండా పోతుంది. ఒకరినొకరు చంపుకోవడం కూడా ఏం…

9 hours ago

Meat : మాంసం రుచిగా ఉండాలని ఇలా వండారో… మీరు ప్రమాదకరమైన వ్యాధులను కొని తెచ్చుకున్నట్లే…?

Meat : చాలామంది మాంసం రుచిగా ఉండాలని రొటీన్ గా తినే అలవాటు బోర్ కొట్టి కొత్తగా ప్రయత్నాలు చేస్తుంటారు.…

10 hours ago