Karthika Deepam 23 June Today Episode : తింగరిపై పగ పెంచుకున్న జ్వాల ఏం చేస్తుంది? జ్వాలే శౌర్య అని తెలుసుకున్న సౌందర్య షాకింగ్ నిర్ణయం

Karthika Deepam 23 June Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 జూన్ 2022, గురువారం ఎపిసోడ్ 1386 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మీ మాటలు అబద్ధం.. మీ చేతలు అబద్ధం.. మీరంతా అబద్ధం అని జ్వాల కోపంతో నిరుపమ్ ను నెట్టేస్తుంది. నువ్వు, ఆ తింగరి ఇద్దరూ అబద్ధమే అంటుంది జ్వాల. దీంతో అక్కడి నుంచి నిరుపమ్ వెళ్లిపోతాడు. హిమ.. పదవే వెళ్దాం అంటుంది సౌందర్య. కానీ.. నానమ్మ ప్లీజ్ నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయ్ అంటంది హిమ. అది కాదే ఇలాంటప్పుడు నిన్ను అంటుంది. ఇలాంటప్పుడే ఒక మనిషికి ఒంటరితనం కావాలి. దయచేసి వెళ్లిపో అంటుంది. నేనేం చచ్చిపోను నానమ్మ. ఒక మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతారు నానమ్మ. నీకు దండం పెడతాను. దయచేసి వెళ్లిపో అంటుంది. ఓవైపు జ్వాల.. మరోవైపు హిమ ఇద్దరూ వెక్కి వెక్కి ఏడుస్తారు. హిమ ఆ విషయం గురించే ఆలోచిస్తూ అక్కడి నుంచి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటుంది.

Advertisement
karthika deepam 23 june 2022 full episode
karthika deepam 23 june 2022 full episode

మమ్మీ డాడీ నన్ను క్షమించండి. శౌర్య కోసం చివరి దాకా ప్రయత్నించాను. నిరుపమ్ బావ శౌర్యలను కలపడానికి క్యాన్సర్ అని అందరినీ నమ్మించాను. అయినా బావ మనసు కరగలేదు అని అంటుంది హిమ. నా మాటను నిలబెట్టుకోలేకపోతున్నాను. మీ చివరి కోరికను.. మీ ఆఖరి మాటలను కూడా నేను నిలబెట్టుకోలేకపోయాను. నా వల్లే శౌర్య ఇల్లు వదిలి వెళ్లిపోయింది. కనీసం బావతో పెళ్లి చేసి అయినా నా బాధ్యత నెరవేర్చుకుందాం అనుకున్నాను అని అనుకుంటుంది హిమ. అమ్మ నేను ఓడిపోయాను. డాడీ నేను ఓడిపోయాను అని అనుకుంటుంది. అన్ని ప్రయత్నాలు విఫలం అయ్యాయి. లేని క్యాన్సర్ అని చెప్పి చచ్చిపోతానన్నా నన్ను నమ్మలేదు. ఇప్పుడు మానసికంగా నిజంగానే చచ్చిపోయాను అనుకుంటుంది. ఇంతలో వెనుక నుంచి వ్యాను వేగంగా వస్తూ ఉంటుంది. హిమ చూసుకోదు. ఇంతలో తనను ప్రేమ్ పక్కకు లాగుతాడు. ఒక్క క్షణం ఆలస్యమైనా హిమను డీసీఎం ఢీకొట్టి ఉండేది.

ఏమైంది హిమ నీకు.. హారన్ వినిపించడం లేదా.. చచ్చిపోతావా అంటాడు ప్రేమ్. దీంతో నేను నిజంగానే చచ్చిపోయాను బావ అంటుంది హిమ. నీ పెళ్లి నీ జీవితం నీ ఇష్టం.. ఎందుకు ఏంటి అని ప్రశ్నించలేం కదా అంటాడు ప్రేమ్. దీంతో నా జీవితమే ఒక పెద్ద ప్రశ్నగా మారింది బావ అంటుంది హిమ.

దీంతో హిమ ఒక విషయం గుర్తుంచుకో. ఉన్నంతలో హ్యాపీగా ఉండటం నేర్చుకో. ఇంటికే కదా పదా డ్రాప్ చేస్తాను అని అంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల ఇంటికెళ్లి నిరుపమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తింగరి ఎంత పని చేశావే.. నా పక్కనే ఉన్నావు.. నా మంచి కోసమే మాట్లాడుతున్నట్టు నటించావు.. అందుకేనా డాక్టర్ సాబ్ గుండెలను కోసినట్టు మాట్లాడాడు అనుకుంటుంది.

నా విషయంలో దేవుడు మారిపోయాడా అనుకున్నా. చిన్నపిల్లలకు చాక్లెట్ ఆశ చూపించినట్టు.. నాకు డాక్టర్ సాబ్ మొగుడు అని ఆశపెట్టి మళ్లీ నానుంచి దూరం చేశారు. ఒకే ఒక్క ఆనందం.. నా జీవితంలో గొప్ప సంతోషం నా డాక్టర్ సాబ్.. ఆయన్ను కూడా కాకుండా చేశావా.. నా పిచ్చి కానీ.. ఇంకా నా డాక్టర్ సాబ్ ఏంటి.. ఇప్పుడు ఏం చేయాలి. ఏడవాలా.. నాకు ఏడుపు రావడం లేదు. ఏడిస్తే తగ్గిపోయే చిన్న బాధా ఇది. ఎన్ని మాటలు.. ఈ ప్రేమ పాడుగాను. ఇంత బాధపెడుతుందా అని అనుకుంటుంది జ్వాల.

Karthika Deepam 23 June Today Episode : తింగరే అంతా చేసిందని అనుకున్న జ్వాల

డాక్టర్ సాబ్ ఎంత ప్రేమగా ఉండేవారు… సడెన్ గా ప్రేమ లేదంటారేంటి. డాక్టర్ సాబ్ సంగతి నాకు తెలియదా? చాలా మంచివారు.. ఆ తింగరే ఏదో మాయ చేసి ఉంటుంది. ఎంత అమాయకంగా కనిపించింది. జ్వాల జ్వాల అని ఒక చిన్నపిల్లలా ఉండేది. ఇది డాక్టర్ ఎలా అయిందా అనిపించేంది అని అనుకుంటుంది జ్వాల.

నేను తయారు చేసిన కత్తి నాకే గుచ్చుకుంది. దానికి తెలివితేటలు నేర్పించి మాట్లాడే ధైర్యాన్ని ఇచ్చి వెంట తిప్పుకుంటే.. ఆనేర్చుకున్న తెలివిని నా మీదే వాడింది. తింగరి.. డాక్టర్ సాబ్ కాదన్నారని ఏడుస్తూ కూర్చుంటాననుకున్నావా? దీనికి కారణం అయిన నిన్ను మాత్రం వదిలేదేలే అని అనుకుంటుంది జ్వాల.

ఇంతలో తనకు ఫోన్ వస్తుంది. తింగరి ఫోన్ చేస్తుంది. కానీ.. లిఫ్ట్ చేయదు జ్వాల. మరోసారి చేస్తుంది. దీంతో లిఫ్ట్ చేస్తుంది. జ్వాల.. డాక్టర్ సాబ్ అంటూ ఏదో చెప్పబోతుంది హిమ. నోర్మూయ్.. నవ్వు ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు. ఎంత మోసం.. ఇంత నటనా అంటుంది జ్వాల.

అందుకేనా నన్ను డాక్టర్ సాబ్ కు మనసులోని మాట చెప్పనివ్వలేదు అంటుంది. అది కాదు జ్వాల అంటే మాట్లాడకు అంటుంది జ్వాల. ఇంకొక మాట కూడా నీ నోటి నుంచి వినదలుచుకోలేదు అంటుంది. అబద్ధం చెబితే తప్పు. అబద్ధాన్ని నిజం చేయాలని చూస్తే ఇంకా పెద్ద తప్పు అంటుంది జ్వాల.

నీ మాయ నటనతో నన్ను నమ్మించి మోసం చేశావు అంటుంది జ్వాల. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అంటుంది హిమ. కానీ.. ఇంకా ఏంటి అర్థం చేసుకునేది. నా శత్రువు హిమకు నువ్వేం తీసిపోవు అంటుంది జ్వాల. నాకు ఇప్పుడు ఒక్కరు కాదు.. ఇద్దరు శత్రువులు ఉన్నారు అని చెప్పి నాకు ఇంకోసారి ఫోన్ చేయకు అని ఫోన్ కట్ చేస్తుంది జ్వాల.

ఇంతలో హిమ దగ్గరికి సౌందర్య వస్తుంది. జ్వాలే శౌర్య అని తెలిసినప్పటి నుంచి తన ఫోటోను ఈ ఫోటో వెనుకాల పెట్టి రహస్యంగా పెట్టి తనను చూస్తూ అలా మురిసిపోతున్నాను. నాకు శౌర్య అంటే చాలా ఇష్టం నానమ్మ. చిన్నప్పటి నుంచి తను నాకంటే చాలా ఫాస్ట్. అన్ని విషయాలు చాలా బాగా ఆలోచించేది అంటుంది హిమ.

నేను తనంత దూకుడుగా ఉండకపోతే తను నాకు అన్నీ చెప్పేది.. అంటుంది హిమ. అలాంటి శౌర్య.. నా మూలంగా ఇంట్లో నుంచి వెళ్లిపోతే ఆ బాధను ఎలా భరించాను అంటుంది హిమ. మమ్మీ డాడీలు పోయారు అనే బాధ.. శౌర్య ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని మరో బాధ.. ఈ బాధలన్నీ తీరేలా శౌర్య ఎప్పుడో ఒకసారి వస్తుందని హిమ అని గట్టిగా పట్టుకుంటుందని ఇన్ని సంవత్సరాల కబుర్లు అన్నీ ఆనందంగా చెబుతుంది అనుకున్నా అంటుంది హిమ.

దీంతో నా బాధ నువ్వు చెబుతున్నట్టు ఉంది అంటుంది సౌందర్య. అయినా మీరు ఎన్నాళ్లు కలిసి ఉన్నారని గొడవ పడటానికి. ఒకరు దీప దగ్గర.. ఒకరు కార్తీక్ దగ్గర ఉన్నారు. ఇటు ఇద్దరు.. అటు ఇద్దరు కలిసి నలుగురు అయ్యేసరికి ఎవరి కన్ను కుట్టిందో ఏమో.. దేవుడు వాళ్ళిద్దరినీ తీసుకెళ్లిపోయాడు. మీ ఇద్దరినీ దూరం చేశాడు అంటుంది సౌందర్య.

మెడికల్ క్యాంపులో ఒకసారి బ్లడ్ ఇస్తుండగా తను నాకు కనిపించింది అని చెబుతుంది హిమ. అప్పటి దాకా శౌర్య నన్ను కలిసి ఆనందంగా హత్తుకుంటుంది అని అనుకున్న నాకు.. తను నన్ను ఎంత ధ్వేషిస్తోందో తెలిసింది. ఆరోజు నుంచి శౌర్యతో నా ప్రయాణం మొదలైంది. ఒకసారి మేమిద్దరం బైక్ పై వెళ్తుంటే నువ్వు చూశావు కానీ.. ఆరోజు ఆగకుండా వెళ్లిపోయాం అంటుంది హిమ.

ఆ తర్వాత జ్వాల ఇంటికి వెళ్తుంది సౌందర్య. తన లవ్ స్టోరీ మొత్తం సౌందర్యకు చెబుతుంది జ్వాల. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement