Karthika Deepam 25 Oct Tomorrow Episode : కార్తీక్ అమెరికా ప్రయాణం.. మోనితకు పురిటి నొప్పులు.. కండీషన్ సీరియస్
Karthika Deepam 25 Oct Tomorrow Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ సోమవారం ప్రసారం అవుతుంది. ఆదివారం కార్తీక దీపం సీరియల్ ప్రసారం కాదు. తిరిగి.. 25 అక్టోబర్ 2021, సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక దీపం సీరియల్ శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. భారతి ఇంటికి వచ్చిన మోనిత.. కార్తీక్ ను బెదిరిస్తుంది. అసలు నువ్వు నీ శాంపిల్స్ ఎందుకు ఇచ్చావో నాకు తెలుసు. అందరికీ నేను చెబుతాను. నా భార్య మీద అనుమానం అని చెప్పి నేను శాంపిల్స్ ఇచ్చాను.. అని చెబుతావా? ఆ పిల్లలు నాకు పుట్టారో లేదో తెలుసుకోవాలని శాంపిల్స్ ఇచ్చాను అని చెబుతావా? అంటూ కార్తీక్ ను బెదిరిస్తుంది మోనిత.

karthika deepam 24 october 2021 episode highlights
ఆ తర్వాత మోనితకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. నేను మాత్రం నీ మాటలు పట్టించుకోను. నేను అమెరికా వెళ్తున్నా.. అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఇంటికి వచ్చే సమయానికి మాలతి వచ్చి ఏడుస్తుంది. తన భర్త తనను అనుమానిస్తున్నాడని చెబుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. కార్తీక్ కూడా షాక్ అవుతాడు. కానీ.. ఇదంతా మోనిత ప్లాన్ అని తెలుసుకోలేకపోతారు అందరు. ప్రియమణి వెనుక ఉండి మాలతితో ఈ ప్లాన్ నడిపిస్తుంది.
మాలతి వెళ్లిపోయాక కూడా కార్తీక్ ఇంకా ఏదో ఆలోచిస్తూ నిలబడతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఒకవైపు విమానానికి సమయం అవుతోంది. తొందరగా రెడీ అవ్వు అని చెబుతుంది సౌందర్య. కానీ.. కార్తీక్ ఏం మాట్లాడడు. దీంతో అందరూ షాక్ అవుతారు.
మరోవైపు మోనిత తన ఇంటికి వస్తుంది. వచ్చి తన ఇల్లును చూసుకుంటుంది. ఇంట్లోకి వెళ్లే సమయానికే తను నొప్పులు వస్తాయి. దీంతో భారతికి ఫోన్ చేసి భారతి ఆసుపత్రిలో చేరుతుంది మోనిత. కార్తీక్ వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని మొండి పట్టు పడుతుంది. దీంతో వెంటనే కార్తీక్ కు ఫోన్ చేస్తుంది భారతి. ఏంటి.. మీ ఫ్రెండ్ మళ్లీ ఏమైనా కొత్త ప్లాన్ వేసిందా అని అడుగుతాడు కార్తీక్.
Karthika Deepam 25 Oct Tomorrow Episode : మోనితకు నొప్పులు వస్తున్నాయని కార్తీక్ కు ఫోన్ చేసిన భారతి
మోనితకు నొప్పులు వస్తున్నాయి అని చెబుతుంది. హాస్పిటల్ లో అడ్మిడ్ అయింది అని కార్తీక్ కు భారతి చెబుతుంది. దీంతో నాకెందుకు ఇవన్నీ చెబుతున్నావు అని అంటాడు కార్తీక్. తన కండీషన్ చాలా సీరియస్ గా ఉంది అని చెబుతుంది భారతి. నువ్వు వస్తే కానీ ఆపరేషన్ చేయించుకోనని చెబుతోంది అని అంటుంది భారతి. నాకేంటి సంబంధం.. అని కార్తీక్ సీరియస్ అవుతాడు.. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు.

karthika deepam 24 october 2021 episode highlights
అది చేసిన పాపానికి కడుపులోని బిడ్డ ఏం పాపం చేసిందిరా అని కార్తీక్ తో అంటుంది సౌందర్య. తనకు ఏమైనా నేను బాధపడను కానీ.. కడుపులోని పసిబిడ్డ ఏం పాపం చేసింది అంటుంది సౌందర్య. ఎవరి మీద జాలి పడుతున్నావు మమ్మీ అంటాడు కార్తీక్. చూస్తూ చూస్తూ ఆ పసిప్రాణాన్ని అలా ఎలా వదిలేస్తావు అంటుంది సౌందర్య. ఇంతలో దీప.. చాయ్ తీసుకొని వస్తుంది. దీంతో వెంటనే మాట మారుస్తుంది సౌందర్య. లాయర్ విశ్వం ఫోన్ చేశాడు అని అంటుంది. దీంతో దీప కనిపెడుతుంది. నేను రాగానే టాపిక్ మార్చారు అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.