Intinti Gruhalaskhmi 25 Oct Tomorrow Episode : తులసికి చాలెంజ్ విసిరిన లాస్య.. నువ్వు నాశనం అవుతావు.. లాస్యకు తులసి వార్నింగ్
Intinti Gruhalaskhmi 25 Oct Tomorrow Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. ఈరోజు ఎపిసోడ్ ప్రసారం కాదు. సోమవారం, 25 అక్టోబర్ 2021, 459 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. శనివారం ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూశాం కదా. ప్రేమ్, శృతి శోభనం కోసం తులసి ఎంతో ఆతృతగా చూసినా.. వాళ్ల శోభనం మాత్రం జరగదు. ఆంటీకి 2 కోట్ల అప్పు భారం మన వల్ల వచ్చింది. తను 2 కోట్ల అప్పు తీర్చేందుకు కష్టపడుతుంటే మనం మాత్రం ఫస్ట్ నైట్ అంటూ ఎంజాయ్ చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మనం ఆంటికి 2 కోట్ల అప్పు భారం తీరాకనే శోభనం చేసుకుందాం అని శృతి.. ప్రేమ్ తో చెబుతుంది. దీంతో ప్రేమ్ కూడా తన మనసులో అదే మాట ఉందని చెబుతాడు. నా మనసులో ఉన్న మాటే నువ్వు చెప్పావు శృతి అంటాడు ప్రేమ్.

intinti gruhalakshmi 24 october 2021 episode highlights
అమ్మ 2 కోట్ల అప్పు భారం తీరాకనే మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అంటాడు ప్రేమ్. కాకపోతే ఈ విషయం ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడాలని చెబుతాడు ప్రేమ్. ఉదయం కాగానే.. రాములమ్మ వచ్చి ప్రేమ్, శృతి రూమ్ డోర్ కొడుతుంది. డోర్ తీయడానికంటే ముందు.. శృతి బొట్టును చెడిపేసి.. చీరను అటూ ఇటూ అని.. ప్రేమ్ కూడా కాస్త తన డ్రెస్ ను అటూ ఇటూ చేస్తాడు. ఆ తర్వాత డోర్ తీస్తుంది శృతి.
రాములమ్మ.. వీళ్ల శోభనం జరిగిందా? లేదా? అని చూస్తుంది. ఏంటి ఇంకా పొద్దెక్కినా లేవలేదు అని అడుగుతుంది రాములమ్మ. తన బొట్టు చెరిగిపోయి ఉండటం చూసి రాత్రి పని జరిగింది అని అనుకుంటుంది రాములమ్మ. అక్కడే ఉన్న తులసి ఇవన్నీ చూసి సిగ్గుపడుతుంది. త్వరలో పండంటి బాబు పుడితే అదే చాలు అని మనసులో అనుకుంటుంది తులసి.
Intinti Gruhalaskhmi 25 Oct Tomorrow Episode : తులసి, లాస్య మధ్య మరోసారి పోరు
అయితే.. బెడ్ ఏమాత్రం నలిగిపోకుండా ఉండటం చూసిన రాములమ్మ.. అదేంటి బెడ్ నలగలేదు అని అడుగుతుంది. వేసిన బెడ్ వేసినట్టే ఉంది ఏంటి అని అడుగుతుంది. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు. రాములమ్మ కనిపెట్టేసిందా? అని టెన్షన్ పడతారు. బెడ్ ఏమాత్రం నలగకుండా మీరు ఫస్ట్ నైట్ ఎలా చేసుకున్నారు అని ప్రశ్నిస్తుంది. అరచేతికి అంటకుండా అన్నం తినేవాళ్లను చూశాను కానీ.. దుప్పటి నలగకుండా పడుకునేవాళ్లను ఇప్పుడే చూస్తున్నాను అంటుంది రాములమ్మ.

intinti gruhalakshmi 24 october 2021 episode highlights
ఈ ఇంటి కోసం మన మంచి కోసం ఒక బరువును, బాధ్యతను మీరు మోయాలనుకుంటున్నారు. ఈ విజయ దశమి కల్లా విజయం మీ దరికి చేరాలని కోరుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించండి ఆంటి అని శృతి.. తులసిని అడుగుతుంది. కోరుకున్నంత మాత్రాన జరగదు కదా.. అని లాస్య అంటుంది. అహం బ్రహ్మస్య.. అంతా నా వల్లే జరుగుతోంది అని అనుకున్న మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. అది ఎవరో కాదు నువ్వే అంటూ తులసి.. లాస్యపై ఫైర్ అవుతుంది. నువ్వు ఓడిపోతావో, నేను ఓడిపోతానో చూద్దాం అని లాస్య.. తులసికి చాలెంజ్ విసురుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.