Karthika Deepam 25 March Today Episode : సత్య.. సౌందర్య అల్లుడే అని శౌర్యకు తెలుస్తుందా? సౌందర్యను ఆసుపత్రిలో చూసిన శౌర్య ఏం చేస్తుంది? హిమ గురించి తెలుసుకుంటుందా?

Authored By Varun G | The Telugu News | Published on: March 25, 2022, 10:30 am

Karthika Deepam 25 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 25 మార్చి 2022, శుక్రవారం ఎపిసోడ్ 1309 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తన చేతి మీద ఉన్న హెచ్ అనే అక్షరాన్ని చూసి గతాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుంటుంది. ఎక్కడున్నావే హిమ.. ఎక్కడికి వెళ్లిపోయావు అనుకుంటుంది. నీకోసం ఇంటికి వచ్చాను. ఇల్లు అమ్మేసి వెళ్లిపోయారని తెలిసింది. అంటే.. ఇల్లు అమ్మేసి మీరు వెళ్లిపోతే నేనేం కావాలనుకున్నారు. నేను మీకు అవసరం లేదా. నా గురించి వెతకరా అని అనుకుంటుంది శౌర్య. నా మీద ప్రేమ లేదా. అర్థం అయింది. మీరు నా కోసం వెతకలేదు. వెతికితే దొరికేదాన్నేమో అని అనుకుంటుంది. మీరెవ్వరూ నన్ను పట్టించుకోలేదు. నా మీద మీకు ప్రేమ లేదు. నాకు అర్థం అయిపోయింది.. అని అనుకుంటుంది శౌర్య.

karthika deepam 25 march 2022 full episode

karthika deepam 25 march 2022 full episode

అయినా.. అందరికీ నీ మీదే ప్రేమెక్కువ. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచారు కదా. నీకేదైనా చిన్న తలనొప్పి వచ్చినా.. జ్వరం వచ్చినా హడావుడి చేసేవారు. అమ్మా నేను కష్టాల్లో పుట్టాం. కష్టాల్లో పెరిగాం. ఎన్నో ఏళ్లు నాన్నకు దూరంగా ఉన్నాం. అందరూ కలిశామని సంతోషించాం. ఆ ఆనందం తీరకముందే నువ్వు అమ్మానాన్నలను చంపేశావు. నాకు అమ్మానాన్నలను దూరం చేసి.. నువ్వు ఎక్కడో నానమ్మ, తాతయ్యలతో సంతోషంగా ఉంటావా. నువ్వు సంతోషంగా ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా. ఊరుకోను కదా. వెతికి పట్టుకుంటాను. నిన్ను వదిలేదేలే.. ఎక్కడున్నా పట్టుకుంటా. ఎలా ఉంటావే హిమ నువ్వు. శౌర్య కోపం అంటే ఏంటో నేను నిరూపిస్తాను.

నానమ్మ, తాతయ్యలు ధనవంతులు కాబట్టి నువ్వు వాళ్లతో సంతోషంగా, హ్యాపీగా ఉంటున్నావు అని అనుకుంటుంది శౌర్య. ఇంతలో ఇంద్రుడు, చంద్రమ్మ వచ్చి ఏంటమ్మా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. గుడిలో అన్నదానానికి ఏర్పాట్లు చేశాను అంటాడు ఇంద్రుడు.

నీ అసలు పేరు ఏంటో కూడా చెప్పలేదు. అయినా కూడా మేము ఎప్పుడూ అడగం అంటుంది చంద్రమ్మ. మీకు కూతురు పుట్టి చనిపోయింది కదా. తన పేరు జ్వాల కదా అంటుంది. అందుకే తన పేరును జ్వాలగా పెట్టుకున్నా.. అంటుంది శౌర్య.

కట్ చేస్తే.. శౌర్యను, కార్తీక్, దీపను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తుంది హిమ. తప్పంతా నాదే.. నేనే అమ్మానాన్నలను పోగొట్టుకున్నాను అనుకుంటుంది హిమ. ఇంతలో సౌందర్య వస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. చేసిన తప్పు గుర్తొస్తుంది. అమ్మానాన్నలను నేనే చంపేశాను నానమ్మ అంటూ ఏడుస్తుంది.

Karthika Deepam 25 March Today Episode :  గుడిలో అన్నదానానికి బయలు దేరిన హిమ, సౌందర్య, ఆనంద రావు

మరోవైపు అన్నం తింటూ కొంచెం అన్నం తీసి ప్లేట్ లో పెడుతుంది శౌర్య. ఇద్దరు అమ్మానాన్నలకు రెండు ముద్దలు తీస్తుంది. ఆ రెండు ముద్దలను తీసుకెళ్లి ఇంటి ముందు ఉన్న గోడ మీద పెడుతుంది. బయటికి వెళ్లి కావ్.. కావ్ అంటుంది.

ఏంటమ్మా ఈ పిచ్చి అంటుంది చంద్రమ్మ. దీంతో పిచ్చి కాదు పిన్ని.. ఆశ. కాకులు అరిస్తే ఇంటికి చుట్టాలు వస్తారు అంటారు కదా. ఎప్పటికీ తిరిగి రానంత దూరం వెళ్లిన మా అమ్మానాన్నల ఆత్మలు చుట్టాల రూపంలో వస్తారని ఆశ పిన్ని అంటుంది శౌర్య.

మరోవైపు గుడిలో అన్నదానం చేయడానికి బయలుదేరుతారు సౌందర్య, హిమ, ఆనంద రావు. వెళ్లే సమయంలో కొంచెం ఆవేశానికి లోనవుతాడు ఆనంద రావు. మరోవైపు టిఫిన్ తీసుకొని శౌర్య.. సత్య గారి దగ్గరికి వెళ్తుంది. ఇంతలోనే సత్య ఫోన్ కు సౌందర్య నుంచి కాల్ వస్తుంది. నేను తెస్తా సార్ అంటుంది శౌర్య.

ఆ ఫోన్ లో సౌందర్య ఫోటో వస్తుంది. ఆ ఫోటోను శౌర్య చూస్తుందా? ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp