JR NTR : RRR Movie చూసి వ‌చ్చాక ఎన్టీఆర్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా.. వీడియో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

JR NTR : RRR Movie చూసి వ‌చ్చాక ఎన్టీఆర్ రియాక్ష‌న్ ఏంటో తెలుసా.. వీడియో?

 Authored By sandeep | The Telugu News | Updated on :25 March 2022,9:30 am

RRR Movie : అర‌వింద స‌మేత చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ న‌టించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల‌కు పైగా కృషి చేశాడు ఎన్టీఆర్. చిత్రంలో కొమురం భీం పాత్ర‌లో న‌టించిన ఎన్టీఆర్ ఎన్ని క‌ష్టాలు ప‌డ్డాడో ప‌లు సంద‌ర్భాల‌లో వివ‌రించాడు. అయితే ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌లోని AMB సినిమాస్‌లో జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం, సన్నిహితుల కోసం ప్రత్యేక షో ప్రదర్శించారు. జూనియర్ ఎన్టీఆర్, తన భార్య లక్ష్మీ ప్రణతి, పిల్లలు నందమూరి అభయ్ రామ్, నందమూరి భార్గవ్ రామ్‌లతో పాటు ప్రివ్యూకి చిరంజీవి కూడా హాజరయ్యారు.

సినిమా పూర్తయ్యాక ఎన్టీఆర్ రియాక్షన్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న స‌మ‌యంలో అంద‌రు ఖుషీ అయ్యేలా సినిమా చూసిన తరువాత జూనియర్ ఎన్టీఆర్ హృదయపూర్వక చిరునవ్వుతో బయటకు వచ్చాడు. మీడియాకు డబుల్ థంబ్స్ అప్ కూడా చూపించడం చూస్తుంటే తారక్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్టు అన్పిస్తోంది. రివ్యూలు కూడా పాజిటివ్‌గానే వ‌స్తున్న నేప‌థ్యంలో సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించ‌నుంద‌ని అంటున్నారు. వెయ్యి కోట్ల‌కుపైగా వ‌సూళ్లు రాబ‌ట్టాల‌ని రాజ‌మౌళి భావిస్తున్నాడు.

Jr ntr reaction after watching rrr movie

Jr ntr reaction after watching rrr movie

RRR Movie : ఆర్ఆర్ఆర్ రిజ‌ల్ట్‌పై ఫుల్ హ్యాపీ..

డివివి దానయ్య ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషించగా, వీరితో పాటు ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, ఒలీవియా మోరిస్, సముద్రఖని, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బెనిఫిట్ షోలకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్‌ నగరంలోని ఐదు థియేటర్లలో స్పెషల్‌గా బెనిఫిట్ షో వేయనున్నారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్‌, అర్జున్‌, మూసాపేట శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ఉ.7గంటల కన్నా ముందు షో వేసేందుకు అనుమతి ఇచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by Telugu FilmNagar (@telugufilmnagar)

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది