Karthika Deepam 26 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 1310 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సత్యంకు ఫోన్ వస్తే తీసుకురావడానికి వస్తుంది జ్వాల. ఇంతలో ఫోన్ కట్ అవుతుంది. దీంతో తిరిగి తన అత్తయ్యకు ఫోన్ చేస్తాడు సత్యం. మామయ్యకు బాగో లేదు అని చెబుతుంది. దీంతో వెంటనే వెళ్లడానికి రెడీ అవుతాడు. ప్రేమ్.. కారు తీసుకెళ్లడంతో ఏం చేయాలి అని ఆలోచిస్తుంటాడు సత్యం. ఇంతలో జ్వాల.. తన ఆటోలో తీసుకెళ్తా అని చెబుతుంది. దీంతో రెడీ అయి వస్తా అని చెబుతాడు సత్యం.
ఇంతలో ఆసుపత్రిలో ఆనంద రావుకు చెక్ చేస్తాడు నిరుపమ్. మీరు ఎక్కువగా టెన్షన్ తీసుకోకండి తాతయ్య. మీకు ఏం కాలేదు. మీరు బాగానే ఉన్నారు. మీ సమస్య కేవలం మీరు ఎక్కువగా ఆలోచించడమే అంటాడు నిరుపమ్. మీ అమ్మ వచ్చిందా అని అడుగుతాడు ఆనంద రావు. దీంతో మా అమ్మ రాదు అనే విషయం నీకు తెలుసు కదా అంటాడు ప్రేమ్. మీరు ఎక్కువగా టెన్షన్ పడకండి అంటాడు ప్రేమ్. ఎవ్వరి గురించి ఆలోచించకండి అంటాడు.
తాతయ్య ప్రాబ్లమ్ అదే కదా.. అంటాడు ప్రేమ్. దీంతో పాజిటివ్ గా ఆలోచించాలి అంటాడు నిరుపమ్. పాజిటివ్ గా ఎలా ఆలోచిస్తారు. మన మమ్మీ మారదు. పోయిన కార్తీక్ మామయ్య, దీప అత్తయ్యలు తిరిగి రారు. ఇక శౌర్య ఎక్కడ ఉంటుందో.. ఏం చేస్తుందో తెలియదు అంటాడు ప్రేమ్.
దీంతో బావ ప్లీజ్ అలా అనొద్దు. శౌర్య ఎప్పటికైనా మన దగ్గరికి వస్తుందన్న నమ్మకం నాకు ఉంది అంటుంది హిమ. దీంతో నాకు లేదు అంటాడు ప్రేమ్. ఎందుకురా అలా మాట్లాడుతున్నావు అంటుంది సౌందర్య. జరగని వాటి గురించి ఆలోచించడం వేస్ట్.. అంటాడు ప్రేమ్.
నీకో విషయం తెలుసా. మమ్మీ దగ్గర నువ్వుంటావు.. డాడీ దగ్గర నేనుంటాను. కానీ.. వాళ్లు కలవాలని నేను ఎందుకు అనుకోనో తెలుసా? ఎందుకంటే.. వాళ్లు ఇద్దరూ కలిసి గొడవలు పెట్టుకోవడం కంటే.. దూరంగా ఉండి ప్రశాంతంగా ఉండటమే మేలు అంటాడు ప్రేమ్.
వీడికి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు అని అనుకుంటుంది సౌందర్య. తాతయ్య.. మీరు ప్రశాంతంగా ఉండాలి అర్థం అయిందా అంటుంది హిమ. దీంతో ఇంట్లో డాక్టర్లు ఎక్కువైనా కష్టమే సౌందర్య అంటాడు ఆనంద రావు. కట్ చేస్తే సత్యం ఆసుపత్రికి చేరుకుంటాడు. నేను ఆటో పార్క్ చేసి వస్తాను అంటుంది జ్వాల.
ఏంటి డాడీ చీప్ గా ఆటోలో వచ్చారా అంటాడు ప్రేమ్. దీంతో హలో ఎక్స్ ట్రా.. ఆటో చీప్ కాదు అంటూ ఇద్దరూ ఆసుపత్రిలోనే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. వెంటనే ప్రేమ్ కాలర్ పట్టుకుంటుంది జ్వాల. నా కాలర్ పట్టుకుంటావా అని తనను నెట్టేస్తాడు ప్రేమ్.
దీంతో వెళ్లి నిరుపమ్ మీద పడుతుంది. ఏంటి గొడవ అని అడుగుతాడు. దీంతో నా ఆటోను చీప్ అంటున్నాడు. తప్పా కాదా అంటుంది. దీంతో తప్పే అంటాడు. తర్వాత నిరుపమ్.. సత్యం కొడుకే అని తెలుసుకుంటుంది జ్వాల. దీంతో జరిగిన విషయం మొత్తం చెబుతుంది జ్వాల.
డాక్టర్ సార్.. నువ్వు సూపర్ గా మాట్లాడుతున్నావు అంటుంది జ్వాల. సార్.. తప్పు నా వైపు లేకపోతే ఆ దేవుడితోనైనా గొడవ పెట్టుకుంటాను అంటుంది జ్వాల. ఇలానే ఉండాలి అమ్మాయిలు అంటే అంటాడు నిరుపమ్. ఇంతలో హిమ వస్తుంది అక్కడికి.
ఏంటి ప్రాబ్లమ్ అంటుంది. హిమను చూసి హేయ్ తింగరి నువ్వేంటి ఇక్కడ అంటుంది జ్వాల. తనకు నేను పెట్టుకున్న పేరు డాక్టర్ సాబ్ అంటుంది జ్వాల. తింగరి.. నువ్వు డాక్టర్ వా అంటుంది. దీంతో నన్ను తింగరి.. తింగరి అనకండి అంటుంది హిమ.
సత్యం.. ఆనంద రావును చూడటానికి లోపలికి వెళ్తాడు. అసలు అమ్మాయిలు ఇలా ఉంటారా.. మన డాక్టరమ్మలా పద్ధతిగా ఉండాలి అంటాడు ప్రేమ్. దీంతో నీ మొహం.. అమ్మాయిలు ఇలాగే ఉండాలి అంటాడు నిరుపమ్. గలగలా మాట్లాడాలి.. అచ్చం తనలాగే ఉండాలి.. తన ఆటిట్యూడ్ నచ్చింది నాకు అంటాడు నిరుపమ్.
దీంతో ప్రేమ్, హిమ షాక్ అవుతారు. జ్వాల సిగ్గు పడుతుంది. తనకు షేక్ హ్యాండ్ ఇస్తుంది. సార్.. మీ పనులు మీరు చూసుకోండి. నేను ఆటో దగ్గర ఉంటాను. మీతో నాకేంటి పంచాయతీ అని చెప్పి ఆటో దగ్గరికి వెళ్లిపోతుంది జ్వాల. ఇంతలో సౌందర్య కూడా కిందికి వస్తుంది. ల్యాబ్ రిపోర్ట్స్ కోసం వస్తుంది.
కానీ.. సౌందర్యను శౌర్య చూడదు. రిపోర్ట్స్ తీసుకొని సౌందర్య వెళ్లిపోతుంది. అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే ఉన్నాయి అని చెబుతుంది సౌందర్య. సరే.. అత్తయ్య గారు నేను బయలుదేరుతాను అంటాడు సత్యం. ఇంతలో మంచినీళ్లు తాగేందుకు పైకి వస్తుంది శౌర్య.
ఇంతలో సౌందర్య రిసెప్షన్ దగ్గరికి వస్తుంది. కట్ చేస్తే.. గుడిలో కార్తీక్, దీప పేరు మీద అన్నదానం చేయిస్తుంది శౌర్య. అప్పుడే సౌందర్య కూడా వచ్చి.. వాళ్ల పేర్ల మీదనే అన్నదానం చేయాలని చెబుతుంది. ఇప్పుడే ఓ అమ్మాయి ఇవే పేర్లతో అన్నదానం చేయాలని చెప్పిందని సౌందర్యకు చెబుతాడు.
దీంతో సౌందర్య షాక్ అవుతుంది. అంటే శౌర్య ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటుంది. శౌర్య.. అంటూ గుడి మొత్తం వెతుకుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Bigg Boss Telugu 8 : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తాజా ఎపిసోడ్‌లో మెగా…
Ind Vs Aus 1st Test Match : పెర్త్ వేదికగా భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్…
Maharashtra Jharkhand Election Results 2024 : మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది.…
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
This website uses cookies.