Karthika Deepam 26 May Today Episode : శోభకు నిరుపమ్ షాక్.. జ్వాలతో చనువు.. దీంతో శోభ షాకింగ్ నిర్ణయం.. హిమ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?

Karthika Deepam 26 May Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 మే 2022, గురువారం ఎపిసోడ్ 1362 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్వప్న ఇంటికి వెళ్లిన జ్వాల విచిత్రంగా మాట్లాడుతుంది. డబ్బులు పారేసుకుంటున్నారు ఏంటి మేడమ్.. పోగొట్టుకుంటే మళ్లీ తిరిగి రావడం చాలా కష్టం. డబ్బులైనా.. మనుషులైనా. ఏవైనా సరే.. కష్టపడితేనే వస్తాయి. ఊరికే రావు కదా అని చెప్పి వస్తాను డాక్టర్ సాబ్ ఉంటాను.. మేడమ్ వస్తాను.. ఆరోగ్యం జాగ్రత్త అంటుంది జ్వాల. అయినా.. ఈ ఇంట్లో డాక్టర్లు ఉండగా.. మీకు ఆరోగ్యం జాగ్రత్త అని నేను చెప్పాలా ఏంటి అంటుంది. దీంతో స్వప్నకు కోపం వస్తుంది. దీంతో తనను అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు నిరుపమ్. మరోవైపు ఏంటి రెచ్చిపోతున్నావు.. ఎక్కువ చేయకు నేను చాలా డేంజర్ అంటుంది శోభ. దీంతో నా సంగతి నీకు తెలిసింది కదా. నేను డబుల్ డేంజర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది జ్వాల.

Advertisement
karthika deepam 26 may 2022 full episode
karthika deepam 26 may 2022 full episode

కట్ చేస్తే.. ప్రేమ్ ఇంకా హిమ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. హిమ అసలు పెళ్లి ఎందుకు క్యాన్సిల్ చేసుకుందో అర్థం కాక టెన్షన్ పడుతుంటాడు. ఇంతలో అక్కడికి వచ్చిన సత్యం.. ఏంట్రా ఏమైందిరా నీకు. ఈ మధ్య నీలో బాగా మార్పు కనిపిస్తోంది అంటాడు. అదేం లేదు అంటాడు. కానీ.. నీ వాలకం చూస్తుంటే ఏదో పోగొట్టుకున్నవాడిలా కనిపిస్తున్నావు అంటాడు. గలగల మాట్లాడే నువ్వు సైలెంట్ గా ఉంటే మీ అమ్మ మీద బెంగ పెట్టుకున్నావేమో అనిపిస్తోంది అంటాడు సత్యం. అదేం లేదు అంటాడు ప్రేమ్. అసలు.. హిమ ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది. స్వప్నను చూసి షాక్ అయిందా? స్వప్నతో జీవితాంతం పోరు ఎందుకు అని అనుకుందా అని అంటాడు సత్యం.

దీంతో డాడీ చెప్పింది కూడా నిజమే కదా అని అనుకుంటాడు. అర్జెంట్ గా హిమతో మాట్లాడాలి అని అనుకుంటాడు ప్రేమ్. మరోవైపు జ్వాల మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకుంటుంది శోభ. దాని కోసం ఒక ప్లాన్ వేస్తుంది. నా ముందు చాలా సమస్యలు ఉన్నాయి. ఒక్కో సమస్యను మెల్లగా పరిష్కరించుకుంటూ వెళ్లాలి. అప్పుడే నిరుపమ్ ను నా దారిలోకి తెచ్చుకోగలుగుతాను అని అనుకుంటుంది శోభ.

దాని కోసం ముందు ఆటో దానితో నిరుపమ్ ఫ్రెండ్ షిప్ కట్ చేయాలి అని అనుకుంటుంది. హిమ మీద కోపంతో ఆటో దానికి దగ్గరవుతాడు. అవసరమైతే దాని మెడలో తాళి కట్టినా కడతాడు. ఈ లోపే నేను యాక్షన్ లోకి దిగాలి. నిరుపమ్ మనసు మార్చి నా మెడలో తాళి కట్టించుకోవాలి అని అనుకుంటుంది శోభ.

అప్పు చేసిన కట్టిన ఫుల్ మూన్ హాస్పిటల్ అప్పు అంతా.. నిరుపమ్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఒకే హాస్పిటల్ లో ఇద్దరం వర్క్ చేసి తీర్చుకోవచ్చు అని అనుకుంటుంది. నిరుపమ్ నాకు దగ్గరవ్వాలంటే.. నేను నిరుపమ్ దగ్గరుండాలి. నాకు ఇక వేరే పనే లేదు. నిరుపమ్ మనసు మార్చడమే నా ముందున్న కర్తవ్యం అని అనుకుంటుంది శోభ.

Karthika Deepam 26 May Today Episode : నీకు మంచి మొగుడు వస్తాడని జ్వాలతో అన్న సౌందర్య

మరోవైపు ఇంద్రుడు ఫుల్లుగా తాగుతాడు. దీంతో జ్వాల అతడిని తీసుకొని ఇంటికి ఆటోలో తీసుకొని వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. కానీ.. ఇంద్రుడు మాత్రం ఆటో ఎక్కడు. అప్పుడే కారులో వెళ్తున్న సౌందర్య వాళ్లను చూసి కారు ఆపి ఏమైందని అడుగుతుంది.

జ్వాలకు సాయం చేసి అతడిని ఆటో ఎక్కిస్తుంది సౌందర్య. ఆ తర్వాత ఏంటే ఇది.. అని అడుగుతుంది. మీ బాబాయి ఇలా తాగి రోడ్ల మీద తిరగడం ఏంటి అంటుంది. దీంతో చెప్తే వినడు. మామూలుగా అయితే ఇలా చేయడు. ఇంట్లోనే తాగుతాడు అంటుంది.

మీ బాబాయి అంత తాగినా నీ కళ్లలో ప్రేమ తప్ప కోపం కనిపించడం లేదేంటి అంటుంది సౌందర్య. మా బాబాయి కదా అంటుంది. మీ అబ్బాయి ఎప్పుడైనా మందు తాగి ఇంట్లోకి వస్తే మీరు కాదంటారా అంటుంది జ్వాల. దీంతో కార్తీక్ ను గుర్తుకు తెచ్చుకుంటుంది సౌందర్య.

జ్వాల దగ్గరికి వెళ్లి తన చేయి పట్టుకొని నా హృదయాన్ని టచ్ చేశావు బంగారం. నా కొడుకును గుర్తు చేశావు. నీకు మంచి మొగుడు వస్తాడు. రావాలని నేను కోరుకుంటన్నాను. వెళ్లు.. జాగ్రత్తగా తీసుకెళ్లు అని జ్వాలతో అంటుంది సౌందర్య.

కట్ చేస్తే.. నిరుపమ్ హాస్పిటల్ కు వెళ్లిన శోభ.. అతడితో మాట్లాడుతూ ఉంటుంది. హిమ గురించి అడుగుతుంది. ఏమో.. తన మనసులో నేను ఉన్నా.. తను ఎందుకు వద్దనుకుందో అర్థం కావడం లేదు. నా మనసులో ఇంకా హిమే ఉంది అంటాడు.

మరి.. హిమ మనసులో ఇంకా నువ్వే ఉన్నావు అని అనుకుంటున్నావా? తన మనసులో నీ మీద ప్రేమ ఉన్నా లేనట్టు నటిస్తోందని అనుకుంటున్నావు కదా. ఒక పని చేయి. ఆడవాళ్లకు అసూయ ఎక్కువని.. ఈ ప్రేమ విషయంలోనే ఎక్కువగా ఉంటుందని అంటారు కదా.

హిమ ముందు నువ్వు ఇంకో అమ్మాయితో కాస్త చనువుగా ఉన్నట్టు నటించు. నువ్వు తన మనసులో ఉంటే.. నువ్వు వేరే అమ్మాయితో తిరిగితే ఖచ్చితంగా దగ్గరవుతుంది. ఒకవేళ దగ్గర కాలేదనుకో.. నువ్వు తన మనసులో లేనట్టే.. అని అంటుంది.

ఇంకో అమ్మాయితో క్లోజ్ గా ఉండటం అంటే.. అందుబాటులో ఉన్నది నేనే కదా అని అనుకుంటుంది శోభ. ఏంటి.. ఆలోచిస్తున్నావు ఐడియా బాగోలేదా అని అంటుంది. దీంతో మంచి ఐడియా. నేను తప్పకుండా దాన్ని ఫాలో అవుతాను అని అంటాడు నిరుపమ్.

మరోవైపు హిమ.. దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. హాస్పిటల్ కు అప్పుడే జ్వాల కూడా వస్తుంది. డాక్టర్ సాబ్.. బిజీగా ఉన్నారా అని అడుగుతుంది. లేదు జ్వాల అంటాడు. బాక్స్ ఇస్తే నేను వెళ్లిపోతాను అంటుంది జ్వాల. బయట ఉంది పదా ఇస్తాను అంటాడు.

అన్నట్టు హిమ ఎక్కడ ఉంది అంటాడు. దీంతో బయటే ఉంది అంటుంది. అయితే పదా అని తన చేయి పట్టుకొని హిమ దగ్గరికి వెళ్తాడు నిరుపమ్. వాళ్లను అలా చూసి సంతోషిస్తుంది హిమ. దేవుడా వీళ్లిద్దరు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని అనుకుంటుంది హిమ.

వెనక్కి తిరిగి శోభకు ఓకేనా అంటాడు. దీంతో శోభకు కోపం వస్తుంది. ఇతడికి ఇలా అర్థం అయిందా. నేను చెప్పింది నాతో క్లోజ్ గా ఉండమని. ఇలా చేశాడేంటి అని అనుకుంటుంది. మీరు చెప్తే పట్టించుకోలేదు. ఆ జ్వాలాను తక్కువ అంచనా వేశాను అని తర్వాత స్వప్నతో అంటుంది శోభ.

హిమ మీద కోపంతో ఇంకొక అమ్మాయితో క్లోజ్ గా ఉండమని నిరుపమ్ కు ఐడియా నేనే ఇచ్చాను అని చెబుతుంది శోభ. నిరుపమ్ ను వేరే అమ్మాయితో క్లోజ్ గా ఉండమని అంటే.. నాతో ఉంటాడని అనుకున్నా కానీ.. ఆ జ్వాలను తీసుకొని వెళ్తాడని నేను అస్సలు అనుకోలేదు అంటుంది శోభ.

దీంతో ఊహించాలి అంటుంది స్వప్న. మనం ఊహించే తీసుకునే స్టెప్పుల మీదనే మన గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయి అంటుంది స్వప్న. అవును.. దానికి కాస్త చనువు ఇచ్చినా నిరుపమ్ ను బుట్టలో వేసుకుంటుంది అని అంటుంది శోభ.

అందుకే.. తొందరగా నువ్వు ఏదో ఒకటి చేయి అంటుంది. కట్ చేస్తే.. జ్వాల, నిరుపమ్ ఇద్దరూ కేఫ్ కు వెళ్తారు. అక్కడికి హిమ కూడా వస్తుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement