Intinti Gruhalakshmi 26 May Today Episode : ప్రేమ్ కు మళ్లీ జాబ్.. అభి ఇంటికి వెళ్లిన తులసికి భారీ షాక్.. దీంతో అంకిత షాకింగ్ నిర్ణయం

Authored By Varun G | The Telugu News | Updated on : 26 May 2022, 9:30 am

Intinti Gruhalakshmi 26 May Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 26 మే 2022, గురువారం ఎపిసోడ్ 642 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తులసిని తీసుకొని తన ఇంటికి వస్తుంది అంకిత. అక్కడే ఉన్న గాయత్రి.. మీ అన్నయ్య గారి మీద దిగులుతో వచ్చావా వదిన అంటుంది. దీంతో తులసి షాక్ అవుతుంది. సడెన్ గా ఊడిపడితే అలా అడిగాను అంటుంది. అయినా.. నీతో వెటకారం చేయకూడదా ఏంటి అని అంటుంది గాయత్రి. దీంతో అయ్యో.. ఎంత మాట ఏం కాదు.. మీరు అనొచ్చు అంటుంది తులసి. మరోవైపు ఎలా ఉన్నావు అభి అని అడుగుతుంది తులసి. బిజీగా ఉన్నావా.. ఫోన్ చేసినా మాట్లాడటం లేదు అంటుంది. దీంతో అవును అంటాడు అభి. తను కొద్ది రోజుల్లో ఎంత ఎత్తుకు ఎదిగిపోతాడో చూస్తూ ఉండు అంటుంది గాయత్రి.

intinti gruhalakshmi 26 may 2022 full episode

intinti gruhalakshmi 26 may 2022 full episode

దీంతో ఏ తల్లి అయినా తన కొడుకు ఎదిగితే చూసి ఆనందిస్తుంది. తనకు అంతకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది అంటుంది తులసి. చివరకు తులసి పరువు తీసేందుకు గాయత్రి చాలా ప్రయత్నిస్తుంది. తను ఫ్యాక్టరీ నుంచి బయటికి వచ్చేసిందని అడుగుతాడు గాయత్రి భర్త. ఇప్పుడు ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో అందరిలో అలా అడిగితే తను ఏం చెబుతుంది అండి అని అంటుంది గాయత్రి. దారిన పోయేవాళ్లను పిలిచి అదేదో సంగీతం నేర్పిస్తోంది అంటూ తన పరువు తీస్తుంది. అంకిత వద్దు అని తన తల్లిని వారిస్తుంది. అభికి కోపం వచ్చి అక్కడి నుంచి లేస్తాడు. దీంతో అభి దగ్గరికి వెళ్లి.. మీ ఆంటి మాటలకు నేను ఎక్కడ రెచ్చిపోతానో అని నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా. ఆమె అడిగిన ప్రతి ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉంది. కానీ.. చెప్పను. ఎందుకంటే.. నా బిడ్డ ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు అంటుంది తులసి.

నేను ఇక్కడికి వచ్చింది.. నీ సంతోషాన్ని చూడటానికి కానీ.. నీ మొహంలో కంగారు చూడటానికి కాదు అంటుంది తులసి. వస్తానురా.. కానీ జాగ్రత్త అని చెప్పను. ఎందుకంటే ఈ అమ్మ కంటే ప్రేమగా చూసుకునే మనుషుల మధ్య ఉన్నావు. మీ అమ్మను మరిచిపోయేలా చేసే మనుషులు నీ చుట్టూ ఉన్నారు. అదృష్టవంతుడివి. ఇలాంటి అదృష్టం నూటికో కోటికో ఒక్కరికే వస్తుంది అని చెప్పి వెళ్లొస్తాను అని అందరికీ చెబుతుంది.

అంకిత వస్తానమ్మా అంటుంది. వెళ్లొస్తాను వదిన అంటుంది. చూశావా.. ఆస్తి వాసన రాగానే.. ఎలా పసిగట్టి ఇక్కడికి వచ్చిందో అని అంటుంది గాయత్రి. దీంతో అంకిత.. గాయత్రిపై సీరియస్ అవుతుంది. తను రాలేదు.. నేను ఫోర్స్ చేస్తే వచ్చింది అంటుంది.

Intinti Gruhalakshmi 26 May Today Episode : మళ్లీ పాట రాసే అవకాశం సంపాదించిన ప్రేమ్

మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ కు సమస్య వస్తుంది. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి.. తన సినిమాలో పాట రాస్తేనే మ్యూజిక్ డైరెక్టర్  గా ఉంచుతానని అంటాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాదు. రేపటి లోగా పాట రాస్తేనే నీకు ఈ సినిమాలో చాన్స్ అని చెప్తాడు. అప్పుడే ప్రేమ్ ఆఫీసుకు వెళ్తాడు.

ప్రేమ్ వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ ను కలుస్తాడు. మళ్లీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు మ్యూజిక్ డైరెక్టర్. జాబ్ కావాలని బతిమిలాడుతాడు ప్రేమ్. దీంతో ఎలాగూ పాట రాయాలి కాబట్టి.. ఇప్పటి నుంచి బుద్ధిగా ఉండు అని జాబ్ లోకి తీసుకుంటాడు మ్యూజిక్ డైరెక్టర్.

వెంటనే ఈ విషయం శృతికి చెప్పాలని శృతికి ఫోన్ చేస్తాడు ప్రేమ్. మరోవైపు మ్యూజిక్ డైరెక్టర్ కు బాక్స్ ఇచ్చిరా అని చెప్పి ఆఫీసుకు వెళ్లు అని చెబుతుంది ఇంటి ఓనర్. దీంతో సరే అంటుంది శృతి. ఇంతలో శృతికి ప్రేమ్ ఫోన్ చేస్తాడు. తనకు ఉద్యోగం వచ్చిందని.. ఇప్పుడు అదే ఆఫీసులో ఉన్నా అని చెబుతాడు.

దీంతో శృతి షాక్ అవుతుంది. ఇప్పుడు అక్కడికి వెళ్తే నన్ను ప్రేమ్ చూస్తాడు.. ఇప్పుడు ఎలా అని అనుకుంటుంది. మరోవైపు ఇంటికి లేట్ గా వెళ్లేసరికి.. తులసిపై చిరాకు పడతారు పరందామయ్య, అనసూయ. దీంతో అభి కలిస్తే వాళ్ల ఇంటికి వెళ్లాను అంటుంది.

తను బాగా మాట్లాడాడని అబద్ధం చెబుతుంది తులసి. అప్పుడే అక్కడికి వచ్చిన అంకిత.. తులసి అబద్ధాలు చెప్పడం చూసి షాక్ అవుతుంది. నన్ను చూడగానే వాడు గట్టిగా హత్తుకున్నాడు. నేను వెళ్లగానే నాకు భోజనం వడ్డించారు. కొసరి కొసరి వడ్డించారు.. అంటుంది తులసి.

పెద్దన్నయ్య ఇంత మారిపోయాడంటే నాకు నమ్మాలనిపించడం లేదు అంటుంది దివ్య. అంటే.. మీ అమ్మ అబద్ధం చెబుతోంది అంటావా అని అంటుంది అనసూయ. దీంతో అవును.. ఆంటి అబద్ధాలే చెబుతోంది అని అక్కడికి వచ్చిన అంకిత అంటుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.

ఇంట్లో వాళ్లకు నిజాలు దాచి లేనిపోనివి కల్పించడం తప్పు ఆంటి అంటుంది అంకిత. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Advertisement

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి