Karthika Deepam 27 July Today Episode : హిమ ఏం ప్లాన్ చేస్తుంది… నిరుపం, శౌర్య కలిసిపోతారా.!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: July 27, 2022, 10:30 am

Karthika Deepam 27 July Today Episode : కార్తీకదీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు తాజాగా విడుదలైంది 27 బుధవారం ఎపిసోడ్ 1415 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం… నిరుపం బావ మా ఇంటికి లగేజ్ తో వచ్చాడు అని ప్రేమతో చెప్తుంది. ప్రేమ్ నేనున్నాను కదా అన్ని చూసుకుంటాను అని హిమకు ధైర్యం చెప్తాడు. స్వప్న తన భర్తతో నిరూపమని ఎలాగైనా ఇంటికి తీసుకురండి. అని గొడవ పడుతుంది.స్వప్న వాళ్ళ జంట గొడవ పడుతుంటే శోభ మాత్రం ఆనందంతో పొంగిపోతూ ఉంటుంది. కట్ చేస్తే.. ఆనంద్ రావు, సౌందర్య నిరుపం ఎలా వచ్చేసాడు ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం సౌర్యకేమో కోపం వస్తుంది. ఏం చేద్దామని ఆనందరావు అడుగుతాడు. ఏమోనండి అంతా ఆ భగవంతుడు మీద భారం వేద్దాం అని అనుకుంటారు. హిమ కూడా నిరూపం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు నిరుపం బావ ఇంటికి వచ్చాడు సౌర్య మేమిద్దరం మాట్లాడేది చూస్తే ఇంకా సాధ్యమైనంతవరకు నేను నిరూపం బావకి దూరంగా ఉండాలి.అని అనుకునే లోపే నిర్పం హిమ దగ్గరికి వస్తాడు.

తను హిమకు జీన్స్ , టీ షర్ట్ తీసుకొచ్చి తనతో సరదాగా మాట్లాడుకుంటూ వేసుకోమని చెప్తూ ఉంటాడు. కానీ హేమ నాకొద్దు… బావా నాకు ఎలాంటి ఇష్టం ఉండదు.. అని కొంచెం చిరాకు పడుతూ ఉంటుంది. కానీ నీర్పం కచ్చితంగా వేసుకోవాల్సిందే నా భార్యని నేను ఈ డ్రెస్ లో చూడాలి అని అంటాడు. నువ్వు ఈ డ్రెస్ వేసుకో పోతే నేను సౌర్య దగ్గరికి వెళ్లి చెప్తాను హిమ డ్రెస్ వేసుకోమంటే వేసుకోవట్లేదు, నువ్వైనా చెప్పవా అని అంటాను అంటాడు. అప్పుడు హిమ వద్దులే బావ వేసుకుంటా అని వెళ్ళిపోతుంది. శౌర్య కూడా అప్పుడు వరకు అక్కడే సరదాగా బయట తిరుగుతూ ఉంటుంది. హిమ ఆ డ్రెస్ వేసుకొని వస్తుంది. అప్పుడు నిరూపం తనని ఈ డ్రెస్ లో చాలా బాగున్నావని,పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు. ఐ లవ్ యు అని గట్టిగా చెప్తాడు. అప్పుడు సౌర్య వాళ్ళిద్దర్నీ చూస్తుంది. అది తట్టుకోలేక సౌర్య ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతుంది. అప్పుడు సౌందర్య ఆనందరావు కూడా మేము కూడా నీతో పాటు వస్తాము.

karthika deepam 27 july 2022 full episode

karthika deepam 27 july 2022 full episode

ఇన్ని రోజులు సౌర్య ను వదిలేసి ఉన్నాము. ఇప్పుడు హిమ ను వదిలేసి ఉందాము. అని మేము కూడా వస్తాం మీతో పాటు అని చెప్తారు పదమ్మ అని అంటారు. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు నానమ్మ… మీ మనవరాలు దగ్గర మీరు ఉండండి. మీరు ఇంటిని ఎందుకు వదిలేసి వస్తారు. నువ్వు ఉంటానంటే మేము కూడా ఉంటాము.. అని తనని ఆపుతారు. కట్ చేస్తే స్వప్న, శోభ నిరిపంతో పెళ్లి గురించి మాట్లాడుకుంటూ ఏదో ఒక ప్లాన్ చేయాలి. ఆంటీ అని అనుకుంటారు. కట్ చేస్తే హిమ క్లినిక్ లో కూర్చొని నిరూపం అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది.

హిమ, సౌర్యాని నిరూపముని ఎలాగైనా కలపాలి.. అని, వాళ్ల నాయనమ్మకి ఫోన్ చేసి వాళ్ళని క్లినిక్ కి రమ్మని చెప్తుంది. సౌర్య ఆటో తీసుకొని బయటికి వెళ్లడానికి ట్రై చేస్తుంది. కానీ తన ఆటో పాడవుతుంది అప్పుడు తను ఇంట్లోకి వస్తుంది. నిరుపం కూడా క్లినిక్ కి వెళ్లడానికి బయటికి వచ్చి ఆటోను చూస్తూ సౌర్యని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. కారు టైరు పంచర అయి ఉంటుంది. ఇప్పుడు అతను కూడా ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లో నిర్పం, శౌర్య వాళ్ళిద్దరు మాత్రమే ఉంటారు. వాళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆడాల్సిందే…

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp