Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక్ కి ట్రీట్మెంట్ చేపిస్తున్న వంటలక్క… దీపని గుర్తుపట్టిన కార్తీక్… ఇక మోనిత ఏం చేయబోతోంది.!? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక్ కి ట్రీట్మెంట్ చేపిస్తున్న వంటలక్క… దీపని గుర్తుపట్టిన కార్తీక్… ఇక మోనిత ఏం చేయబోతోంది.!?

Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1468 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత కార్ డిక్కీలో ద శౌర్య దాక్కుంటుంది, మోనిత కారు ఆపి దిగి వెళ్ళిపోతూ ఉండగా.. కారు డిక్కీ లోంచి సౌర్య బయటకు వస్తుంది. అప్పుడు సౌర్యని చూసిన మౌనిత ఒక్కసారిగా కంగారు పడిపోతూ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :27 September 2022,10:00 am

Karthika Deepam 27 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1468 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… మౌనిత కార్ డిక్కీలో ద శౌర్య దాక్కుంటుంది, మోనిత కారు ఆపి దిగి వెళ్ళిపోతూ ఉండగా.. కారు డిక్కీ లోంచి సౌర్య బయటకు వస్తుంది. అప్పుడు సౌర్యని చూసిన మౌనిత ఒక్కసారిగా కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడు సౌర్యను ఏంటమ్మా నువ్వు ఇక్కడ కార్ డిక్కీలో ఎందుకు దాక్కున్నావ్ అని అడుగుతుంది. అప్పుడు శౌర్య మీ కారు అనే తెలియదు ఆంటీ. అయినా మీరు ఇక్కడ ఉన్నారు ఏంటి అని అడుగుతుంది. అప్పుడు మౌనిత బాధపడుతూ మీ అమ్మానాన్న జ్ఞాపకాలను వదలేక ఇక్కడే ఉన్నాను అని చెప్తుంది. అప్పుడు సౌర్య నేను కూడా వాళ్ళని వదలేక వాళ్ళు బ్రతికే ఉన్నారని నేను వాళ్ళని వెతుకుతూ ఉన్నాను ఆంటీ అని చెప్తుంది. అప్పుడు మౌనిత వాళ్లు లేరమ్మ నా చేతుల మీదగా వాళ్ళని దహన సంస్కారాలు చేయించాను అని చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సౌర్య లేదంటే వాళ్ళు బ్రతికే ఉన్నారు అని ఒక్కసారిగా కుప్ప కూలీ పోయి ఏడుస్తూ ఉంటుంది.

అప్పుడు మౌనిత శౌర్యకి సర్ది చెప్పి మీ నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు శౌర్య తను చెప్పిన మాటలు నమ్ముతుంది. ఇక దాంతో మౌనిత శౌర్యని తీసుకొని వెళుతుంది. కట్ చేస్తే కార్తీక్ డ్రామా కోసం ఎదురు చూస్తూ ఉండగా… కార్తీకదీపం టైటిల్ గురించి మాట్లాడుతూ ఇది ఒక్క నిజమైన భార్యాభర్తల కథ అంట అని అంటూ ఉండగా.. ఒక్కసారిగా కార్తీక్ లేచి వంటలక్క దగ్గరికి వెళ్లి ఆ టైటిల్ ఏంటి నేను కార్తీక్.. నువ్వు దీప.. మనిద్దరం భార్యాభర్తలమా అని తెలియజేస్తున్నావా. అని తనపై కోప్పడుతూ ఉండగా.. డాక్టర్ ఆగండి సార్ తన భర్త పేరు కూడా కార్తికే అందుకే కార్తీకదీపం అనే టైటిల్ పెట్టింది. అయిన కాసేపు ఆగితే మీకే అర్థమవుతుంది. ఆవిడ భర్త ఎవరు అని అంటూ ఉంటాడు. అప్పుడు సరే అని కార్తీక్ వెళ్లి అక్కడ కూర్చుంటాడు. కట్ చేస్తే సౌందర్య ఆనందరావు, హిమను తీసుకుని వస్తూ.. హిమ ముందు రెస్టారెంట్ ఉంది అక్కడ ఆపుతాను ఏం కావాలో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు హిమ శౌర్య ఇక రాదు అని నాకు అర్థమైంది అని అంటూ ఉంటుంది.

karthika deepam 27 september 2022 full episode

karthika deepam 27 september 2022 full episode

అప్పుడు సౌందర్య సౌర్యని తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు దాని గురించి మర్చిపో అని అంటూ ఉంటుంది. కట్ చేస్తే దీప నాటకం మొదలవుతుంది. తన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడినుంచి మొదలు పెడుతుంది. ఇక కార్తీక్ పెళ్లి చేసుకుంటాడు. వాళ్లు హనీమూన్ కి వెళ్తారు. అక్కడ రచయిత పరిచయం అవుతాడు. అలా రచయిత గురించి మౌనిత లేనిపోనివి అన్ని చెప్పి తన ప్రెగ్నెంట్ కి కారణం రచయితే అని నమ్మేలా చేస్తుంది. అప్పుడు కార్తీక్ కూడా నమ్మి తన ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని గట్టిగా చెప్తూ ఉంటాడు. అప్పుడు తన కూడా కార్తీక్ ని చీ కొట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక రేపటి ఎపిసోడ్లో దీప వెళ్ళిపోతూ ఉండగా.. ఒక్కసారిగా కార్తీకి గతమంతా గుర్తుకొస్తుంది. అప్పుడు ఆగు దీప అని ఒక్కసారిగా లేచి స్టేజ్ దగ్గరికి వెళ్లి కళ్ళు తిరిగి కిందపడిపోతాడు. తర్వాత కార్తీక్ ని ఆస్పత్రికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా… అక్కడికి మౌనిత కూడా వస్తుంది. ఇక కార్తీక్ స్పృహలో నుంచి బయటికి వచ్చి దీప అని అంటూ ఉంటాడు. అప్పుడు దీప సంతోష పడిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు వేచి చూడాల్సిందే…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది