Karthika Deepam 28 Sep Today Episode : స్పృహలోకి వచ్చి.. నా దీప ఏది అంటున్న కార్తీక్… ఇక ఊరు వదిలి పారిపోతున్న మోనితా…
Karthika Deepam 28 Sep Today Episode : కార్తీక దీపం ఈ సీరియల్ ఎన్నో మలుపులతో అభిమానులు ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ ఈరోజు తాజాగా రిలీజ్ అయింది. ఈరోజు ఎపిసోడ్ 1469 హైలెట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… దీప తన జీవితం ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి నాటకం మొదలు పెడుతుంది. అలా మొదలుపెట్టిన దీప కార్తీక్ ని పెళ్లి చేసుకుని సరదాగా హానీ మున్ కి వెళ్లి అక్కడ రచయితతో పరిచయమైన దీప ను చూసిన మౌనిత ఎలాగైనా దీపని, కార్తిక్ విడిపోయేలా చేయాలని క్రమంలో దీపపై లేనిపోనివి అన్ని చెప్పి కార్తీక్ నమ్మేలా చేస్తుంది. కార్తీక్ మౌనిత చెప్పిన మాటలు నమ్మి దీప కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి నేను కాదు అని తన ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని చెప్తూ ఉంటాడు. అప్పుడు దీప నేనేంటో తెలియని మనిషి దగ్గర నేను దాసిలా ఉండాలనుకున్నాను చూడు.. అది తప్పు నన్ను ఇంతలా బాధపెట్టిన ఈ మనిషి మొగుడైతే ఏంటి.? ఏ మొగాడు అయితే ఏంటి.? దేవుడైతే ఏంటి.? అని గట్టిగా కార్తీక్ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది.
అలా ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దీప కు ఇద్దరు కమలలు పుడతారు. అలా పిల్లలు పెరిగి పెద్దవుతారు. సౌర్యని కార్తికే చదివిస్తాడు. అలా మౌనిత అంత చేసిందని కార్తీక్ తెలుసుకుంటాడు.. ఇక కార్తీక్ దీప నున్ను క్షమించు అని అడుగుతున్న క్రమంలో మళ్లీ మౌనిత వచ్చి ఇంకొక ట్విస్ట్ ఇస్తుంది. ఇక తర్వాత కొన్ని రోజులు అలా సాగిపోతుంది. ఇక తర్వాత మౌనిత కృత్రిమ గర్భం దాల్చిందని తెలుసుకున్న కార్తీక్ దీపని పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్తాడు. అక్కడ ఎంజాయ్ చేస్తన్న క్రమంలో దీప నీ కార్లో ఎక్కించుకుని హీమా డ్రైవింగ్ చేస్తూ ఉండగా.. ఆ కారు లోయలోకి పడిపోతూ ఉండగా… కార్తీక్ కూడా అందులోకి ఎక్కి ముగ్గురు కలిసి లోయలో పడిపోతారు. ఇక అప్పుడు కార్తీక్ అదంతా చూస్తూ.. గతాన్ని గుర్తు చేసుకుంటూ దీప నా వంటలక్కన అని నాటకంలో లీలమైపోతారు. తన పిల్లల్ని దీప ని చూస్తూ మెల్లమెల్లగా గతాన్ని గుర్తు చేసుకుంటూ.. చివర్లో కార్ యాక్సిడెంట్ చూసిన కార్తిక్ ఒక్కసారిగా లేచి దీప.. దీపా.. ఆగు అని అరుస్తూ స్టేజ్ దగ్గరికి వెళ్లి కింద పడిపోతాడు. కట్ చేస్తే మౌనిత కార్తీక్ ని దీపకి దూరంగా తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ కార్తీక్ ని వెతుకుతూ ఉంటుంది.
అప్పుడు శివ సార్ లేడు మేడం అని అంటాడు. అప్పుడు మౌనిత సారు బయటికి వెళ్తే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ నీకువేల వేల జీతం ఇచ్చేది దీనికేనా.. అని తిడుతూ ఉంటుంది. అప్పుడు శివ ఎందుకు మేడం కంగారుపడుతున్నారు సార్ ఒక్కడే వెళ్లలేదు.. ఆ వంట లెక్క వచ్చి తీసుకెళ్ళింది.. మన కాలనీలోనే ఉన్నారు.. అక్కడ వంటలక్క ఏదో నాటకం వేస్తుంది అంట.. అది చూడడానికి డాక్టర్ బాబు కూడా వెళ్లారు అని అనగానే.. మౌనిత శివ చెంప పగలగొడుతుంది.. ఆ వంటలక్క తీసుకెళ్తుంటే నువ్వేం చేస్తున్నావ్ అని తిడుతూ అక్కడినుంచి కమ్యూనిటీ హాల్ కి వెళ్లి కార్తీక్ వెతుకుతూ ఉంటుంది. అప్పుడు శివ అసలు మేడం కచ్చితంగా సార్ భార్య కాదు అని అనుమాన పడుతూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్లో కార్తీక్ ని తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా.. అక్కడికి మోనిత వెళుతుంది. మోనిత కార్తీక్ అని అంటుండగా.. దీప దూరంగా ఉండు అని వార్నింగ్ ఇస్తుంది. ఇక కార్తీక్ స్పృహలోకి వచ్చి దీప అని అంటూ ఉంటాడు. ఇక మౌనిత నా పని అయిపోయినట్టే అని అనుకుంటూ ఉంటుంది. దీప మాత్రం సంతోషంతో పొంగిపోతూ ఉంటుంది. ఇక తర్వాతే ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్లు చూడాల్సిందే…