Karthika Deepam 29 April Today Episode : హిమ బొమ్మను గీత గీస్తుందా? తింగరే హిమ అని జ్వాలకు తెలిసి షాకింగ్ నిర్ణయం

Karthika Deepam 29 April Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 29 ఏప్రిల్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 1339 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. తింగరిని తీసుకొని గీత దగ్గరికి వస్తుంది జ్వాల. నేను తన చిన్ననాటి పోలికలు చెబుతాను. తన బొమ్మ గీసి ఇవ్వండి అంటుంది. దీంతో హిమకు టెన్షన్ పెరిగిపోతుంటుంది. తను ఎవరు అని అడుగుతుంది. దీంతో తను ఎవరో మాత్రం అడగకండి. నేను పోలికలు చెబుతాను. మీరు బొమ్మ గీసి ఇవ్వండి అని చెబుతుంది జ్వాల. ఆ తర్వాత తను పోలికలు చెబుతుంటే గీత ఫోన్ లో రికార్డు చేసుకుంటుంది. మీరు ఈ హెల్ప్ చేస్తే నేను జీవితాంతం మిమ్మల్ని మరిచిపోలేను అంటుంది జ్వాల. ఆ తర్వాత అక్కడి నుంచి జ్వాల, హిమ వెళ్లిపోతారు.

Advertisement
karthika deepam 29 april 2022 full episode
karthika deepam 29 april 2022 full episode

కట్ చేస్తే.. నిరుపమ్ కు ఏం చేయాలో అర్థం కాదు. హిమతో సరదాగా నాగార్జున సాగర్ వెళ్దామనుకుంటే ఇలా జరిగిందేంటి.. పాపం హిమ కూడా డిజప్పాయింట్ అయినట్టుంది అని అనుకుంటాడు. ఇంతలో ప్రేమ్ ఫోన్ చేస్తాడు. హాయిరా ఎలా ఉన్నావు. గుడ్ న్యూస్ నాకు చెప్పలేదేంటి. పెళ్లి కొడుకువు అవుతున్నావట కదా. మమ్మీ నీకు పెళ్లి సంబంధం చూసిందట కదా. మమ్మీ చూసిన పెళ్లి సంబంధం ఎలా ఉంటుందో నేను ఊహించగలను అంటాడు ప్రేమ్. అసలు.. ప్రేమ్ ఏం మాట్లాడుతున్నాడో నిరుపమ్ కు అర్థం కాదు. తనకు పెళ్లి చూపులు ఏంటి అని అనుకుంటాడు. ప్రేమ్ ఏదేదో మాట్లాడుతున్నాడు అని అనుకుంటుండగానే స్వప్న వస్తుంది. నేను నీ తల్లిని. ఏది కరెక్టో.. ఏది తప్పో నాకు బాగా తెలుసు. కీర్తి నా ఫ్రెండ్. కీర్తి, తన కూతురు వస్తున్నారు. వాళ్ల ముందు నా పరువు తీయకు అంటుంది స్వప్న.

నువ్వు ఇలా మొండికేస్తే.. నేనే ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటుంది స్వప్న. ఇలా ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి అంటాడు. దీంతో నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంటుంది. నువ్వు ఇంకేం మాట్లాడొద్దు. చెప్పింది మాత్రమే విను. ఆ అమ్మాయికి  నీ హెయిర్ స్టయిల్ తెగ నచ్చిందంట తెలుసా?

నువ్వు ఇక ఏం ఆలోచించకు. వాళ్లు వచ్చాక నువ్వు లేకపోతే నా పరువు పోతుంది. నేను ఎంత మొండిదాన్నో నీకు బాగా తెలుసు. పదా అంటుంది స్వప్న. దీంతో మమ్మీ కోసం వెళ్లి కూర్చుంటాను. తర్వాత ఏం జరిగినా నేను అస్సలు ఒప్పుకోను అని అనుకుంటాడు నిరుపమ్.

ఇంతలో సౌందర్య అక్కడికి వస్తుంది. సౌందర్యను చూసి షాక్ అవుతుంది స్వప్న. నిరుపమ్ కు సంతోషం వేస్తుంది. ఏంటి స్వప్న.. ఏంటి విశేషాలు.. వంట అయిందా. ఏంటి ఇవాళ స్పెషల్. ఏరా డాక్టర్ మనవడా.. హాస్పిటల్ కు వెళ్లలేదా అని అడుగుతుంది.

Karthika Deepam 29 April Today Episode : చైత్రతో నిరుపమ్ కు రాఖీ కట్టించిన సౌందర్య

దీంతో లేదు అమ్మమ్మ అంటాడు. ఇంటికి అందరినీ దూరంగా పెట్టినా.. ఇంటిని మాత్రం చాలా క్లీన్ గా ఉంచుతావు.. నువ్వు గ్రేట్. ఏరా డాక్టర్ మనవడా.. ఏం చూస్తున్నావు. మీ తాతయ్య కోసమా. ఇద్దరం కలిసే వచ్చాంలే అంటుంది సౌందర్య.

నేను మీ అమ్మలా కాదు లేరా.. చిన్న విషయానికే బంధాన్ని, భర్తను కాదనుకోలేను కదా అంటుంది. ఇంతలో ఆనంద రావు వస్తాడు. ఏంటండి మీరు.. మీకోసం మీ మనవడు, ముద్దుల కూతురు చూస్తున్నారు. కూర్చోండి అంటుంది సౌందర్య.

స్వప్న.. కాఫీలు, కూల్ డ్రింక్ లు అటువంటివేమీ వద్దు అని అంటుంది. పిలవని పేరంటానికి వచ్చారేంటి అని అంటుంది స్వప్న. ఇంతలోపెళ్లి వాళ్లు వస్తారు. దీంతో స్వప్న ఏం మాట్లాడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అడుగుతాడు ఆనంద రావు.

చూస్తూ ఉండండి… ఏం జరుగుతుందో అంటుంది సౌందర్య. ఇంటికి తెలిసిన వాళ్లు వస్తే.. వెళ్లి కాఫీనో.. జ్యూసో ఏదో ఒకటి ఇవ్వు అని అంటుంది. ఇంతలో చైత్ర కూడా వస్తుంది. చైత్రను పిలిచి.. నిరుపమ్ అన్నయ్యకు రాఖీ కట్టి స్వీట్ తినిపించు అంటుంది సౌందర్య.

దీంతో చైత్ర అతడికి రాఖీ కట్టబోతుండగా మమ్మీ అంటుంది స్వప్న. దీంతో ఎవ్వరూ మాట్లాడొద్దు. ఎదురు మాట్లాడటం నాకు నచ్చదు అంటుంది సౌందర్య. ఇంతలో చైత్ర.. తనకు రాఖీ కడుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పెళ్లి వాళ్లు వెళ్లిపోతారు.

ఆ తర్వాత నిరుపమ్ ఆసుపత్రికి వెళ్లిపోతాడు. ఆనంద రావు ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్తాడు. ఏంటి స్వప్న అలా చూస్తున్నావు. నేను ఎంత తిట్టినా మాట్లాడని మా మమ్మీ.. నాకు షాకిచ్చిందేంటి అని అనుకుంటున్నావా. నా కూతురువే కదా అని నోటికొచ్చినట్టు తిడితే పడ్డాను.

కానీ.. ఇప్పుడు ఎవరో ఒకరిని తీసుకొచ్చి నా మనవడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటే చూస్తూ ఊరుకోను. కష్టం, నష్టం ఒక్కరికే కాదు.. నా మనవడికి, నా మనవరాలికి అంటుంది. నిరుపమ్ ఒక్క నా మనవరాలి మెడలోనే తాళి కడతాడు. ఇది నా చాలెంజ్. ఇదే జరుగుతుంది అని అంటుంది సౌందర్య.

అసలు.. నీ ధైర్యం ఏంటి అని అంటుంది స్వప్న. నువ్వు ఎన్ని చెప్పినా.. హిమ నా ఇంటికి పని మనిషిగా కూడా రాదు అంటుంది. వస్తుంది.. వచ్చేలా చేస్తా అంటుంది సౌందర్య. హిమే.. నిరుపమ్ భార్య.. ఇది తథ్యం. భూమి ఆకాశాలు ఒక్కటైనా నువ్వు ఆపలేవు. అది నీ తరం కాదు అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

  • Also Read

Advertisement