Karthika Deepam 3 March Today Episode : ఆనంద్ ను దత్తత ఇచ్చిన దీప, కార్తీక్.. ఈ విషయం తెలిసి రచ్చ రచ్చ చేసిన మోనిత.. ఇంతలో మరో ట్విస్ట్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 3 March Today Episode : ఆనంద్ ను దత్తత ఇచ్చిన దీప, కార్తీక్.. ఈ విషయం తెలిసి రచ్చ రచ్చ చేసిన మోనిత.. ఇంతలో మరో ట్విస్ట్

Karthika Deepam 3 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1290 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నా కార్తీక్ నా ఇంటికొచ్చాడు. నా ఇంట్లో కాలు పెట్టాడు. అంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది చెప్పండి అంటుంది మోనిత. నో గుసగుసలు.. మోనిత మొగుడు ఏంటి అనే సందేహాలు వచ్చినట్టున్నాయి కదా. దీపక్క అభిమానులారా.. కార్తీక్ దీపక్కకు మాత్రమే […]

 Authored By gatla | The Telugu News | Updated on :3 March 2022,10:30 am

Karthika Deepam 3 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 3 మార్చి 2022, గురువారం ఎపిసోడ్ 1290 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు నా కార్తీక్ నా ఇంటికొచ్చాడు. నా ఇంట్లో కాలు పెట్టాడు. అంతకంటే గొప్ప పండుగ ఏముంటుంది చెప్పండి అంటుంది మోనిత. నో గుసగుసలు.. మోనిత మొగుడు ఏంటి అనే సందేహాలు వచ్చినట్టున్నాయి కదా. దీపక్క అభిమానులారా.. కార్తీక్ దీపక్కకు మాత్రమే కాదు నాకూ మొగుడే అంటుంది మోనిత. ఇంతలో దీప అక్కడికి వచ్చి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఏంటే అన్నావు.. మళ్లీ అను. వారణాసి చీపురుకట్ట తీసుకురా.. నీకు సన్మానం చేస్తా. డాక్టర్ బాబు నీ ఇంటికి వస్తే నీకు మొగుడు అయిపోతాడా. అడ్డదారిలో బిడ్డను కన్నావు.. అడ్డగోలుగా మాట్లాడుతున్నావు. అడ్డంగా నరికేస్తా జాగ్రత్త. మొగుడంట మొగుడు. తన మెడలో తానే తాళి కట్టుకుంది. బిడ్డను పోగొట్టుకుంది. జైలుకు వెళ్లొచ్చింది. ఇప్పుడేమో ప్రజావైద్యశాల తెరిచి ప్రజా సేవ చేస్తోంది ఇది మేడం గారి జీవిత చరిత్ర అంటుంది దీప.

karthika deepam 3 march 2022 full episode

karthika deepam 3 march 2022 full episode

ఏంటి దీపక్క.. నువ్వు చెప్పినవన్నీ చేశాను.. అయినా కార్తీక్ తో నేను ఒక డీల్ పెట్టుకున్నాను. దాని ప్రకారం నా బిడ్డను తిరిగి తెచ్చివ్వాలి. తిరిగి ఇవ్వకపోతే చాలా జరుగుతాయి దీపక్క. నువ్వు కొట్టినా.. తిట్టినా.. కనుబొమ్మలు ఎగరేసినా నేను ఇలాగే మాట్లాడుతాను. నా బిడ్డను నాకు ఇచ్చేదాకా కార్తీక్ నావాడే అనుకుంటాను అంటుంది మోనిత. దీంతో ఛీ.. ఛీ.. బురదలో తిరిగేదానితో మాట్లాడితే ఇలాగే ఉంటుంది అంటుంది దీప. దీంతో బురద కాదు అక్క తామరపువ్వును. బిడ్డను వెతకండి.. లేదంటే మీ ఇంట్లో ఉన్న బిడ్డను నాకివ్వండి అంటుంది మోనిత. నీ తోక ఎలా కట్ చేయాలో నాకు బాగా తెలుసు. నీకు రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ఇలా మిడిసి పడుతున్నావు. నీ సంగతి చూడకపోతే నా పేరు దీపే కాదు అని చెప్పి అక్కడి నుంచి దీప వెళ్లిపోతుంది.

మీ ఇంట్లో పెంచుకుంటున్న బాబును నాకిచ్చేయండి అని అన్న మోనిత మాటలే కార్తీక్ కు గుర్తొస్తుంటాయి. ఇంతలో సౌందర్య వస్తుంది. జరగాల్సివేవో జరుగుతాయి. నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు అంటుంది సౌందర్య. పెద్దోడా కష్టాలు వచ్చినప్పుడే మన ధైర్యం ఏంటో తెలుస్తుంది. మొండిగా ఎదురించాలి.. అధైర్య పడకూడదు అంటుంది సౌందర్య.

నువ్వన్నది కరెక్టే మమ్మీ. ఒకసారో రెండు సార్లు సమస్యలు వస్తే ఓకే కానీ.. జీవితాంతం సమస్యలు వస్తే ఏమనుకోవాలి అని అంటాడు కార్తీక్. మోనిత దగ్గర్నుంచి వస్తుంది దీప. ఏడుస్తూ ఉండటం చూస్తారు ఆనందరావు, సౌందర్య. ఎక్కడికెళ్లావే ఈ టైమ్ లో. ఎందుకు ఏడుస్తున్నావే అంటారు.

Karthika Deepam 3 March Today Episode : దీప ఏడుపును చూడలేక భలే ప్లాన్ వేసిన సౌందర్య

ఏడుపు కాక ఇంకేం మిగిలింది అత్తయ్య నాకు. ఇప్పుడే బస్తీ నుంచి వస్తున్నాను అంటుంది దీప. అక్కడ జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దీంతో సౌందర్య, ఆనంద రావు షాక్ అవుతారు. ఆ మోనితకు అన్నీ తెలిసి బిడ్డను అడ్డుపెట్టుకొని మనల్ని ఆడిస్తోంది అత్తయ్య అంటుంది దీప.

అన్నీ తెలిసి నలిగిపోవడం తప్పితే ఏం చేయలేకపోతున్నాను అంటుంది దీప. నా బతుకు ఏంటి అత్తయ్య ఇలా అయిపోయింది అంటుంది దీప. మనం ఏం చేయలేమా సౌందర్య అంటాడు ఆనంద రావు. దీంతో ఏడవకే. ఈ సౌందర్య ఉండగా నీకేం భయం లేదు అని ఏదో ప్లాన్ చెబుతుంది వాళ్లకు.

కట్ చేస్తే ఉదయమే బస్తీకి వస్తుంది సౌందర్య. అందరూ బాగున్నారా అని బస్తీవాళ్లను పలకరిస్తుంది. ఎన్నాళ్లైనా మీ అభిమానం మాత్రం తగ్గలేదు అంటుంది. మిమ్మల్ని ఓ కార్యక్రమానికి పిలవడానికి వచ్చా అంటుంది. తాడికొండ నుంచి కార్తీక్, దీప తీసుకొచ్చిన బాబును పిల్లలు లేని దంపతులకు దత్తత ఇస్తున్నాం. అందరూ తప్పకుండా రావాలి అని చెబుతుంది సౌందర్య.

అరుణ.. నువ్వు మోనిత ఇంట్లో పనిచేస్తున్నావట కద.. అంటుంది సౌందర్య. దీంతో అవునమ్మా.. ఖర్చులకు పనికొస్తాయని చేస్తున్నాను అని చెబుతుంది. సరే.. అందరూ రావాలి అని చెప్పి మోనిత ఇంటి వైపు చూస్తూ అక్కడి నుంచి బయలుదేరుతుంది సౌందర్య.

మరోవైపు పొద్దున్నే కార్తీక్ రెడీ అవుతాడు. ఎక్కడికి వెళ్తున్నావు కార్తీక్ అని అడుగుతుంది. దీంతో కొంచెం బయటికి వెళ్లి అక్కడి నుంచి హాస్పిటల్ కు వెళ్తా అంటాడు కార్తీక్. దీంతో ఈరోజు నువ్వు ఎక్కడికీ వెళ్లడం లేదు. ఈరోజు మనందరం కలిసి గుడిలో పూజకు వెళ్తున్నాం.. అంటుంది సౌందర్య.

నువ్వు బయటికి వెళ్లడానికి వీలు లేదు అంటుంది సౌందర్య. ఏంటి దీపా ఇది. మళ్లీ పూజలు ఏంటి.. అవతల పని ఉందని చెబుతున్నాను కదా అన్నా కూడా దీప వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు లక్ష్మణ్.. సౌందర్య ఇచ్చిన కార్డును మోనితకు చూపిస్తాడు.

దీంతో వాళ్ల ఇంట్లో ఉన్న పిల్లాడిని ఎవరికో దత్తత ఇస్తున్నారట. అందరినీ రమ్మని చెప్పారు అంటాడు లక్ష్మణ్. దీంతో మోనితకు కోపం వస్తుంది. అసలు ఏం జరుగుతోంది. కథేంటి ఇలా అడ్డం తిరిగింది. నా ఆనంద్ రావును దత్తత ఇవ్వడం ఏంటి అని అనుకుంటుంది.

ఇప్పుడు దత్తత ఇవ్వడానికి సిద్ధం అయ్యారంటే.. నా కొడుకు మీద వాళ్లకు ప్రేమ లేదా. ఇన్నాళ్లు అంత ప్రేమ చూపించిన వాళ్లు ఇప్పుడు ఎందుకు అలా చేస్తున్నారు అని అనుకుంటుంది మోనిత. వేరే ఏం ప్లాన్ వేశారు వీళ్లు అనుకుంటుంది మోనిత.

నా బిడ్డను అడ్డం పెట్టుకొని కార్తీక్ కు దగ్గరవ్వాలని నేను ప్రయత్నాలు చేస్తుంటే దత్తత ఇవ్వడం ఏంటి. నా బిడ్డను దత్తత ఇవ్వడానికి వీళ్లు ఎవరు. ఇప్పుడు నేను వెళ్లి నా బిడ్డ అని చెప్పలేను. దత్తత ఎలా ఇస్తారో నేనూ చూస్తాను. ఇప్పుడు ఆట ఆడించేది నేనే. నీ చేతుల్లో ఏం లేదు కార్తీక్.. అని అనుకుంటుంది మోనిత.

మరోవైపు సౌందర్య ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. వారణాసి.. రండి మేడం అంటాడు. అన్ని ఏర్పాట్లు చేశావా అంటే.. చేశాం మేడమ్. బస్తీ వాళ్లను పిలిచావా అంటే పిలిచాను మేడమ్ అంటుంది. మమ్మీ.. అసలు పూజ దేనికి చేస్తున్నామో చెప్పనేలేదు అని అడుగుతాడు కార్తీక్.

దీంతో ఏ పూజ అయినా అందరూ బాగుండాలనే కదా అంటుంది సౌందర్య. బస్తీ వాళ్లందరూ ఉండటాన్ని చూసి వీళ్లందరూ వచ్చారు ఏంటి అంటాడు కార్తీక్. బస్తీ వాళ్లతో పనేంటి అంటాడు. ఒక మంచి పని చేసేటప్పుడు అందరూ ఉండాలి కదా అంటుంది సౌందర్య.

కార్తీక్ కు మాత్రం ఏం అర్థం కాదు. పంతులు గారు మీరు కానివ్వండి అంటుంది సౌందర్య. ఇంతలో గుడికి పరిగెత్తుకుంటూ మోనిత వస్తుంది. ఆపండి.. అంటుంది. పీటల మీద కార్తీక్ దీప.. ఒడిలో బాబు. గుడిలో మీరు.. అసలేం జరుగుతోంది ఇక్కడ అని అడుగుతుంది మోనిత.

రా మోనిత. నిన్ను పిలవడం మరిచిపోయాను. మంచిదైంది నువ్వు రావడం అంటుంది సౌందర్య. దీంతో నేను రాలేదు. రప్పించారు నన్ను అంటుంది మోనిత. కార్తీక్.. ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. బాబును దత్తత ఇవ్వడం ఏంటి అని అడుగుతుంది మోనిత.

దీంతో కార్తీక్ షాక్ అవుతాడు. మా వాడు.. మా ప్రాణం అన్నావు కదా.. అంటుంది. బాబును దత్తత ఇవ్వడం ఏంటి మోనిత అంటాడు కార్తీక్. ఆహా.. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నావు అంటుంది మోనిత. గుడిలోకి వచ్చావు.. పూజ చేస్తున్నావు.. బాబును వేరే వాళ్లకు దత్తత ఇస్తున్నావు. మళ్లీ ఏంటా అని నన్నే అడుగుతున్నావా అంటుంది మోనిత.

మీ మమ్మీ గారు.. అదే ఆంటి గారు ఇదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా కార్డులు ప్రింట్ చేసి మరీ ఆహ్వానించింది అని చెబుతుంది మోనిత. దీంతో మమ్మీ ఏంటిది.. ఆనంద్ ను మనం దత్తత ఇస్తున్నామా.. నువ్వు కార్డులు పంచావా అని అడుగుతాడు కార్తీక్. దీంతో అవును కార్తీక్ అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది