Karthika Deepam 5 March Today Episode : చిక్ మంగళూరుకు టూర్ కు వెళ్లిన కార్తీక్, దీప.. ఇంతలో అనుకోని ప్రమాదం.. దీంతో సౌందర్య షాక్
Karthika Deepam 5 March Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 5 మార్చి 2022, శనివారం ఎపిసోడ్ 1292 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాకు తమ్ముడు కావాలి.. నాకు ఆనంద్ కావాలి అని వెక్కి వెక్కి ఏడుస్తుంది హిమ. కావాలి.. అంటుంది. దీంతో తన దగ్గరికి దీప వెళ్లబోతే నాకేం చెప్పొద్దు అంటుంది హిమ. నేనేం వినను అంటుంది. అందరూ ఏదో చేశారు. నా తమ్ముడిని ఎవ్వరికో ఇచ్చారు అంటుంది హిమ. నాకు ఆనంద్ కావాలి. నా తమ్ముడు నాకు కావాలి అంటుంది హిమ. బాబాయి.. పదా బాబాయి వెళ్దాం. ఎవ్వరికి ఇచ్చారో.. వాళ్లను బతిమిలాడి తెచ్చుకుందాం.. వెళ్దాం పదా బాబాయి అంటుంది హిమ. కానీ.. ఆదిత్య కదలడు. పిన్ని.. నువ్వు రా పిన్ని. బాబును తెచ్చుకుందాం అంటుంది హిమ. వద్దు హిమ అంటుంది శ్రావ్య.
చివరకు తాతయ్య దగ్గరికి వెళ్లి తాతయ్య పదా వెళ్దాం అంటుంది హిమ. కానీ.. ఆనంద రావు కూడా ఏం మాట్లాడడు. ఎవ్వరూ మాట్లాడరు ఏంటి.. తమ్ముడంటే ఎవ్వరికీ ప్రేమ లేదా అంటుంది హిమ. మాట్లాడండి అంటుంది. అయినా మీరెప్పుడు నిజం చెప్పారని. ఎప్పుడూ అబద్ధాలే. మీరు చెప్పకుంటే నేను తెలుసుకోలేనా. నేను తమ్ముడిని వెతికి పట్టుకుంటాను అని అంటుంది హిమ. శౌర్య.. నీకు తమ్ముడి మీద ప్రేమ లేనే లేదు కదా. లేదు కదా అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది హిమ. ఆ తర్వాత బాబు విషయంలో నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించరా పెద్దోడా అంటుంది సౌందర్య. వెక్కి వెక్కి ఏడుస్తుంది.
పిల్లలను తీసుకొని కొన్నాళ్లు ఎక్కడికైనా వెళ్లిరండి అంటుంది సౌందర్య. కట్ చేస్తే మోనిత తన ప్లాన్ ఫెయిల్ అయిందని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నలుగురిలో అవమానిస్తే చూస్తూ ఊరుకోవడానికి నేను అందరిలాంటి దాన్ని అనుకున్నారా. ఊరి జనం ముందు నన్ను అవమానిస్తారా.. చేతగాని దాన్ని చేసి నలుగురిలో నా పరువు తీస్తారా? నాకు కావాల్సింది నాకు దక్కకుండా మీకు కావాల్సింది మీరు తీసుకోవాలనుకుంటే చూస్తూ ఊరుకుంటానా అని అనుకుంటుంది మోనిత.
మోనితతో పెట్టుకుంటే ఎవరికైనా మోక్షమే.. అని అనుకొని గన్ తీస్తుంది మోనిత. నా ఆవేశం ఎప్పుడూ కార్తీక్ ప్రేమనే కోరుకుంది. కానీ.. ఈరోజు బలి కోరుకుంది అని అనుకుంటుంది మోనిత. మరోవైపు కార్తీక్ ఫ్యామిలీ టూర్ కు వెళ్తారు. మనం ఇలా టూర్ కు వెళ్తున్నామంటే నాకు ఇంకా నమ్మబుద్ధి అవడం లేదు అంటుంది శౌర్య.
మీకే కాదు.. నాకు కూడా ఆశ్చర్యంగానే ఉంది అంటుంది దీప. డాక్టర్ బాబు ఈ సంతోషం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కదా అంటుంది దీప. అవును.. దీప తుపాను ముగిసింది. ఇక మనం ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉంటాం అని అంటాడు కార్తీక్.
Karthika Deepam 5 March Today Episode : హిమకు కారు డ్రైవింగ్ నేర్పిన కార్తీక్
వీళ్లకు తమ్ముడు దూరం అయ్యాడన్న బాధ అస్సలు లేదు. తమ్ముడి గురించి బాధపడకుండా సంతోషంగా ఉన్నారు అని అనుకుంటుంది హిమ. ఆనంద్ ను మీరు మరిచిపోయారా. మీకు అసలు ఆనంద్ మీద ప్రేమ్ లేదు కదా అంటుంది హిమ.
హిమ.. ఒకప్పుడు మనం ఇద్దరం దూరంగా వేర్వేరుగా ఉన్నాం. కానీ.. అప్పుడు మనిద్దరం ఎంత బాధపడ్డామో నీకు తెలుసు కదా అంటుంది దీప. మనమిద్దరం కలుసుకున్నాక ఎంత సంతోషపడ్డామో ఒకసారి గుర్తు చేసుకో అంటుంది దీప.
ఆనంద్ ముద్దుగా ఉంటాడు. మంచివాడు. ఎప్పుడో ఒకసారి ఆకలి వేస్తేనే ఏడ్చేవాడు. అందరికీ వాడంటే ఇష్టమే. ఏదో మన దగ్గరికి చేరాడు. కానీ.. పిల్లలు తల్లిదండ్రుల దగ్గరికి చేరితేనే సంతోషిస్తారు కదా. అవునా కాదా అంటుంది దీప. వాడు మనతో బాగా కలిసిపోయాడు. కానీ.. ఇప్పుడు ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంటాడు అంటుంది దీప.
వాడు ఆనందంగా ఉండటం మనకూ హ్యాపీనే కదా అంటాడు కార్తీక్. దీంతో అవును అంటుంది హిమ. మనకు నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందో తెలుసా. మనకు ఇష్టమైన వారిని ఇంకా సంతోషపెట్టినప్పుడు అంటుంది దీప. హిమ.. నీకు బాబు అంటే ఎక్కువ ఇష్టం. కానీ.. పదే పదే ఎందుకు గుర్తు తెచ్చుకోవడం.. వద్దు అంటుంది దీప.
అందరం సంతోషంగా ఇలా చిక్కమంగళూరు వెళ్తున్నాం కదా. సంతోషంగా ఉన్నప్పుడు ఇలా డాడీని బాధపెడతామా.. తప్పు కదా అంటుంది దీప. దీంతో సర్లేండి.. నేను ఏం మాట్లాడను. తమ్ముడి గురించి ఇంకేం మాట్లాడను సరేనా అంటుంది హిమ.
దీంతో ఏంటి అలిగావా అంటుంది దీప. హిమ అలకను ఎలా తీరుస్తానో తెలుసా.. హిమ ముందుకు రా అంటాడు కార్తీక్. దీంతో నేను రాను అంటుంది. డ్రైవింగ్ చేస్తా అన్నావు కదా. ముందుకురా.. ఇద్దరం కలిసి డ్రైవింగ్ చేద్దాం పదా అంటాడు. దీంతో హిమ ముందుకు వచ్చి డ్రైవింగ్ చేస్తుంది.
డాడీ.. స్టీరింగ్ నాకు ఇవ్వు. స్పీడ్ ఎలా పెంచాలి.. అంటూ కార్తీక్ ను ఇబ్బంది పెడుతుంది హిమ. వద్దన్నా కూడా వినకుండా స్పీడ్ గా నడుపుతుంది హిమ. మరోవైపు సౌందర్య, ఆనంద రావు.. ఇద్దరూ గుడికి వెళ్లి పూజారిని కలుస్తారు.
చాలా రోజుల తర్వాత మా ఇంట్లో సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి అంటుంది సౌందర్య. ఆ పైవాడి లీలలను మనం అర్థం చేసుకోగలమా అంటాడు పూజారి. మా కుటుంబానికి రాక్షస పీడ వదిలింది అంటుంది సౌందర్య. పెద్ద కొడుకు పిల్లలు సరదాగా విహారయాత్రకు వెళ్లారు అంటుంది సౌందర్య.
ఎక్కడైతే వాళ్ల బంధం తెగిపోయిందో.. మళ్లీ అక్కడికే వెళ్లారు. చిక్ మంగళూరు వెళ్లారు అని చెబుతుంది సౌందర్య. దీంతో పూజారి షాక్ అవుతారు. ఉండండి.. అని పంచాగం చూసి.. అక్కడికి వెళ్లకుండా ఉండాల్సింది అంటాడు పూజారి. దీంతో సౌందర్య, ఆనంద్ రావు షాక్ అవుతారు.
ఎందుకు పంతులు గారు అని అడుగుతుంది సౌందర్య. రావణ సంహారం జరిగినా కూడా సీతారాముల కష్టాలు పోలేదు. కాలం మళ్లీ వాళ్లను విడదీసింది. కాలం బలమైనది. అది ఎంతటి పనినైనా చేయిస్తుంది. ఎక్కడైతే కార్తీక్, దీపల మధ్య అనుమానాలు మొదలయ్యాయో… మళ్లీ అదే చిక్ మంగళూరుకు వెళ్లి పొరపాటు చేశారు అనిపిస్తోంది అమ్మ.
పూర్వజన్మ కృతం పాపం అంటారు. పోయిన జన్మలో చేసిన పాపాలు వెంటాడుతుంటాయి అంటారు అంటాడు పూజారి. ఎందుకో మనసులో ఏదో అలజడిగా అనిపిస్తోంది అంటాడు పూజారి. జాగ్రత్తగా ఉండమని చెప్పండి. వీలైతే వెనక్కి వచ్చేయమని చెప్పి పూజారి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.