
karthika deepam 8 february 2022 full episode
Karthika Deepam 8 Feb Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 8 ఫిబ్రవరి 2022, మంగళవారం ఎపిసోడ్ 1270 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ ముసుగు వేసుకొని వచ్చి కేకు అందరికీ సర్వ్ చేస్తుంటాడు. భారతికి, మోనితకు కూడా కార్తీక్ కేకు ఇస్తాడు. తర్వాత కార్తీక్ ను చూసి అచ్చం కార్తీక్ లా ఉన్నాడేంటి అని అనుకుంటుంది. ముసుగులో ఉన్నా కూడా కార్తీక్ లా ఉన్నాడని డౌట్ పడుతుంది మోనిత. అయితే.. తనకు ఎవరిని చూసినా కార్తీక్ లా కనిపిస్తున్నాడని అనుకుంటుంది. భారతి.. ఇందాకా కేకు ఇచ్చిన వ్యక్తి కూడా నా కార్తీక్ లాగానే ఉన్నాడు తెలుసా అంటుంది మోనిత. దీంతో ఊరుకో మోనిత నువ్వు అంటుంది భారతి. ఇంతలో అంజలి చూసి.. ఇందాకటి నుంచి చూస్తున్నాను. మీ ఇద్దరికీ ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది అంజలి. దీంతో నేను చెబుతాను అంజలి గారు. కార్తీక్ ఆపరేషన్ చేసిన ఆ అమ్మాయి ఎవరో.. వాళ్ల పేరెంట్స్ ఎవరో కాస్త చెబుతారా అని అడుగుతుంది మోనిత. ఎందుకు మోనిత గారు అంటుంది.
karthika deepam 8 february 2022 full episode
మీకు, మీ వారికి ఏమైనా గొడవలు జరుగుతున్నాయా అని అడుగుతుంది. నాకు అర్థం కాక అడుగుతున్నాను అంటుంది. మా వారు కార్తీక్.. నా మీద అలిగారు. ఏదో చిన్న చిలిపి గొడవ. చెప్పకుండా వచ్చేశారు. అంటే.. ఆపరేషన్ చేశారని చెప్పారు కదా. ఇక్కడే ఈ ఊళ్లోనే ఉన్నారేమో కలిసి బతిమిలాడుకుంటాను.. అంటుంది. దీంతో అయ్యో ఇంతేనా.. ఇందాకా మీకు కేకులు ఇచ్చాడు కదా. ఆయనే ఆ పేషెంట్ తండ్రి అంటుంది అంజలి. దీంతో వాళ్ల కోసం వెతుకుతూ ఉంటుంది మోనిత. ఆయన ఇక్కడే ఉండాలే అని చూస్తుంది అంజలి. ఇంతలో కార్తీక్, దీప.. ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. వంటలు చేసిన ప్లేస్ దగ్గరికి వచ్చి ఇక్కడ వంట చేసే వాళ్లు ఉండాలి కదా వాళ్లు ఏరి అని అడుగుతుంది అంజలి.
దీంతో వాళ్లు ఇప్పుడే వెళ్లిపోయారండి అని అక్కడి వాళ్లు చెబుతారు. మంచి అవకాశం మిస్ అయింది. వాళ్లు ఇప్పుడే వెళ్లిపోవాలా అని అనుకుంటుంది మోనిత. ఇంతలో ఆటో ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతారు కార్తీక్, దీప. ఇప్పుడు ఏం చేద్దాం అండి అని అడుగుతుంది దీప. కాస్త అయితే మనల్ని చూసేవాళ్లు. ఏం చేయాలో అర్థం కావడం లేదు అంటాడు కార్తీక్.
మనం ఇక్కడి నుంచి వెళ్లిపోయినా బాగుండేది అని అంటాడు కార్తీక్. వెళ్లిపోవాలని నాకు కూడా ఉంది కానీ.. రుద్రాణి అప్పు తీర్చాలి కదా అని అంటుంది దీప. పిల్లలు ఎలా ఉన్నారో అని అంటుంది. మరోవైపు విజయలక్ష్మి వచ్చి బాధపడుతూ ఉంటుంది. మీ అమ్మ వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది.
హిమ ఇక రాదా అత్త అని అడుగుతుంది శౌర్య. ఆ రుద్రాణి మనుషులు వచ్చి హిమను తీసుకెళ్లారని మీ వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని అంటుంది విజయలక్ష్మి. ఇంతలో అప్పారావు ఇంటికి వస్తారు. కానీ.. అప్పారావు ఇల్లు లాక్ వేసి ఉంటుంది. దీంతో వెంటనే ఇంటికి వెళ్తారు.
ఇంతలో విజయలక్ష్మి.. హిమ గురించి చెబుతుంది. దీంతో షాక్ అవుతారు కార్తీక్, దీప. హిమకు ఏం కాదు.. నేను వెళ్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అని శౌర్యకు ధైర్యం చెప్పి ఇద్దరూ రుద్రాణి ఇంటికి బయలుదేరుతారు. మరోవైపు పిల్లిగడ్డం హిమను తీసుకొచ్చాడు కానీ.. ఇంటికి తీసుకురాలేదు కదా అని రుద్రాణి మనిషి అంటాడు.
పిల్లిగడ్డం కారులోనే హిమను రోడ్డు మీద తిప్పుతూ ఉంటాడు. ఈరోజు నేను ఊరెళ్తున్నాను. నెల రోజుల దాకా రాను.. అని చెప్పి సూట్ కేసులు పట్టుకొని బయటికి వెళ్తున్నట్టు యాక్ట్ చేస్తాను అని తన మనిషితో అంటుంది రుద్రాణి. అయితే..డబ్బు ఇవ్వాలి లేకుంటే పాపను ఇవ్వాలి.. ఎలాగూ డబ్బు ఇవ్వరు అంటుంది రుద్రాణి.
డబ్బు ఇవ్వరు కాబట్టి హిమ నా దగ్గరే ఉంటుంది అంటుంది రుద్రాణి. ఇంతలో హిమ కోసం రుద్రాణి, కార్తీక్ ఇద్దరూ వస్తారు. రుద్రాణి మర్యాదగా అడుగుతున్నాం నా బిడ్డ ఎక్కడ అని ఇద్దరూ అరుస్తారు. ఏరా.. మనింట్లో ఎవరైనా ఉన్నారా అని అంటుంది రుద్రాణి. లేరక్కా అంటాడు.
సారు.. పాప ఇక్కడ లేదు అంటుంది రుద్రాణి. డబ్బులు ఇచ్చి పాపను తీసుకెళ్లండి. ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి అని చెబుతుంది దీప. నేను ఊరెళ్తున్నాను. ఈలోగా డబ్బులు రెడీ చేసుకోండి అని చెబుతుంది రుద్రాణి.
ఇంతలో ఇంట్లోకి వెళ్లి హిమ కోసం వెతుకుతారు కానీ.. హిమ కనిపించదు. దీంతో రుద్రాణి దగ్గరికి వచ్చి హిమ ఎక్కడుందో చెప్పండి అని అడుగుతుంది దీప. కానీ.. డబ్బులు ఇస్తేనే చెబుతాను. డబ్బులు ఇస్తేనే మీ పాప. లేదంటే నా పాప అంటుంది రుద్రాణి.
మీకు దండం పెడతాను.. మీ కాళ్లు పట్టుకుంటాను.. అని అంటుంది దీప. ఇంతలో అక్కడికి సౌందర్య వస్తుంది. సౌందర్యను చూసి దీప, కార్తీక్ షాక్ అవుతారు. రుద్రాణి.. సౌందర్యను చూసి నువ్వేంటి ఇక్కడ. నీకు కూడా డబ్బు కావాలా.. లేక నువ్వు కూడా నా కాళ్లు పట్టుకుంటావా అంటుంది రుద్రాణి.
దీంతో రుద్రాణి చెంప చెళ్లుమనిపిస్తుంది సౌందర్య. ఏయ్ నా ఇంటికి వచ్చి నన్నే కొడతావా అంటుంది రుద్రాణి. దీంతో గొంతు తగ్గించి మాట్లాడు అంటుంది సౌందర్య. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా. సౌందర్యతో అంటుంది. వాయిస్ తగ్గించి మాట్లాడు అంటుంది. ఆయుష్షు మిగులుతుంది అంటుంది సౌందర్య.
ఏంటి దీప ఇది.. ఏం చేస్తున్నావే నువ్వు అంటుంది సౌందర్య. దీప మీకు తెలుసా అని అడుగుతుంది రుద్రాణి. తెలుసా ఏంటి.. దీప ఎవరు అనుకుంటున్నావు నా పెద్ద కోడలు అంటుంది సౌందర్య. మమ్మీ అంటాడు కార్తీక్. నువ్వు ఇక్కడ ఎలా అంటాడు కార్తీక్. ఇతను మీ కొడుకా అని అడుగుతుంది రుద్రాణి. దీంతో నా పెద్ద కొడుకు డాక్టర్ కార్తీక్ అంటుంది సౌందర్య.
డాక్టరా అని షాక్ అవుతుంది రుద్రాణి. అవును.. ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కార్తీక్ అంటుంది రుద్రాణి. నా పెద్ద కొడుకు అని చెబుతుంది సౌందర్య. ఏం చేస్తావే నువ్వు.. హా.. డబ్బు వడ్డీలకు తిప్పుతావా.. నా కొడుకు వందల మందికి గుండె ఆపరేషన్లు చేశాడు.. తెలుసా నీకు అంటుంది సౌందర్య.
వందల మంది చేతులెత్తి మొక్కుతారే నా కొడుకు పేరు వింటే అంటుంది సౌందర్య. తన అపాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి ఎదురు చూస్తారు అని అంటుంది సౌందర్య. నువ్వెంత.. నీ బతుకెంత అంటుంది సౌందర్య. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mobile Recharge : మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల విషయంలో సామాన్యులకు ఊరటనిచ్చేలా భారీ మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు టెలికాం సంస్థలు…
Central Govt Employees DA Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు Central Government Employees, పెన్షనర్లకు ఇది నిజంగా…
AP and Telangana Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం విచిత్రమైన వాతావరణం నెలకొంది. ఉదయం పూట సూర్యుడు…
Farmer : సాధారణంగా ఏదైనా ప్రభుత్వ ప్రాజెక్టు కోసం భూములు సేకరిస్తే.. రైతులు ఆందోళన చెందుతారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం…
Gold Silver Rate 31st March 2026 : బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న పసిడి ప్రియులకు మళ్లీ సడెన్…
Karthika Deepam 2 March 31st 2026 Episode : స్టార్ మా ఛానెల్‌లో అత్యంత విజయవంతంగా, ప్రేక్షకుల ఆదరణ…
Pineapple Juice : వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి పైనాపిల్ రసం ఒక అద్భుతమైన పానీయం అని చెప్పవచ్చు.…
Potatoes : వేసవి కాలంలో బంగాళదుంపలు తినవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. సాధారణంగా బంగాళదుంపను ఒక…
Tea With Biscuits : చాలామందికి ఉదయం లేదా సాయంత్రం వేళల్లో వేడివేడి టీతో పాటు బిస్కెట్లు తినడం ఒక…
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనలు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ…
INDIAN ARMY : భారతదేశ రక్షణ రంగం భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రూపొందించిన పది ఏళ్ల భారీ ప్రణాళిక మన దేశ…
Revanth Reddy : తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు మరియు…
This website uses cookies.