Karthika Deepam 9 Nov Today Episode : మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దీపే తన భార్య అని మోనితను వదిలేస్తాడా? దీపతో కలిసి వెళ్లిపోతాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Karthika Deepam 9 Nov Today Episode : మోనితకు షాకిచ్చిన కార్తీక్.. దీపే తన భార్య అని మోనితను వదిలేస్తాడా? దీపతో కలిసి వెళ్లిపోతాడా?

Karthika Deepam 9 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1505 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజారికి ఎందుకు మా అమ్మానాన్నల పేర్లు చెప్పలేదు అని శౌర్య.. ఇంద్రుడు, చంద్రమ్మను అడుగుతుంది. దీంతో ఇప్పుడు పూజారికి మీ అమ్మానాన్నల గురించి చెబితే వాళ్లు ఎవరు అని అడుగుతాడు. అంతేకాదు.. కథ మొత్తం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ నానమ్మ, […]

 Authored By gatla | The Telugu News | Updated on :9 November 2022,9:30 am

Karthika Deepam 9 Nov Today Episode : కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 1505 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పూజారికి ఎందుకు మా అమ్మానాన్నల పేర్లు చెప్పలేదు అని శౌర్య.. ఇంద్రుడు, చంద్రమ్మను అడుగుతుంది. దీంతో ఇప్పుడు పూజారికి మీ అమ్మానాన్నల గురించి చెబితే వాళ్లు ఎవరు అని అడుగుతాడు. అంతేకాదు.. కథ మొత్తం చెప్పాల్సి ఉంటుంది. అలాగే మీ నానమ్మ, తాతయ్య కూడా నీ గురించి వెతుకుతున్నారు కదా. మళ్లీ వాళ్లకు మన గురించి తెలిస్తే నిన్ను తీసుకెళ్తారు. అందుకే చెప్పలేదు అంటాడు. ఆ తర్వాత మరి మనం సంగారెడ్డికి ఎప్పుడు వెళ్తున్నాం అని అడుగుతుంది శౌర్య. దీంతో ఎందుకు అని అంటాడు ఇంద్రుడు. అదేంటి.. మనం అమ్మను వెతకడానికి వెళ్దాం అని అనుకున్నాం కదా అంటుంది శౌర్య. దీంతో అవును.. వెళ్దాం. ఇప్పుడే కదా ఇక్కడికి వచ్చింది. అన్నీ సర్దుకోవాలి కదా. ఊరు అలవాటు అవ్వాలి కదా.. అని శౌర్యకు ఎలాగోలా సర్దిచెబుతాడు ఇంద్రుడు.

karthika deepam 9 november 2022 full episode

karthika deepam 9 november 2022 full episode

మరోవైపు దీపతో ఇవాళ ఎలాగైనా తేల్చుకోవాలని అనుకుంటుంది మోనిత. తన ఇంటికి వెళ్తుంది కానీ.. అక్కడ దీప ఉండదు. ఇంటి తలుపులు మాత్రం తీసే ఉంటాయి. ఇంతలో దుర్గ వస్తాడు. ఏంటి బంగారం.. ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో దీప కోసం వచ్చా అంటుంది. దీప ఇంట్లో లేదా అంటాడు. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కావచ్చు అంటాడు దుర్గ. వాళ్లిద్దరూ కలిసి పోయారు. కావాలంటే చూడు వాళ్లిద్దరూ ఇప్పుడు కలిసే వస్తారు. నువ్వు ఇక నీ దారి నువ్వు చూసుకుంటే మంచిది అంటాడు. దీంతో నోర్మూయ్.. వాళ్లు ఎప్పటికీ కలవరు. ఇప్పుడు కూడా వాళ్లు కలిసి రారు. దీప ఒక్కతే వస్తుంది చూస్తూ ఉండు అంటుంది మోనిత. ఇంతలో కారులో కార్తీక్, దీప ఇద్దరూ వస్తారు. ఇంటికి వచ్చి తలుపులు తీసి ఉన్నాయి ఏంటి.. ఇంట్లోకి ఎవరైనా వచ్చి ఉంటారా అంటాడు కార్తీక్. దీంతో దుర్గ వచ్చి ఉంటాడులే డాక్టర్ బాబు అంటుంది దీప.

ఇంతలో కార్తీక్, దీప ఇద్దరూ కలిసి రావడం చూసి మోనిత షాక్ అవుతుంది. ఏమైంది దుర్గ గారు అంటుంది. ఏం లేదు కార్తీక్ సార్. దీప ఇంట్లో ఎవరూ లేరు. అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రా అని నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. నేనేమో.. వద్దు దీపమ్మ వస్తుంది అని అన్నా. ఇంతలోనే మీరు వచ్చారు అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుంటాడు దుర్గ.

మీకు ఆ ఇల్లు సరిపోలేదా మోనిత. అక్కడ స్టాఫ్ ఉంటారు కదా. అందుకని ఇక్కడికి వచ్చారా అంటాడు కార్తీక్. దీంతో ఆపు కార్తీక్. నేను వచ్చింది మీ సంగతి తేల్చడానికి అంటుంది మోనిత. దీంతో ముందు నీ సంగతి చెప్పు. మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది.

డాక్టర్ బాబు.. ఇప్పుడు నాకు ఏ విషయం గురించి వాదించడానికి ఓపిక లేదు. మోనితను తీసుకొని వెళ్లండి అంటుంది దీప. బొటిక్ బిజినెస్ చూసుకునేవాడివి ఇదివరకు. ఇప్పుడు ఆ బిజినెస్ వదిలేసి ఈ బిజినెస్ చూసుకుంటున్నావా. అసలు మీరు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడుగుతుంది మోనిత.

Karthika Deepam 9 Nov Today Episode : ఎవరు ఎవరిని పట్టుకున్నారు అని మోనితతో కార్తీక్ సీరియస్

ఇది నిన్ను పట్టుకొని వేలాడుతోంది.. అని ఆవేశపడి మాట్లాడుతుంది మోనిత. దీంతో నోర్మూయ్.. ఎవరు ఎవరిని పట్టుకున్నారు. ఎవరు ఎవరిని పట్టుకొని ఇక్కడ వేలాడటం లేదు. పాపం వంటలక్క తన పిల్లల కోసం వెతుకుతూ బాధపడుతుంటే తనకు సాయం చేశాను అంతే అని చెప్పి అక్కడి నుంచి మోనితను తీసుకొని వెళ్తాడు కార్తీక్.

కార్తీక్ మాటలు చూస్తుంటే ఆ దుర్గ గాడు చెప్పిందే నిజం అనిపిస్తోంది. అసలు కార్తీక్ కు గతం గుర్తొచ్చిందా? లేదా? అని అనుకుంటుంది మోనిత. ఆ తర్వాత మోనితను తీసుకొని వెళ్తాడు కార్తీక్. ఆ తర్వాత తన ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది శౌర్య.

మరోవైపు ఆనంద రావు, హిమ ఇద్దరూ కలిసి హోటల్ కు వెళ్తారు. అక్కడ లక్ష్మణ్ కనిపిస్తాడు. ఆనంద్ తమ్ముడు వచ్చాడా అని అడుగుతుంది హిమ. దీంతో లేదమ్మా.. మోనిత దగ్గరే ఉన్నాడు అంటాడు. ఆ తర్వాత నువ్వు వెళ్లు లక్ష్మణ్ అంటాడు ఆనంద రావు. ఏంటి తాతయ్య.. ఆనంద్ ను ఇంటికి తీసుకొద్దామని అనుకుంటే నువ్వు వద్దంటున్నావు ఏంటి అంటుంది హిమ.

ఏంటి తాతయ్య నువ్వు.. అటు ఆనంద్ ను తీసుకురానివ్వు.. ఇటు శౌర్య రాదు అంటుంది. సరే.. మనమే మోనిత దగ్గరికి వెళ్లి ఆనంద్ ను తీసుకొద్దాం అంటాడు ఆనంద రావు. మరోవైపు కార్తీక్ రూమ్ కు వెళ్లి కార్తీక్ బట్టలను చెక్ చేస్తుంది. తన పర్స్ చూస్తుంది మోనిత.

అందులో చాలా డబ్బు ఉంటుంది. ఇంత డబ్బు కార్తీక్ కు ఎక్కడిది అని అనుకుంటుంది.. ఇంతలో అక్కడికి వచ్చిన కార్తీక్.. ఏం చేస్తున్నావు మోనిత అని అడుగుతాడు. దీంతో అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం డబ్బులు కావాలి. నీ దగ్గర చేంజ్ ఉన్నాయేమో అని చూశా అంటుంది.

అసలు నీకు ఇంత డబ్బు ఎక్కడిది అని అడుగుతుంది మోనిత. దీంతో మోనితకు డౌట్ వచ్చినట్టుంది అని అనుకుంటాడు కార్తీక్. నేను పెద్ద డాక్టర్ ను. సర్జరీలు చేయగా వచ్చిన డబ్బు అది అంటాడు కార్తీక్. దీంతో మోనిత షాక్ అవుతుంది. లేకపోతే ఏంటి.. నా దగ్గర ఉన్న చైన్ ను తాకట్టు పెట్టాను అంటాడు కార్తీక్.

ఇంతలో అక్కడికి వచ్చిన దుర్గ.. మోనిత ఈ చైన్ ఎలా ఉంది అని అడుగుతాడు దుర్గ. దీంతో నాకెందుకు అంటుంది మోనిత. దీంతో నువ్వు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు అది ఎలా ఉందో కూడా నువ్వు చెప్పాలి కదా అంటాడు దుర్గ. దీంతో నా మెడలో లేకుంటేంది.. నీకు నచ్చిన వారి మెడలో ఉంది కదా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు కార్తీక్. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది