Karthika Deepam : ఫోన్‌లో ఎప్పుడూ వారితోనే మాట్లాడతాడు.. డాక్టర్ బాబుపై మంజుల సెటైర్లు
Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ హీరో నిరుపమ్ అలియాస్ డాక్టర్ బాబు అతని భార్య మంజుల నిరుపమ్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరికీ అధికంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం వల్ల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది సబ్ స్కైబర్లు ఉన్నారు. ఇక వీరు ఒక వీడియో పోస్ట్ చేయడమే ఆలస్యం వెంటనే మిలియన్ సంఖ్యలో వ్యూస్ దక్కించుకుంటారు. తాజాగా వీరు వీరీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫోన్లో ఉన్న సీక్రెట్స్ గురించి ఒక వీడియో చేశారు.
ఈ వీడియోలో నిరుపమ్ కొడుకు అడిగే ప్రశ్నలకు వీరిద్దరూ సమాధానం చెబుతూ ఉంటారు. ఇలా వీరిద్దరిని ఎన్నో ప్రశ్నలు అడిగిన రిక్కీ ఇక తన తండ్రిని మీరు ఫోన్ లో ఎక్కువగా ఎవరితో మాట్లాడుతారని ప్రశ్నించారు.ఆ ప్రశ్న అడిగిన వెంటనే మంజుల స్పందిస్తూ నాతో అయితే కాదు అంటూ సమాధానం చెప్పింది. ఇక ఈ ప్రశ్నకు నిరుపమ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

Karthika Deepam doctor babu frequently talks with managers only
ఎక్కువగా మేనేజర్లతో ఫోన్ కాల్స్..తన కొడుకు అడిగిన ప్రశ్నకు నిరుపమ్ సమాధానం చెబుతూ డబ్బింగ్, మేనేజర్లతో ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడతాను అని చెబుతుండగా అంతలోనే మంజుల మాట్లాడుతూ.. కృష్ణ కాంత్ గారితో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. నేను ఎప్పుడు చూసినా అతనితోనే మాట్లాడుతారు లొకేషన్ లోనూ అతనితో మాట్లాడుతారు.. లొకేషన్ నుంచి ఇంటికి రాగానే హలో కృష్ణకాంత్ అని అతనితో మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు కృష్ణ కాంత్ గారితోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు అంటూ తన భర్త పై మంజుల సెటైర్లు వేశారు.
