Home » Entertainment » Karthika Deepam Monitha Re Entry Into Karthika Deepam
Entertainment

Karthika Deepam Monitha : కార్తీక దీపంలోకి వ‌చ్చేస్తున్న‌ట్టు చెప్పిన మోనిత‌.. లేడి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్‌

Authored By
Sam C
The Telugu News | Published on: July 27, 2022, 8:00 pm
Advertisement

Karthika Deepam Monitha : కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులర్ అయిందో మ‌నంద‌రికి తెలిసిందే. ఈ పాత్రలో క‌న్నడ నటి శోభా శెట్టి న‌టించింది. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు తన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది. మోనిత ఏ పోస్ట్ చేసిన కూడా కొద్ది క్ష‌ణాల‌లో వైర‌ల్ అవుతుంటుంది. ఆమె స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారీ ఆడాళ్లంతా తిట్లదండకం అందుకునే వారు. అంతలా తన హావభావాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మోనిత. డాక్టర్ బాబుతో ప్రేమ..

Advertisement

అనూహ్య పరిస్థితుల్లో తల్లి కావడం.. డాక్టర్ బాబుని ఎలాగైనా తన వశం చేసుకోవడానికి మోనిత పన్నిన కుట్రలతోనే కార్తీకదీపం సీరియల్ వివిధ మలుపులు తీసుకుని జాతీయ స్థాయితో నెంబర్ 1 రేటింగ్ సీరియల్‌‌గా చరిత్ర కెక్కింది. ఒకప్పుడు టాప్ రేటింగ్ కొల్లగొట్టిన ఈ సీరియల్ ఇప్పుడు సగానికి సగం పడిపోయింది. మళ్లీ పూర్వ వైభవం అందుకోవాలి అంటే తప్పకుండా డాక్టర్ బాబు, మోనిత, వంటలక్క లు రావాలి .అయితే వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలోని చంపేశారు కాబట్టి మోనిత క్యారెక్టర్ మాత్రమే రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మోనిత ఎంట్రీతో కార్తీకదీపం సీరియల్ రేటింగ్‌లో పుంజుకోవడమే కాదు..

Karthika Deepam Monitha re entry into karthika deepam

Advertisement

Karthika Deepam Monitha : మోనిత రీ ఎంట్రీ..

పూర్వ వైభవం అందుకునే అవకాశం కూడా లేకపోలేదు. మోనిత తిరిగి కార్తీకదీపంలోకి రావాలని ఆమె ఫ్యాన్స్ మాత్రమే కాదు.. మోనిత కూడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్‌లో ఉన్నట్టు స్పష్ఠత ఇచ్చేసింది. తాజాగా ఆమె యూట్యూబ్ ఛానల్‌లో ‘కార్తీకదీపంలోకి రీ ఎంట్రీ’ అంటూ ఒక వీడియో పోస్ట్ చేసింది అందులో తాను కార్తీకదీపంలోకి రాబోతున్నట్టుగా హింట్ ఇచ్చింది. మళ్లీ కార్తీకదీపం సీరియల్‌లోకి రావడానికి చాలా ఆశగా ఉంది.. రావాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్‌లో ఉన్నాం. త్వరలోనే దీనికి సంబంధించి మీకు క్లారిటీ ఇవ్వబోతున్నాను అని పేర్కొంది. అయితే మోనిత రావడం కాస్త లేటు అవ్వొచ్చేమో కానీ.. రావడం మాత్రం పక్కా అని చెప్పకనే చెప్పేస్తోంది.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి