Home » Entertainment » Sudigali Sudheer Re Entry Time Fixed
Entertainment

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ జ‌బ‌ర్ధ‌స్త్ రీఎంట్రీ వెనుక ఉన్న‌ది ఆయ‌నేనా?

Authored By
Sam C
The Telugu News | Published on: July 27, 2022, 7:45 pm
Advertisement

Sudigali Sudheer : కొద్ది రోజులుగా బుల్లితెర కామెడీ షో జబ‌ర్ధ‌స్త్ నుండి ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చేస్తున్న విష‌యం తెలిసిందే. ముందు నాగ‌బాబు అండ్ బ్యాచ్ బ‌య‌ట‌కు వ‌చ్చేయగా, ఆ త‌ర్వాత అన‌సూయ‌, సుధీర్, ఆది, గెట‌ప్ శీను ఇలా ఒక్కొక్క‌రుగా గుడ్ బై చెప్పేశారు. అయితే జబర్దస్త్ జడ్జీగా ఉన్న నాగబాబు.. తాను బయటకు వెళ్లడమే కాకుండా.. తనతో పాటు చమ్మక్ చంద్ర, కిరాక్ ఆర్పీ, ధనరాజ్, వేణు లాంటి పాపులర్ కమెడియన్లను తీసుకుని వెళ్లారు. వాళ్లతో అదిరింది అంటూ కొత్త షో భారీ హంగామాతో మొదలుపెట్టారు కానీ.. అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

Advertisement

ఇటు జబర్దస్త్‌లో కీలకమైన కమెడియన్లు క్యూ కడుతుండటంతో నవ్వులు తగ్గాయి. న‌వ్వుల సంగ‌తి అలా ఉంచితే కిరాక్ ఆర్పీ మల్లెమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. జబర్దస్త్ గుట్టు మొత్తం రోడ్డున పెట్టాడు. ప్రపంచంలో మల్లెమాల లాంటి వరస్ట్ ప్రొడక్షన్ ఉండదనే.. అందుకే తనతో పాటు.. సుధీర్, రష్మి, అనసూయ, హైపర్ ఆది, గెటప్ శీను ఇలా పాపులర్ సెలబ్రిటీలంతా అక్కడ నుంచి క్యూ కడుతున్నారంటూ చెప్పుకొచ్చాడు.వీటిపై త‌గ్గ కౌంట‌ర్స్ కొంద‌రు ఇచ్చార‌నుకోండి. అయితే జ‌బ‌ర్ధ‌స్త్ ఇప్పుడు న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు మొదలు పెడుతుంద‌నే టాక్ వినిపిస్తుంది. ఇప్ప‌టికే గెట‌ప్ శీను ని మెల్ల‌గా జ‌బ‌ర్ధ‌స్త్‌లోకి తీసుకు వ‌చ్చారు.

Sudigali Sudheer re entry time fixed

Advertisement

Sudigali Sudheer : సుధీర్ రీఎంట్రీ నిజ‌మా?

అత‌ను ఒక ఎపిసోడ్‌కా లేదంటే కొన‌సాగుతాడా అనే దానిపై క్లారిటీ లేదు. ఇక సుడిగాలి సుధీర్ త్వ‌ర‌లోనే జ‌బ‌ర్ధ‌స్త్ రీఎంట్రీ ఇవ్వ‌నున్నాడ‌ని తెలుస్తుండ‌గా, నిర్మాత శ్యాంప్రసాద్రెడ్డి ఆయనతో చర్చలు జ‌రుపుతున్నాడ‌ట‌. గెట‌ప్ శీనుతో శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి చ‌ర్చ‌లు జరిపిన కారణంగానే శ్రీను మళ్ళి వచ్చాడట. ఇదే ఇప్పుడు సుధీర్ తో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక సుడిగాలి సుధీర్ కూడా జ‌బ‌ర్ధ‌స్త్‌కి వ‌స్తే ఆ న‌వ్వులు మ‌ళ్లీ ప్ర‌త్య‌క్షం కావ‌డం ఖాయం. కాక‌పోతే సుధీర్ మాటీవీని వ‌దిలి అంత తొంద‌ర‌గా రావ‌డం క‌ష్టంతో కూడుకున్న ప‌నే.

Sam C

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి