Karthika Deepam : డాక్టర్ బాబు మంచి మనసు.. చిల్డ్రన్స్ డే అంటూ అలా
Karthika Deepam : బుల్లితెరపై డాక్టర్ బాబు సోషల్ మీడియాలో నిరుపమ్ ఇలా ఎవరు ఎలా పిలిచినా కూడా స్పందిస్తాడు. సోషల్ మీడియాలో నిరుపమ్ ఫుల్ యాక్టివ్‌గా ఉంటాడు. కార్తీక దీపం సీరియల్‌తో ఒక్కసారిగా నిరుపమ్ స్టార్ హీరోఅయిపోయాడు. బుల్లితెరపై సూపర్ స్టార్ అన్నట్టుగా మారిపోయాడు. ఇక కొందరైతే ఏకంగా బుల్లితెర శోభన్ బాబు అని పిలుస్తుంటారు.
అలాంటి నిరుపమ్ సోషల్ మీడియాలో వేసే పంచ్‌లు, సెటైర్లు మామూలుగా ఉండవు. ప్రాసలతో ప్రాణాలు తీసేస్తుంటాడు. ఇక తెరపై ఎంత మంచి పాత్రలు వేస్తాడో.. తెర వెనుకా అంతే మంచి మనసుతో మెలుగుతాడు. నిరుపమ్ భార్య మంజుల సైతం బుల్లితెర నటి. ఈ ఇద్దరూ కలిసి నెట్టింట్లో చేసే హంగామా మామూలుగా ఉండదు. తాజాగా వీరిద్దరూ యూట్యూబ్ చానెల్ పెట్టి సక్సెస్ అయ్యారు.

Karthika Deepam Nirupam Childrens day 2021 special
Karthika Deepam : పిల్లలతో డాక్టర్ బాబు ఆటపాటలు..
కొద్ది రోజుల్లోనే యూట్యూబ్ చానెల్‌ను సూపర్ హిట్ చేశారు. అయితే తాజాగా చిల్డ్రన్స్ డే సందర్భంగా డాక్టర్ బాబు కొంత మంది పిల్లలతో సమయం గడిపాడు. అనాథాశ్రమానికి వెళ్లినట్టు కనిపిస్తోంది.అక్కడే కొంత సమయాన్ని గడిపేసి.. పిల్లలతో ఆడుకున్నాడు. ఈ మేరకు మంజుల కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలను చూసి డాక్టర్ బాబు ఎంత మంచివాడో అని అనుకుంటున్నారు.