Nirupam paritala : అలాంటి విషయాలు చెప్పొద్దు.. భార్య పరువుదీసిన నిరుపమ్ పరిటాల
Nirupam paritala : బుల్లితెర శోభన్ బాబుగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న పరిటాల నిరుపమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిరుపమ్ అనే కన్నా డాక్టర్ బాబు అంటే చాలామంది గుర్తుపడతారు. ఇలా కార్తీకదీపం సీరియల్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిరుపమ్ తన భార్య మంజులతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా వీరిద్దరు ఒక వీడియో చేసి వారి ఛానల్ ద్వారా ఆ వీడియో షేర్ చేశారు.
ఇందులో వారి కొడుకు రిక్కీ వీరిద్దరి మొబైల్ ఫోన్స్ గురించి వీరిని ప్రశ్నలు అడిగితూ సమాధానాలు రాబట్టారు.ఈ క్రమంలోనే రిక్కీ ఎన్నో రకాల యాప్స్, మెయిల్స్, ఫొటోస్ గురించి తన తల్లి మంజుల,నిరుపమ్ ను ప్రశ్నిస్తూ సమాధానాలు రాబట్టారు. ఈ క్రమంలోనే రిక్కీ నిరుపమ్ ను ప్రశ్నిస్తూ మీ ఫోన్లో చదవని మెసేజ్ లు ఎన్ని ఉన్నాయి అని ప్రశ్నించారు. దీంతో వాట్సాప్ గ్రూప్ లో సుమారు 300కు పైగా చదవని మెసేజ్ లు ఉన్నాయి అని చెప్పారు. ఇదే విషయంపై మంజుల మాట్లాడుతూ అసలు విషయం బయట పెట్టింది.

Karthika deepam nirupam paritala fires on wife manjula paritala
Nirupam paritala : ప్రెస్ మీట్ లు పెట్టి అలాంటి సీక్రెట్లు చెప్పకూడదు:
ఈ ప్రశ్నకు మంజుల సమాధానం చెబుతూ నేనైతే వాట్సాప్ గ్రూప్ లో చదవని మెసేజెస్ ఉంటే ఆ నెంబర్ అలాగే పడుతూ ఉంటుంది. అందుకే వెంటనే గ్రూప్ మెసేజెస్ ఓపెన్ చేసి వాటిని చదవకుండా క్లోజ్ చేస్తానని మంజుల చెప్పడంతో వెంటనే నిరుపమ్ అలాంటి సీక్రెట్స్ అన్ని బయటకు చెప్పకూడదు. ఇలా ప్రెస్ మీట్ పెట్టి అలాంటి నిజాలని బయటకు చెబితే గ్రూప్లో ఉన్న వాళ్ళు వింటే ఫీల్ అవుతారు. అందుకే అలాంటి విషయాలు బయటకు చెప్పొద్దు అంటూ నిరుపమ్ తన భార్య పరువు తీశారు.
