Jabardasth Sathya Sri: జబర్దస్త్ షోలో కలర్‌ఫుల్ కమెడియన్ సత్యశ్రీ .. తనవల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి.
Jabardasth Sathya Sri: సత్యశ్రీ వల్లే జబర్దస్త్ లో వారందరికీ అవకాశాలు వచ్చాయి. స్మాల్ స్క్రీన్ మీద ప్రసారమవుతూ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న ఎంటర్‌టైనింగ్ షో జబర్దస్త్. ఇందులో తమ కామెడీతో వినోదాన్ని పంచే కమెడియన్స్ గురించి అందరికీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. ఈ షో ద్వారా ఎంతోమంది సామాన్య వ్యక్తులు సెలబ్రిటీస్ గా మారి బాగా సెటిలయ్యారు. అంతేకాదు ఈ షో తెచ్చిన పాపులారిటీతో రాం ప్రసాద్, గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర వంటి వారు వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటున్నారు. దాదాపుగా జబర్దస్త్ ఎనిమిదేళ్ల నుంచి ప్రసారమవుతూ, ప్రేక్షకులను అలరిస్తోంది.

Sathya Sri is a colourfull comedian in jabardasth show
అయితే ఈ షో ప్రారంభంలో కంటే ఇప్పుడు చాలా మార్పులు చేర్పులు చేశారు. మొదట్లో మగవాళ్ళే ఆడవారి గెటప్స్ వేసి స్కిట్స్ చేసి అలరించారు. కానీ ఈ రెండు మూడేళ్ళ నుంచి లేడీ కమెడియన్స్ కి అవకాశం ఇచ్చారు. వారికి ఈ షో ద్వారా మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. దాంతో జబర్దస్త్ చాలా కలర్ ఫుల్ గా మారింది. జబర్దస్త్ లో పాపులర్ కమెడియన్ చమ్మక్ చంద్ర గురించి అందరికీ తెలిసిందే. ఈ కమెడియన్ ఎక్కువగా ఫ్యామిలీకి సంబంధించిన స్కిట్ లతో ఆకట్టుకుంటూ ప్రత్యేకంగా పేరు తెచ్చుకున్నాడు.
Jabardasth Sathya Sri: ఈమె రూట్‌లో వచ్చి బుల్లితెర నటులు రోహిణి, వర్ష, పవిత్ర బాగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ఇందులో బాగంగా చమ్మక్ చంద్ర చేస్తున్న సమయంలో బుల్లితెర నటి సత్యశ్రీ ని తీసుకువచ్చాడు. ఈమె వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి సందడి చేసింది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాక బాగా పాపులారిటీ తెచ్చుకుంది. ఈ షొఈ ద్వారా సత్యశ్రీ కి విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ షోలో మరింత మంది లేడీ కమెడియన్స్ ఎంటరవడానికి రూటు క్లియర్ చేసింది సత్య శ్రీనే. ఆమె వచ్చాక ధైర్యంగా చాలా మంది లేడీ కమెడియన్స్ వచ్చి పాపులర్ అవుతున్నారు. ప్రస్తుతం ఈమె రూట్‌లో వచ్చి బుల్లితెర నటులు రోహిణి, వర్ష, పవిత్ర బాగా క్రేజ్ తెచ్చుకుంటున్నారు.
ఇది కూడా చదవండి ==> మొన్న సమంత, ఇప్పుడు కాజల్ అగర్వాల్..వీరికేం పనిలేదా..?
ఇది కూడా చదవండి ==> ఇన్ని రకాలుగా చూపిస్తుంది కాబట్టే అందరూ రష్మిక వెంటపడుతున్నారు
ఇది కూడా చదవండి ==> మూడు సార్లు చావును చూసిన స్టార్ హీరోయిన్..అసలేం జరిగిందంటే..?
ఇది కూడా చదవండి ==> ఆ తిప్పడం ఏంటో ఊపడం ఏంటో.. యాంకర్ విష్ణుప్రియ వీడియో వైరల్