Kasthuri : తెలుగు జాతిని నేను అవ‌మానించ‌లేదు.. క‌స్తూరి కామెంట్స్ వైర‌ల్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Kasthuri : తెలుగు జాతిని నేను అవ‌మానించ‌లేదు.. క‌స్తూరి కామెంట్స్ వైర‌ల్..!

 Authored By ramu | The Telugu News | Updated on :4 November 2024,2:00 pm

ప్రధానాంశాలు:

  •  Kasthuri : తెలుగు జాతిని నేను అవ‌మానించ‌లేదు.. క‌స్తూరి కామెంట్స్ వైర‌ల్..!

Kasthuri : న‌టి క‌స్తూరి వివాదాల‌తో ఎప్పుడు వార్త‌ల‌లో నిలుస్తుంది.లేడీ సూపర్‌స్టార్‌ నయనతార, విఘ్నేశ్‌ శివన్‌ తల్లిదండ్రులైన అయినప్పుడు. ఈ దంపతులు సరోగసి పద్థతిలో తల్లిదండ్రులైనట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ తరుణంలో నటి కస్తూరి చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. ‘‘భారతదేశంలో సరోగసి బ్యాన్‌ అయింది. జనవరి 2022 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. మెడికల్‌ రీజన్స్‌, క్లిష్ట పరిస్థితుల్లో తప్ప దీనిని ఎంకరేజ్‌ చేయకూడదు. భవిష్యత్తులో దీని గురించి ఎక్కువగా వినబోతున్నాం’’ అంటూ ఆమె ఓ ట్వీట్‌ చేసింది. దీనిని చూసిన నయనతార అభిమానులు కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘మీ పని మీరు చూసుకోండి’ అని నెట్టింట ఏకిపారేసారు.

Kasthuri ఎవ‌రు న‌మ్మోద్దు..

ఇక తాజాగా “రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారు. 300 ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు ఇప్పుడు తమది తెలుగు జాతి అంటుంటే, మరి ఎప్పుడో ఇక్కడకు వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పేందుకు మీరెవరంటూ” మాట్లాడారు. దీంతో ఈ వ్యాఖ్యలు చిచ్చురేపుతున్నాయి. అలాగే “ఆస్తులను లూటీ చేయవద్దని, ఇతరుల భార్యలపై మోజుపడొద్దని, ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను చేసుకోవద్దని బ్రాహ్మణులు చెబుతుండటంతోనే తమిళనాడులో వారికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని” కస్తూరి ఆరోపించారు.

Kasthuri తెలుగు జాతిని నేను అవ‌మానించ‌లేదు క‌స్తూరి కామెంట్స్ వైర‌ల్

Kasthuri : తెలుగు జాతిని నేను అవ‌మానించ‌లేదు.. క‌స్తూరి కామెంట్స్ వైర‌ల్..!

తెలుగు ప్రజలపై తమిళ నటి, బీజేపీ నాయకురాలు కస్తూరి నోరు పారేసుకున్నారు. రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చిన వారే తెలుగు వారని, అలా వచ్చిన వారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన తెలుగు నా మెట్టినిల్లు. తెలుగు వారు నా కుటుంబం. ఇది తెలియ‌ని వారు నా వ్యాఖ్య‌ల‌ని త‌ప్పుగా అర్ధం చేసుకున్నారు. త‌మిళ మీడియాలో నా కామెంట్స్ వ‌క్రీక‌రిస్తే ఇది ఎవ‌రు న‌మ్మోద్ద‌ని కోరుతున్నాను.డీఎంకే నాపై నెగిటివిటీ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేస్తుంది. ద‌య‌చేసి దీనిని ఎవ‌రు న‌మ్మోద్ద‌ని కోరుతున్నాను అంటూ క‌స్తూరి క్లారిటీ ఇచ్చింది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది