Intinti Gruhalakshmi Kasthuri : బిగ్‌బాస్‌లో చూపించేవన్నీ వాస్తవాలు కావట.. సీరియల్ నటి కస్తూరి కామెంట్స్
Intinti Gruhalakshmi Kasthuri: అన్ని భాషల్లోనూ పాపులర్ రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ ఉంది. తెలుగు భాషలో ఈ షో ఐదో సీజన్ నడుస్తోంది. ఇకపోతే తమిళ్ భాషలోనూ ఐదో సీజన్ కొనసాగుతుండటం గమనార్హం. ఈ సంగతులు ఇలా ఉంచితే ‘బిగ్ బాస్’పై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది.తమిళ్ ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల స్టార్ట్ కాగా ఇంత వరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఫేమ్, నటి […]
Intinti Gruhalakshmi Kasthuri: అన్ని భాషల్లోనూ పాపులర్ రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ ఉంది. తెలుగు భాషలో ఈ షో ఐదో సీజన్ నడుస్తోంది. ఇకపోతే తమిళ్ భాషలోనూ ఐదో సీజన్ కొనసాగుతుండటం గమనార్హం. ఈ సంగతులు ఇలా ఉంచితే ‘బిగ్ బాస్’పై నటి కస్తూరి సంచలన వ్యాఖ్యలు చేసింది.తమిళ్ ‘బిగ్ బాస్’ సీజన్ ఫైవ్ ఇటీవల స్టార్ట్ కాగా ఇంత వరకు తాను ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని ‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ ఫేమ్, నటి కస్తూరి శంకర్ ట్విట్టర్ వేదికగా తెలిపింది.
‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్‌లో ‘తులసి’గా తెలుగు ప్రేక్షకులకు కస్తూరి సుపరిచితమే. కాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన కస్తూరి ఇలా ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదని, తన లాగా ఎవరైనా ఉన్నారా? అని ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కస్తూరికి మద్దతు తెలుపుతూ తాము కూడా చూడలేదని కొందరు చెప్తుండగా, మరి కొందరు చూశామంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే గతంలో ‘బిగ్ బాస్’తమిళ్ సీజన్ త్రీలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన కస్తూరి అప్పటి పర్ఫార్మెన్స్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
Intinti Gruhalakshmi Kasthuri: కస్తూరి ట్వీట్‌తో ‘బిగ్ బాస్’పై సోషల్ మీడియాలో దుమారం..
‘అప్పట్లో మీరు హౌజ్‌కు వెళ్లినపుడు.. మీపై చాలా హోప్స్ పెట్టుకున్నాం. కాని మీరు మధ్యలోనే వచ్చేశారు… మీ కంటే మిగతా కంటెస్టెంట్స్ చాలా బాగా టాస్కులు పూర్తి చేశారు’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. దానికి కస్తూరి స్పందించింది. ‘మీరు చూసినదాన్ని బట్టి జడ్డ్ చేయొద్దని, హౌజ్‌లో జరిగిన వాటిలో చూపించేవన్నీ నిజాలు కావు’ అని కస్తూరి తెలిపింది. ఈ క్రమంలోనే హౌజ్‌లో వంట ఎలా చేశారు? అంత మంది కంటెస్టెంట్స్‌కు ఒకటే కుక్కర్‌లో ఫుడ్ వండటం సాధ్యమేనా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, దానికి సమాధానమిచ్చింది కస్తూరి.
కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతుంటారు కాబట్టి సంఖ్య తగ్గుతుందని, అలా వంట సరుకులు కూడా తగ్గుతాయని చెప్పింది. ఈ క్రమంలోనే తాను త్వరగా హౌజ్ నుంచి బయటకు రావడం పట్ల ఆనందంగా ఉన్నానని, అందుకు దేవుడికి థాంక్స్ చెప్తానని కస్తూరి వివరించింది.