Kasthuri Fame Aishwarya : ఆమె తండ్రి అలాంటి వాడా?.. ‘కస్తూరీ’ సీరియల్ హీరోయిన్ కంటతడి
Kasthuri Fame Aishwarya : కొందరు జీవితాలు తాము తెరపై పోషిస్తోన్న పాత్రలకు అతి దగ్గరగా ఉంటాయని చెబుతుంటారు. అలాంటి వారిలో కస్తూరీ సీరియల్ హీరోయిన్ కూడా ఒకరు. అధికార దాహంతో ప్రేమించిన ప్రియురాలిని, పుట్టబోయే బిడ్డను కూడా కడుపులోనే చంపేస్తాడు. అలాంటి రాక్షసుడి నుంచి తప్పించుకునేందుకు తల్లీకూతుళ్లు జీవితంలో పోరాటం చేస్తుంటారు. అదే కస్తూరీ సీరియల్ కథ.

kasthuri fame aishwarya pisse emotional at star maa pariwar awards
కస్తూరీ సీరియల్ కథలో ఉన్నట్టే.. తన తండ్రి ప్రేమను ఇంత వరకు చూడలేదు అని ఐశ్వర్య ఎమోషనల్ అయింది. కస్తూరీ పాత్రలో నటించే ఐశ్వర్యకు ఇప్పుడు బుల్లితెరపై మంచి క్రేజ్ వచ్చింది. కస్తూరీ సీరియల్ బాగానే క్లిక్ అయింది. దాంతో ఐశ్వరకు మంచి పాపులారిటీ దక్కింది. తాజాగా నిర్వహించిన స్టార్ మా పరివార్ అవార్డు ఫంక్షన్‌లో ఉత్తమ కూతురి అవార్డు ఐశ్వర్యను వరించింది.
Kasthuri Fame Aishwarya తండ్రిపై కస్తూరీ ఫేమ్ ఐశ్వర్య

kasthuri fame aishwarya pisse emotional at star maa pariwar awards
సీరియల్‌లో ఉన్నట్టే తన జీవితంలోనూ జరుగుతోందని ఐశ్వర్య ఎమోషనల్ అయింది. తనకు తండ్రి ఉన్నా లేనట్టేనని, ఇంత వరకు తండ్రి ప్రేమను కూడా చూడలేదు అని స్టేజ్ మీదే అందరి ముందు ఎమోషనల్ అయింది. కస్తూరీ ఏడుస్తూ అందరినీ ఏడిపించేసింది. మొత్తానికి కస్తూరీగా ఐశ్వర్యా తెలుగు ప్రేక్షకులకు దగ్గరై ఉత్తమ కూతురి అవార్డును సొంతం చేసుకుంది.